కొంచెం హాస్యం…..సాయి@366 జనవరి 5….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


జీవితం ఎప్పుడూ సుఖమయంగానూ ఉండదు, కష్టాల కడలి గానూ ఉండదు. కష్టాలు, దుఃఖాలు కలిగినప్పుడు కృంగి పోకుండా ఉండాలి.

జనవరి 5 వ తారీకు 1912 న సాయిబాబా తన బాధలన్నిటిని హాస్య పూర్వకంగా తెలిపారు. అలా పలకటం కొంత ఉపాశమనాన్ని కలిగిస్తుంది.

రమణ మహర్షులకు ఒకసారి జ్వరం వచ్చింది. అయన శరీరం వణుకుతూ తూలసాగింది.  ఎట్లాగో ఆయన వచ్చి సోఫాలో కూర్చున్నారు.

శాంతమ్మ అనే భక్తురాలు భగవాన్ ను చూసి “అయ్యో శరీరం” అన్నదో లేదో, వెంటనే భగవాన్ “ఓహో శరీరమా! ఏమి? ఏమయ్యింది? వణుకుతున్నది అంతేగా, వణికితే ఏమి?” అంటు ఒణుకును అణుచుకుని నవ్వుతూ మాట్లాడసాగారు.

ఇంకా ఆయన నవ్వుతూ “అది నటరాజ తాండవమయ్యా, భయమెందుకు? నిత్యం అచల దర్శనమైతే ఈ రోజు తాండవ దర్శనం అంతేగా, దీనికింత గాభరా ఎందుకు”? అని పలికారు.

రమణుల కణితి నుండి రక్తం కారుతొంది. అందరు గాభరాపడసాగారు.  ఐతే రమణులు దానినేదో ప్రత్యేకంగా తీసుకోలేదు.

“చూడండయ్యా, సూర్యకాంత మణి (కణితి) మనకు అలంకారమయ్యింది. శమంతకమణి పచ్చ బంగారు పెడుతుంటే, ఇది ఎర్ర బంగారం పండిస్తోంది” అన్నారు.

భగవాన్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి తనను ఎవరో అస్తమానం దూషిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. భగవాన్ విని ఊరుకున్నారు.

ఎన్ని సార్లు చెప్పిన భగవాన్ స్పందించక పోవటం పట్టలేక “అనవసరంగా అలా తిడుతుంటే నాకు కోపం వస్తోంది. ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగటంలేదు; నేను ఏం చేయాలి?” అని ప్రశ్నించాడు.

భగవాన్ నవ్వుతూ “ఏం చెయ్యాలా? నీవు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో సరిపోతుంది “ అన్నారు. అందరూ నవ్వసాగారు.

సాయి సాహిత్యంలో కూడా హాస్య, చమత్కార సంభాషణలు చోటు చేసుకున్నాయి.

“మరోసారి సాయి కధలు” చెప్పిన డాక్టర్ అక్కిరాజు రమాపతి రావు గారు, తన వరుసకు బావమరిది అయిన ప్రొఫెసర్ జి.వి.యస్.ఆర్. కృష్ణమూర్తి గారితో మద్రాసులో ఉన్న యన్.ఆర్.చందూర్ గారింటికి వెళ్లారు.

కాసేపు అందరు కులాసాగా కబుర్లు  చెప్పుకున్నారు. చందూర్ గారి భార్య మాలతీ చందూర్ టీ తెస్తాను అంటూ లేచింది. అక్కిరాజు గారు “చక్కర లేకుండా” అన్నారు.

కృష్ణమూర్తి గారు “మా బావగారు అసలే చెరుకు గడ, ఆయనకు చక్కర అక్కర్లేదు”అన్నారు. అది చక్కర వ్యాధి మీద తీయటి ముచ్చట!.

నలుసంత హాస్యంతో కొండంత భారాన్ని తొలగించుకొందాం!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles