జనన మరణ చక్రం నుండి, బయటపడవేసే భగవతారాధన.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా స్నేహితుడైన భాను భార్యకి ఒక స్నేహితురాలు ఉంది. ఆమె పేరు రజని. ఆమె ఒకతన్ని ప్రేమించింది. ఒకళ్ళు నొకళ్ళు ఇష్టపడ్డారు.

పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు. జాతకాలు చూపిస్తే ఆ అబ్బాయికి  మరణగండం ఉందని చెప్పారట.  అందుకని ఆ అమ్మాయి తల్లితండ్రులు ఆ అబ్బాయిని పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకోలేదు.

చాలా మంది సిధ్ధాంతులకు చూపించారు. వాళ్ళు కూడా ఇదే విషయం నొక్కి వక్కాణించారు.

మా ఇంట్లో భజన  జరుగుతున్నప్పుడు ఆ అబ్బాయి రజని ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. భజన జరుగుతూండగానే నేను యధాప్రకారం ధ్యానం లోకి వెళ్లిపోయారు.

ఆ ధ్యానంలో నాకు బాబా ఒకటి చూపిస్తున్నాడు. అదేమిటంటే ఆ అబ్బాయికి (రజనీ ని చేసుకోవాలని అనుకున్న ఆ అబ్బాయి) తలపైన ఒక పెంకు లాంటిది కనపడుతుంది.

బాబా అతని నెత్తి పైన బిందెలతో పాలు పోస్తున్నాడు. అలా చాలాసేపు పాలుపోశాడు. అలా పోసాక ఆ పెంకు పైన కొట్టాడు. ఆ పెంకు కింద పడిపోయింది,

అది తీసి నా చేతిలో పెట్టి ”ఇంకా ఫర్వాలేదు వారిద్దరూ సంతోషంగా వివాహం చేసుకోవచ్చు, ఇంక ఏం కాదు వారికి సంతోషంగా వివాహం చేసుకోవచ్చు అని చెప్పు” అని బాబా చెప్పాడు.

నేను ఆ అమ్మాయి కి బాబా నాకు చూపించిన, చెప్పిన విషయం అంతా చెప్పి ఆగస్టు నాటికీ వివాహం అయిపోతోందని కూడా చెప్పాను.

అది అలాగే జరిగింది. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో సంతోషం గా ఉన్నారు.

మేమంతా ”చార్ ధామ్” యాత్రకు వెళ్ళాము (ఆఫీస్ వాళ్ళం అంతా కుటుంబాలతో) నేను బాబాను ఎప్పుడు బయటికి వెళ్ళినా నువ్వు నాతో పాటు రా బాబా అని కోరుకుంటాను.

నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు కనపడాలి అని అనుకుంటాను. బదరీనాథ్ వెళ్ళాము, బస్సు ఎక్కగానే బస్సులో బాబా ఫోటో కనపడింది. 14 రోజులు ఆ బస్సులోనే ప్రయాణం చెయ్యాలి.

గంగోత్రికి బయలుదేరాము, మధ్యలో ఉత్తరకాశీ వెళ్ళాలి. గంగోత్రి రోడ్డు అంతా బ్లాక్ అయిపొయింది అన్నారు.

ఆ రోజు గురువారం అందరూ భజన చేస్తున్నాము. బాబా ఇక్కడ నువ్వు నా దగ్గరికి వచ్చి భిక్ష తీసుకువెళ్లాలి అని అనుకున్నాను.

12 గంటల సమయం ఒక అపరిచిత వ్యక్తి వస్తున్నాడు. ఎవరూ కూడా ఆయన్ని పట్టించుకోవడంలేదు. తిన్నగా నా దగ్గరే ఆగాడు.

నాకేమైనా ఇవ్వమంటూ అడిగాడు. వెంటనే ఆలోచించకుండా 10 రూపాయలు ఇచ్చాను. అతను నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.

అక్కడ 25 మంది దాకా ఉన్నారు. ఎవరూ ఆయన్ని గమనించ లేదు. ఎవరూ ఆయన వచ్చి వెళ్ళింది చూడనేలేదు అని చెప్పారు.

నేను బాబాని ధ్యానంలో కొన్ని ప్రశ్నలు అడిగేవాడిని . అవి ఏమిటంటే

”బాబా! నీ అనుగ్రహంలో ఉన్న వాళ్ళు కష్టపడుతుంటారు? ఎందుకు? ” అని అడిగాను.

దానికి ఆయన సమాధానంగా రెండు చెట్లని చూపించాడు, ”అందులో ఒకటి మామిడి చెట్టు, రెండవది దతూరా (ముళ్ల కాయలు ఉండే చెట్టు) రెండూ కూడా పూత, కాయలు ఇస్తున్నాయి.

ఇందులో ఒకటి మాత్రమే తింటున్నాము, మరొకటి తినటం లేదు ఎందుకు?” అని బాబా నన్ను అడిగారు.

”ఇందులో ఒకటి, తింటే మనకి ఆరోగ్యం, ఆనందం వస్తుంది. మరొకటి తింటే మనకది విషంగా మారి ప్రాణాలని తీస్తుంది” అని చెప్పాను.

అవునా? ఈ విషయం నువ్వు ఎలా కనుక్కున్నావు? అని అడిగారు బాబా.

”జ్ఞానం వల్ల” అని అన్నాన్నేను.

దానికాయన ”జ్ఞానం లేకపోవడం అజ్ఞానం, ఏది మంచి ఏది చెడు అన్న విషయం జ్ఞానం తోనే తెలుసుకోగలుగుతారు,

ఆలా తెలుసుకోలేనప్పుడు వాడు కష్టాలపాలవుతాడు. ఈ విచక్షణ కలిగి ఉన్నవాడికి, కష్టాలు ఉండవు. జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. దాన్ని అనువైనటువంటి ప్రదేశంలో ఉపయోగించుకోవాలి.

నా అనుగ్రహం అందరిపైనా ఉంది. కానీ ఒకటి ఫలదాయకంగా ఉంది, దాన్ని ఆస్వాదించ గలుగు తున్నారు.

రెండవది, ఫలాన్ని ఇచ్చినా కూడా అది ఆస్వాదించడానికి పనికి రావడం లేదు.

అంటే నువ్వు  కోరే కోరిక కానీ, మనసులో చేసే ఆలోచన కానీ సరి అయినప్పుడు అందరికి  సమ్మతముగా ఉంటుంది.

సరి అయినది కానప్పుడు నువ్వు ఎంత కరెక్టుగా ఆలోచించాను అని అనుకున్నా కూడా భాదను అనుభవించవలసిందే” అని బాబా నాతో చెప్పటం జరిగింది. ఇది ఒక అద్భుతమైన సందేశం.

నేను బాబాను మరో ప్రశ్న కూడా అడిగాను.

అదేమిటంటే ప్రతి మనిషి జీవితంలోను భగవంతుడి ఆవశ్యకత ఎంత ఉంది? అని అడిగాను .

అప్పుడు బాబా ”నువ్వు పుట్టుకతోనే ఆనందస్వరూపుడవు, నీ చుట్టూ మాయ కమ్ముకొని ఉంటుంది, నువ్వు శరీరమే అనే భావనలో ఉంటావు, నువ్వు ఆనంద స్వరూపుడవూ అన్న విషయం ఒకరు జ్ఞాపకం చేయాలి”.

”ఎవరు జ్ఞాపకం చేయాలి, అసలు ఆనందం అంటే ఏమిటి? అని మరల నేను ప్రశ్న వేయడం జరిగింది.

అప్పుడు బాబా ”మనం ఒక కోరిక కోరుకుంటాం కొన్నాళ్ళకి ఆ కోరిక తీరుతుంది.

మనకప్పుడు సంతోషంగా ఉంటుంది. కొన్నాళ్ళకి మరొక కోరిక  పుడుతుంది, అందాకా ఆ ముందు కోరిక తాలూకా సంతోషం ఉంటుంది.

మరల మరో కోరిక అలా పుడుతూనే ఉంటాయి. ఒక కోరిక తీరిన ఆనందం మరొక కోరిక పుట్టే సమయానికి ముగిసిపోతుంది.

అలా ముగిసిపోయే ఆనందంతో ఆనందస్వరూపులము కాలేము. అసలు ముగింపు లేని ఆనందం కావాలి.

పరమాత్మనైన నేను ఆనందస్వరూపుడను, నేను నిన్ను కూడా అదే ఆనంద స్వరూపునిగానే తయారు చేశాను, భూలోకంలోకి వచ్చిన తర్వాత నువ్వు మనిషిగా ఉండిపోయావు, నువ్వు ఆనంద స్వరూపుడవు.

ఆనందం నీ దగ్గరే ఉందన్న విషయం తెలియజేయాలంటే నీకో వ్యక్తి అవసరం అదే నేనైన భగవంతుడు, ఏ రూపంలోనైనా నిన్ను నువ్వుగా తెలియజేయపరచగలవాడు,

వారు ఎవరైనా కావచ్చు గురువు, తల్లీ, తండ్రి ఎవరైనా కావచ్చు నిన్ను ఆనంద స్వరూపుడివిగా తెలియపరుస్తాడు, వాడే భగవంతుడు అన్ని జీవులు కూడా ఆనంద స్వరూపులే” అని బాబా సమాధానం చెప్పాడు.

నేను మరో ప్రశ్న కూడా బాబాను అడిగాను, ”ఈ జనన మరణ చక్రం ఎందుకు?” అని

దానికి బాబా సమాధానం ”ఒక సముద్రపు ఒడ్డున కూర్చున్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి అలలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి.

అదే వ్యక్తి సముద్రము మధ్యలో ప్రయాణిస్తున్నప్పుడు అలలు ఉంటాయి, అవి సముద్రంలో కనపడవు.

అలాగే ప్రతి మనిషి కూడా భగవంతుని ఆరాధన చేయనంతకాలం జనన మరణాల చక్రంలో ఉంటాము, భగవతారాధన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆయన యందె పుట్టి అంతరించటం జరుగుతూ ఉంటుంది.

భగవంతుడికి దూరంగా ఉన్నంతసేపూ జనన మరణ చక్రంలోనే ఉంటాం. సముద్రపు అలలు చివరి దాకా వచ్చి ఇసుకను, చెత్తను లోపలికి ఎలాగైతే తీసుకువెడుతుందో,

అలాగే మనంకూడా ప్రతీ జన్మ లోనూ కొన్ని కొన్ని సంస్కారాలను మనవెంట తీసుకువెడుతూ ఉంటాం, తీసుకొస్తుంటాం.

మనం మన దృష్టిని భగవంతుడి యందే ఉంచి మన బాగోగులు ఆయనకే అప్పజేప్పినప్పుడు మనం తప్పకుండా జనన మరణ చక్రం నుండి బయటపడతాం” అంటూ  నాకు స్వయంగా బాబా తెలిపారు.

సర్వం శ్రీసాయినాధ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles