పాఠకుడే పారాయణ గ్రంధకర్త …..సాయి@366 జూలై 15…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support by: Mrs. Jeevani


సాయి మహారాజు వద్దకు వచ్చిన వేలమంది భక్తులలో గోవింద రావు రఘునాథ ధబోల్కర్‌ ఒక భక్తాగ్రేసరుడు.

ఆయనచేత సాయి ప్రాసాదిక గ్రంథమును రచింప చేశారు. గతంలో ఏ రచనా చేయని వ్యక్తిచే పారాయణ గ్రంథాన్ని రచింప చేయటం సాయి మహత్తే,

ఇంకా చెప్పాలంటే అది హేమాడ్‌పంత్‌, పాఠకుల అదృష్టం కూడా.

పారాయణ గ్రంథ రచనకు పూనుకొనుటకు ముందు శారీరక, మానసిక, వాచిక దుర్గుణాలను తొలగించి పవిత్రతను నెలకొల్పారు సాయి.

మట్టిని బంగారం చేశాడు సాయి. గతంలో వలె అహంభావం లేదు హేమాడ్‌కు.

గురువు అంటే చులకన భావం లేదు. తన ఆయువును పరమార్ధానికి, పరోపకారానికి వినియోగించాడు.

ఏ శ్రీమంతుడైనా, పేరున్నవాడైనా సరే తనను కలవానికి వస్తే, తన సమయాన్ని వెచ్చించి ప్రేమతో మాట్లాడేవాడు.

ఆయన మనోవృత్తి ఎల్లప్పుడు ఆనందంగా ఉండేది. ఆయనకు కథా కీర్తనలయందు ప్రీతి.

అందువలన ఆహ్వానం కోసం ఎదురు చూడకుండా వినటానికి వెళ్ళేవాడు. పేద విద్యార్ధుల చదువు కోసం వారు చాల సహాయం చేసేవారు.

ఎవరైనా ఏదైనా అడిగితే లేదనే వారు కాదు. వారు పేదరికం నుండి పైకి రావటం వలన పేదల కష్టాలు తెలుసుకుని సాయం చేసేవాడు.

దభోల్కర్‌ చాలా పొదుపరి. చిన్న, చిన్న చిత్తు కాగితాలను కూడా వృధా చేసే వారు కాదు.

ఏ పనినైనా చాతుర్యంతో చక్కగా చేసే స్వభావం వారిది. చిన్న, చిన్న కాగితం ముక్కలపైన వ్రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకు ఇచ్చేవారు. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు.

జీవంలేని చిన్న కాగితం ముక్కలపై వారికి దయ కలిగి, వానిని సత్పురుషులైన శ్రీ సాయి సేవలో ఉపయోగించక పోతే అవి ఎలా ఉద్ధరింపబడతాయి? అని హేమాడ్‌పంత్‌కు అనిపించి కాగితపు ముక్కలను పోగు చేసుకుని వాని ద్వారా ఈ సేవను చేయించి ఉండవచ్చును.

అది వారి ఉదాత్తమైన ఉద్దేశం. ఇది వారధి కట్టడంలో ఉడత సాయాన్ని తలపిస్తుంది.

తమను తాము మెరుగుపరచుకొనుటయే కాదు, అందరినీ, అందరికి సాయపడుటను హేమాడ్‌పంత్‌ జీవితం తెల్పుతుంది.

గురు కటాక్షం  కోసం చకోర పక్షిలా ఉంటే సాయి చంద్రుడు కరుణించక మానడు.

హేమాడ్‌పంత్‌ 15 జూలై, 1929న సాయిలో ఐక్యం అయ్యారు.

ఆయనలా మనం సాయి సచ్చరితను రచింప లేక పోవచ్చును. కాని, ఆయనకు ఉన్నటువంటి గురుభక్తిని సంపాదిద్దాం!

సద్గురు సాయి కరుణా కాటాక్షాలు మనందరికి లభించ వలెనని మనసారా సాయిని వేడుకుందాం!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles