Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఒక వ్యక్తి ఔన్నత్యం, ఆతడు మహనీయులకు చేసే వినతిని బట్టి గ్రహించవచ్చును.
నాగేశ్ వాసుదేవ గుణాజీ పేరు తెలియని సాయి భక్తుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు.
గుణాజీ గారు శ్రీ రమణులను గురించి విని వారిని దర్శించారు.
గీతా వ్యాఖ్యానం వ్రాయటం ముగించిన తరువాత జ్ఞానేశ్వరుడు ఒక వరాన్ని కోరిన విధంగానే, గుణాజీ గారు రమణులను ఒక వరాన్ని కోరారు.
”ఓ! భగవాన్ మీరు మాకేదైనా అనుగ్రహించేటట్లయితే ఇట్లా అనుగ్రహించండి. మా అహంకారం అంతర్ధానమవ్వాలి, మా దృష్టి (ఆత్మపై) కేంద్రీకృతమవ్వాలి.
ఇంద్రియాతీతమైన సహజమైన ఆనందం కలగాలి. ఉదకంలో కరిగిపోయే ఉప్పు వలె మా మనస్సులు ఆత్మలో లీనమవ్వాలి”.
దీన్ని విని శ్రీ భగవాన్ సంతోషించారు. వారు కాళ్ళు బారజాపుకొని బిగ్గరగా ”తీసుకోండి, తీసుకోండి, మీ కెంత కావాలో తీసుకోండి. లోపలికి వెళ్ళండి” అన్నారు.
”అప్పుడు శ్రీ భగవానుని రూపం చూడాలి! దేవతలు చూడదగ్గ దృశ్యమది. ఆ రూపాన్ని ఎన్నటికి మరచిపోలేను” అన్నారాయన.
గుణాజీ గారు అప్పుడు తనకు కలిగిన ఆనందాన్ని సాయి చరితను చదివే సాయి భక్తులకు పంచిపెట్టారు.
ఆయన కేవలం మరాఠీ వచ్చిన వారు మాత్రమే పఠించగలిగిన సాయి సచ్చరితను క్లుప్తంగా ఆంగ్లీకరించారు.
ఆ ఆంగ్ల గ్రంథాన్ని పారాయణ చేసిన భక్తులు ఎందరో..ఎందరెందరో! ఆ గ్రంథాన్ని చదువుతుంటే సాయి భక్తులు పరవశించిపోతారు. ఆ గ్రంథమే ప్రామాణిక గ్రంథంమైంది.
ఆ గ్రంథాన్ని దేశ, విదేశాలలో తమ మాతృ భాషలోనికి అనువదించిన వారు వేలకు వేలు. గుణాజీ గారు మూలానికే వన్నె తెచ్చారు- పసిడికి పరిమళం తోడైనట్లు సాగుతుంది ఆ అనువాదం.
ఒకటి, రెండు ఉదాహరణలు .. మొదటి అధ్యాయంలో సాయినాథుడు గోధుమలను విసరే సంఘటనలో కబీరు-నిపతిరంజన్‌ల గాథను తెలపటం. సాయిబాబా తెలిపినట్లు సాయి నివసించిన మసీదే ద్వారక అని స్కంధ పురాణంలోని శ్లోకాన్ని ఉటంకించారు గుణాజీ
సాయి సచ్చరిత 4వ అధ్యాయంలో. పౌరాణికంగా ద్వారకామాయినే ద్వారకగ చూపారు గుణాజీ.
గుణాజీ 1873 జూలైలో జన్మించారని, 1963లో దేహాన్ని వదిలారని తెలుస్తోంది.
ఈనాడు జూలై మాసంలో ఒక రోజు. ఈనాడు గుణాజీ గారు రచించిన గ్రంథాన్ని లేదా కనీసం ఒక భాగాన్ని పఠిద్దాం! ఆయనను స్మరిద్దాం!!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- రమ్య భవనం …..సాయి@366 మే 20….Audio
- స్మరణమాత్ర ప్రసన్నాయ…..సాయి@366 జూలై 1…..Audio
- మరచిపోయేది మానవ హృదయం…..సాయి@366 జూలై 9….Audio
- చెరసాలలో జననం… మహనీయులు – 2020… జూలై 23
- పాఠకుడే పారాయణ గ్రంధకర్త …..సాయి@366 జూలై 15…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments