Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఇందిరా దేవి గారి అనుభవములు నాల్గవ భాగం
ఒక సారి మేమంతా కలసి షిరిడి వెళ్ళాలనుకుని రిజర్వేషన్ చేయించుకున్నాము. స్టేషన్ కి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకున్నాము.
ఆటో వాడు స్టేషన్ లోపలికి పోకుండా ఆటోని బయటే ఆపేసి దిగిపొమ్మన్నాడు.
మేము సూటుకేసులు ఉన్నాయి ఎలా వెడతాము అంటూ వాడితో నేనే అసభ్య పద జాలంతో ఆ ఆటో వాడిని బాగా తిట్టాను.
అదంతా విన్న మా వారు వెంటనే నా మొహం చూసి ‘మనం షిరిడి వెడుతున్నాము నువ్వు పారాయణ కూడా చేస్తుంటావు ఆ మాటలేంటి ఆ కోపం ఏంటి అన్నారు. అయినా కూడా ఆయన మాటలు పట్టించుకోలేదు.
షిర్డీ చేరుకున్నాము. హోటల్ లో దిగాము. మేము నలుగురం ఉండటం మూలాన extra bed కోసం pay చేసాము.
కాకడ ఆరతి కి వెళ్ళాము. పూల దుకాణం దగ్గర చెప్పులు వదిలి నేనే మా అబ్బాయితో ఇది షిరిడి, ఇక్కడ దొంగతనాలేమి జరగవు.
పెట్టటానికి అనుమానిస్తుంటే ఎక్కడ వేసిన వస్తువులు అక్కడే ఉంటాయి. నువ్వేమి సందేహించక్కరలేదు, పెట్టు అక్కడ చెప్పులు అన్నాను. వాడు చెప్పులు వదిలిపెట్టాడు.
మేము బయటకు వచ్చేటప్పటికి చెప్పులు లేవు. మా అబ్బాయి, మావారు ఇద్దరూ ఆ పూల దుకాణం అతనితో గొడవపడ్డారు.
మధ్యాహ్నం హారతికి వెడితే లైన్ లో వెనక ఉన్నవాళ్లు మమ్మల్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్లిపోయారు.
మావారసలు చాలా ఫాస్ట్ అలా లైన్లో ఎవరైనా ముందుకు పోబోతే వెళ్ళండి అంటూ తను తప్పుకుని వాళ్ళని ముందుకు పంపుతారు.
అలాంటిది వీళ్ళు ముందుకు ఎలా వెడతారో చూద్దామంటున్నారు. లైన్ లో వెనక్కి తిరిగి మరీ దెబ్బలాడుకుంటున్నారు.
సమాధి మందిరంలోకి వెళ్లిపోయాము. మగవాళ్ల వైపు ఆయన అబ్బాయి ఆడవాళ్ళ వైపు నేను అమ్మాయి నిలబడ్డాము.
నాకెందుకో విపరీతమైన దుర్వాసన వస్తుంది. హారతి మీద మనసు నిలబడటం లేదు. నేను ముక్కు మూసుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా అసహనంగా కదులుతున్నాను.
హారతి అయ్యాక మేము బయటకి వచ్చాక నేను షిరిడిలో ఉండంగా భోజనం చెయ్యకూడదు అంటూ నేను నియమం పెట్టుకున్నాను.
అందుకని జామకాయ ఒకటి కొనుక్కున్నాను, కట్ చేసి ఇస్తానంటే కూడా వద్దని నేనే పళ్ళతో కొరుక్కుంటూ తింటూ సగం జామకాయ తినటం అయ్యాక అప్పుడు పండు చూస్తే ఏముంది ఆ పండు నిండా పురుగులు బిలబిలమంటున్నాయి.
ఎన్ని పురుగులు నేనే తినేశానో అనుకుంటూ ఆ పండును పడేసాను. వాంతి వచ్చేటట్లు ఉంది.
సాయంత్రం మేము రూమ్ ఖాళి చెయ్యాలి. డిపాజిట్ డబ్బులు ఇవ్వనంటూ హోటల్ వాడు గొడవ పెట్టుకున్నాడు. extra bed వేసుకున్నారు అందుకు ఇవ్వనంటాడు వాడు.
మేము దానికి వేరే pay చేశామంటారు ఈయన. సరే మొత్తానికి బస్సు బయలుదేరుతుంది. బస్సు ఎక్కాము, మా సీట్లలో వేరే నలుగురు కూర్చుని ఉన్నారు. వాళ్ళు లేవం అంటున్నారు.
ఎందుకు ఎలా లెవరో చూస్తానంటూ మీరు లేచే వరకు ఇలాగే నిలబడే ఉంటాను అంటూ అక్కడే నిలబడ్డాను. మొత్తానికి వాళ్ళని దింపేసాము.
మా అబ్బాయికి ముందే కోపం ఎక్కువ వాడేం మాట్లాడటం లేదు, “ఎందుకు రా ఎం మాట్లాడటం లేదు అంటే పాపం అమ్మ! వాళ్ళని చూస్తుంటే జాలి వేస్తుంది. చిన్నబాబు ముసలాయన ఉన్నారు గదమ్మా!”అన్నాడు వాడు.
వాడలా అన్నాక కూడా నా మనసుకు ఏం అర్ధం కావటం లేదు. ఇంటికి వచ్చాక మేము బయలుదేరిన దగ్గర నుండి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటే ఇన్నిసార్లు పారాయణ చేస్తూ కూడా నేను ఏదైనా బాబా చెప్పినట్టు ఒక్కటన్నా పాటిస్తున్నానా బస్సులో సీట్లు నాకేమైనా సొంతమా?
బాబా నానావళికి తను కూర్చున్న గద్దెనిచ్చాడే మరి నేనేం చేసాను. నాది అంటూ వాళ్ళని ఏకంగా బస్సే దింపేసానే అనే ఆలోచనలు నన్ను నిలవనీయ లేదు.
మా చెల్లెలు కూడా బాబా భక్తురాలు. వాళ్ళు మెహదీపట్నంలో ఉంటారు. పక్క వాటాలో ఉన్న వాళ్ళు కూడా బాబా భక్తులే.
ఆ పక్క వాటాలో ఒక హ్యాండీ క్యాపిడ్ అమ్మాయి ఉంది. మా చెల్లెలు వాళ్ళు ఎపుడు షిరిడి వెడుతున్నా, భజన పెట్టుకుంటారు.
దానికోసం భార్యాభర్తలు ఇద్దరు వంటలు చేస్తున్నారు. పక్కింటికి అచ్చం బాబాలాగా కఫినీ, చేతిలో భిక్ష పాత్ర అది చాలా పాతగా (ఒక 100 సంవత్సరాల క్రితం లాగ ఉంది) ఆ పక్కింటాయనకి వాళ్ళ గుమ్మం లో మట్టి తీసిచ్చాడట.
ఆ మట్టి ఆవిడ లోపల పెట్టేసరికి పువ్వులై పోయాయి. ఆ విషయం వాళ్ళు (మా చెల్లెలి కొడుకు) గమనించి మా చెల్లెలితో చెప్పి లోపలి నుండి బయటకి పిలిచాడు వాడు.
వాళ్ళమ్మని వంట చేస్తున్న వాళ్లిద్దరూ బయటకి వచ్చేసరికి ఆ ముసలాయన ‘బైఠో’ అంటూ మా చెల్లిని కర్ర పెట్టి బెదిరించి కూర్చోబెట్టాడుట.
అయిదు రూపాయల కాయిన్స్ మాత్రమే తన బిక్ష పాత్ర లో వేయించుకుంటున్నాడు. మిగతా పెద్ద నోట్లు ఏమిచ్చినా తీసుకోవడం లేదు.
ఆ ముసలాయన ఇంకెవరింటికి కూడా వెళ్ళకుండా తిరిగి వెళ్ళిపోయాడట.
సాయంత్రం భజన సమయంలో మా చెల్లెలు మా ఇంటికి బాబా వచ్చాడంటూ అందరికీ చెప్పింది. అందరూ సంతోషంగా భజన చేశారా రోజు.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
ఇందిరా దేవి గారి అనుభవములు ఐదవ భాగం తరువాయి….
Latest Miracles:
- లాటరీ ద్వారా ఇంటికి వచ్చిన బాబా.
- నాతో కుంటాట ఆడి నా నడుము నొప్పి ని బాగు చేసిన బాబా వారు …..!
- స్థోమత లేకపోయినా షిరిడీ యాత్ర చేయించిన బాబా !
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
- తన భక్తుల మేలు కొరకు దుర్గ మమగు ఏ కార్యమైనా సుగమం చేయు బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments