Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (5) జనన మరణ చక్రాలు (1వ.భాగమ్)
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీసాయిబాబా ముస్లిమ్ ఫకీరులాగ మసీదులో నివసించినప్పటికీ, ఆయనకు హిందువుల కర్మ సిధ్ధాంతం అనగా జననమరణ చక్రాలపై నమ్మకం ఉంది. ఆయన హిందూ భక్తులతో మాట్లాడుతున్నపుడు ఈ సిధ్ధాంతాన్ని గురించి వెనుకటి జన్మల గురించి ఉదహరిస్తూ ఉండేవారు. కొన్ని చమత్కారాలను చూపించి ఈసిధ్ధాంతం మీద నమ్మకం కలిగించేవారు.
ఒకనాడు మధ్యాహ్న భోజనానంతరం శ్యామా, బాబా చేతులను తన తువాలుతో తుడుస్తుండగా బాబా శ్యామా బుగ్గ మీద గిల్లారు. శ్యామా కోపాన్ని ప్రదర్శిస్తూ, “దేవా! నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మాబుగ్గలు గిల్లే పెంకి దేవుడు మాకక్కరలేదు. మేము నీపై ఆధారపడి యున్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము?” అన్నాడు. అప్పుడు బాబా ఇట్లన్నారు – “శ్యామా! 72 జన్మలనుండి నీవు నాతో ఉన్నప్పటికి నేను నిన్ను గిల్లలేదు. ఇంతవరకు ఎప్పుడు నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్ళకు ఇప్పుడు గిల్లగా నీకు కోపము వచ్చినది.” అధ్యాయం – 36
అలాగే దురంధర్ సోదరులతో బాబా ఇట్లన్నారు – “గత 60 తరముల నుండి మనమొండురలము పరిచయము గలవారము” అధ్యాయం – 50
సాయిబాబా వారు సర్వజ్ఞులు. అయనకు భూత, భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు. ఆయన ఒకసారి ‘బాబు’ అనే పిల్లవాడి గత జన్మల గురించి, రాబోయే జన్మలు ఎక్కడెక్కడ జరుగుతాయో అతని భవిష్యత్తు కూడా చెప్పారు. ఆవిధంగా ఒక ఆత్మ ఏవిధంగా మరలా మరలా జన్మనెత్తుతుందో ప్రతివారికీ సోదాహరణంగా వివరించారు. ఈ వృత్తాంతం హెచ్.హెచ్. నరసింహస్వామీజీ గారు రచించిన శ్రీసాయిబాబా భక్తుల అనుభవాలు (ఆంగ్ల పుస్తకం devotees – experiences of Sri Sai Baba) (page 114) లో రావు బహద్దూర్ హెచ్.వి.సాఠే గారు ఈ విధంగావివరించారు.
“బాబా గారికి దాదాకేల్కర్ గారి (అనగా మా మామగారు) మేనల్లుడు బాబు అంటే ఎంతో అభిమానం. అతను నాదగ్గర అసిస్టెంటయిన లిమాయే దగ్గర కొలతలు కొలిచే ఉద్యోగి. (నేను అప్పుడు కోపర్గావ్, యేవలా కి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ రెవెన్యూ సర్వేయర్ గా ఉద్యోగం చేస్తున్నాను). కాని అతను తన ఉద్యోగ బాధ్యతలను సరిగా నిర్వర్తించకుండా షిరిడీ వెళ్ళి అక్కడ బాబాకి సేవ చేస్తూ ఉండేవాడు. నా బావమరిది (బాబు) చేయవలసిన పనిని నిర్లక్ష్యం చేసి ఎప్పుడూ షిరిడీకి వెళ్ళిపోతున్నాడని నా అసిస్టెంట్ ఫిర్యాదు చేశాడు. నేను ఈ విషయమంతా కేల్కర్ కి చెప్పాను. – “మనం చేయవలసిందేమీ లేదు. బాబా ఏం చెబితే అదే చేస్తున్నాడు. నిజానికి బాబుకి త్వరలోనే ఏం జరుగుతుందన్నది బాబాకు తెలుసు. అందుకే అతను చేసే ఉద్యోగాన్ని చాలా తేలికగా తీసుకొని “పోతే పోనీ ఉద్యోగం – నాకు సేవ చేసుకోనీ” అని బాబా అన్నారని చెప్పారు కేల్కర్. బాబు ఎప్పుడూ బాబా దగ్గరే ఉంటూ తాను చేయగలిగినంత సేవ చేస్తూ ఉండేవాడు. బాబా ఎప్పుడూ బాబుకిష్టమయిన రుచికరమయిన ఆహారపదార్ధాలన్నీ లభించేలా చూసేవారు. లిమాయే కూడా అతనిని అతనికిష్టమయినట్లుగా వదిలేశారు. కొద్ది రోజులలో బాబు మరణించాడు. అప్పుడతని వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. అతనికి భార్య ఉంది, పిల్లలు లేరు.
ఇదే సందర్భంలో శాంతాక్రజ్ నివాసి మోరేశ్వర్ w.ప్రధాన్ చెప్పిన విషయం, ఆ రోజున మేము షిరిడీ చేరుకొన్నాము. బాబా, మాధవరావు దేశ్ పాండేతో నాభార్యవైపు చూపిస్తూ ఇలా అన్నారు “ఈమే నాబాబుకి తల్లి”. చందోర్కర్ తన కోడలిని ఉద్దేశించి బాబా ఆమాటలు అన్నారనుకొన్నాడు. కారణం ఆమె గర్భవతి అని నమ్మకం. అందుచేత బాబాని “ఈమే ఆ తల్లి అవునా? బాబా!” తన కోడలిని చూపిస్తూ ప్రశ్నించారు . బాబా కాదని సమాధానమిచ్చి మరలా నాభార్యని చూపించారు. సరిగా ఆరోజునుండి 12 నెలల తరువాత నాభార్య మగ శిశువును జన్మించింది. మేము ఆ పిల్లవానికి ‘బాబు’ అని నామకరణం చేశాము. (బాబా పిలిచే పేరు).
బాబుకి నాలుగు నెలలు నిండాక షిరిడీ తీసుకొని వెళ్ళాము. సాయిబాబా బాబుని తన చేతులలోకి తీసుకొని “బాబు? ఎక్కడ ఉన్నావు ఇంతకాలం? నాతో విసిగి అలసిపోయావా?” అన్నారు. బాబు షిరిడీకి వచ్చిన శుభసందర్భంలో బాబా తన జేబు నుండి రెండు రూపాయలు తీసి, దానితో బర్ఫీ (మిఠాయిలు) కొని కొడుకు పుట్టిన సందర్భంలో ఏవిధంగానయితే పంచుతారో ఆవిధంగా పంచిపెట్టారు. ఈ సందర్భంలో బాబా “బాబుకు అందమయిన బంగళా కూడా తయారుగా ఉంది” అని కూడా అన్నారు. అది నిజమే. బాబా మాటలు త్వరలోనే నిజమయ్యాయి. నేను ఒక బంగళాను కొని గృహప్రవేశం చేసుకొని అందులో నివసించసాగాను.
పైరెండు కధనాలను చదివిన తరువాత పాఠకులకు పునర్జన్మ సిధ్ధాంతం మీద నమ్మకం ఏర్పడటమే కాదు, బాబా తన భక్తులను జన్మ జన్మలకి ఏవిధంగా కాపాడుతూ ఉంటారో అర్ధమవుతుంది. పునర్జన్మ గురించి చెప్పేటప్పుడు ఈ జన్మలో మనకి కలిగే కష్టసుఖాలన్ని కూడా మనం క్రితం జన్మలో చేసిన పనుల వల్లనేనని బాబా ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఉదాహరణకి 46,47 అధ్యాయాలనే తీసుకొందాము. అందులో రెండు మేకలు, కప్ప, పాముల గతజన్మ, ప్రస్తుత జన్మల గురించి వివరిస్తూ అందులోని నీతిని బాబా వివరించారు. “ఎవరు చేసినదానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నిటిని, బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. శతృత్వమున్నయెడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైన ఏమైన బాకీ యున్న దానిని తీర్చివేయవలెను. ఋణముగాని, శతృత్వశేషము గాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను.” “ధనము నందు పేరాస గల వానిని అది హీనస్థితికి దెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును”.
అందువల్లనే సాయిబాబా తన భక్తులందరినీ ఎల్లప్పుడు నీతి నిజాయితీగా వ్యవహరించమని చెప్పారు. ఏదిమంచి, ఏదిచెడు అని తెలుసుకొని జ్ఞానం కలిగి ఉండమన్నారు. ఆయన ఎప్పుడూ “జైసే జిస్ కీ నియత్, వైసీ ఉస్ క్ బర్కత్” (నీవు మంచిగా వ్యవహరిస్తే నీకెప్పుడూ మంచే జరుగుతుందని” ఎప్పుడూ హితోపదేశం చేస్తూ ఉండేవారు.
(ఇంకా ఉంది)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (5) జనన మరణ చక్రాలు (2వ.భాగమ్)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము (3) వాక్కు 2వ.భాగమ్
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (1వ.భాగం)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (3) వాక్కు 1వ.భాగమ్–Audio
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (4) భక్తిమార్గం( 5వ.భాగమ్)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments