ఎన్నో జన్మల పుణ్య ఫలం …..సాయి@366 జనవరి 1….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


“ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని, ఎట్టి జంతువు గాని, ప్రాణి గాని నీ వద్దకు వచ్చినచో, నిర్ధాక్షిణ్యముగా దానిని తరిమి వేయకుము.

వారిని ఆహ్వానించి తగిన గౌరవ మర్యాదలతో ఆదరించు” అని పలికారు సాయిబాబా.

సాయిబాబాతో గత జన్మల బంధం లేనిదే మనము ఆయనను సేవింపలేము. మన పుణ్యాధిక్యము వలననే సాయి పరిధిలో ఉన్నాము. సాయి భక్తులమయ్యాము.

సాయితో మనకు గల గత జన్మల బంధము మన మెరుగము. కాని సాయికి అది తెలుసు.

“అర్జునా! నీకు, నాకు మధ్య ఎన్నో జన్మలు గడిచాయి. వాటిని గురించి నాకు తెలుసు. నీకు తెలియదు” అన్నాడు కృష్ణుడు.

జనవరి 1న సాయి తాను, బాపు సాహెబ్ జోగ్, దాదా కేల్కర్, మాధవ రావ్ దేశ్ పాండే, కపర్డే, కాకా సాహెబ్ దీక్షిత్ ఒకే గురువును సేవించామని, మరల మళ్లీ కలిసామని చెప్పారు.

శ్రీమతి చంద్రబాయి బోర్కర్ ను గురించి మాట్లాడుతూ “ఈమె ఏడు జన్మల నుండి నా చెల్లెలు. నేనెక్కడ ఉన్నా నన్ను వెతుక్కుంటూ వస్తుందీమె” అన్నారు సాయి.

నార్కే మొదటిసారిగా సాయి బాబాను దర్శించాడు. అప్పుడు శ్యామా నార్కేను పరిచయం చేయబోతుంటే, “వీడిని నీవు నాకు పరిచయం చేస్తావా? వీడు నాకు ముప్పది జన్మలుగా తెలుసు” అన్నారు సాయి.

బాబా మరొక సందర్బములో శ్యామా (మాధవరావ్ దేశ్ పాండే)తో “నీకు నాకు మధ్య 72 జన్మల బంధం ఉన్నది” అన్నారు.

యాశ్వంతరావ్ గాల్వంకర్ ను గూర్చి చెబుతూ “వీడు పూర్వ జన్మలో పవిత్రమైన నడవడి గలవాడు. అందుచేత ఇప్పుడు ఈ తల్లి గర్భాన జన్మింప చేసాను” అన్నారు.

సాయి మనలను కరుణించాడు. అందుకనే ఆయన ప్రాంగణంలో ఇంత చోటిచ్చాడు. ఒక జన్మలో సాయి భక్తుడయితే చాలు, జన్మ…జన్మలకు అయన రక్ష ఉంటుంది మనకు.

” నీ చేష్టలు, ఆలోచనలు నా కొరకే వినియోగింపుము” అన్నారు సాయి. అందుకు భిన్నముగా నుండని స్థితిలొ ఎల్లప్పుడు మనం ఉండాలి.

నేడు జనవరి 1 – ఆంగ్ల నూతన సంవత్సరము ప్రారంభం. సాయిని ఈనాడు ఇట్లు ప్రార్ధించెదము గాక –

“నీ పాద కమల సేవయు

నీ పాదార్చకులతోడనెయ్యమును నితాం

తాపార భూత దయయును,

దాపన మందార! నాకు దయసేయగదె …”

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles