దత్తావదూత శ్రీ స్వామి జగద్విఖ్యాత గారికి బాబా ఇచ్చిన అద్భుత అనుభవాలు మొదటి భాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఆలుపెరుగని ఆద్యాత్మిక తత్వవేత్త, ఆడంబరాలు లేని మహోన్నత మేరు శిఖరం , 13 సంవత్చరాల పిన్న వయసులోనే సర్వాన్నీ త్వజించి సాయి నాధుని పాదాలపై వెల్లి విరిసిన మహోన్నత జ్ఞాన సాగరం… శ్రీ స్వామి జగద్విఖ్యాత(శ్రీ గౌతం చంద్ర నంద కిషోర్) ..  గారికి బాబా ఇచ్చిన అద్భుత అనుభవాలు.

ఆది 20 వ శతాబ్దపు మొట్ట మొదటి సంవత్చరం అక్టోబర్ 9 వ తేది.  అయితే ఆనాడేవ్వరు ఊహించి ఉండరు ఆంద్ర దేశం నుంచి కొన్ని వెల మైళ్ళ తేడాలో వున్న షిర్డీ ఆనే ఆద్యాయంలో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ మరో ఆద్యాయం మొదలవ్వబోతుందని. ఆవును! జ్ఞానులకు సిద్దులకు ఆవాసమైన షిర్డీ ఆనే పురిటి గడ్డపై ఆదే రోజు పురుడు పోసుకుంది మరో ఆత్చున్నత జ్ఞాన శిఖరం.

స్థలం షిర్డీ, సమయం తెల్లవారుజామున 5 గం, సందర్భం కాకడ హారతి. ప్రదేశం ద్వారకామాయి:

కొన్ని వేల మంది సాయి భక్తులు సాయినాధునికి జరిగే కాకడ హారతి కోసం ఆక్కడ వేచి వున్నారు. అందులో శ్రీ నందుడు ఒకడు. ( ఆంద్ర దేశంనుంచి తన తల్లితండ్రుల ప్రాణ స్నేహితులతో, కలసి ఆనాడక్కడికి ఆడుగుపెట్టిన 13 యెల్ల చిరుప్రాయుడే ఈ శ్రీనందుడు. కాబోయే ఆద్యాత్మిక దిగ్గజానికి ప్రేమ మీర తన తల్లితండ్రులు చేసిన సంపూర్ణ నామధేయం ,శ్రీ గౌతం చంద్ర నంద కిషోర్ ) సమయం ఆసన్నమైంది.  భక్త హృదయాలను పాలించే అ ప్రసన్న వదనునికి హారతి మొదలయ్యింది.

‘జోడూ నియాకరచరణి ఠేవిలామాధా పరిసావీ వినంతీ మాఝీ పండరీనాధా అసోనసో భావాఆలో – తూఝియాఠాయా క్రుపాద్రుష్టిపాహే మజకడే – సద్గురూరాయా’ ఆంటూ సాయి భక్తులు చేస్తున్న ఆ మధురగానంతో ద్వారకామాయి మొత్తం పెళ్లుభికిన భక్తీ బావంతో మార్మోగి పోతుంది. సర్వదేవతలు సైతం సాయినాధునికి జరిగే ఆ మంగళకరమైన హరతికి ఆక్కడికి చేరుకున్నార ఆన్నట్లుగా ఆద్యంతం మహాదానంద భరితంగా సాగిపోతున్న ఆ హారతి జై శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాధ్ మహారాజ్ కీ జై ఆనే జయ జయ ధ్వానాల మద్య పరమానంద భరితంగా ముగిసింది. దాంతో శ్రీ సాయి భక్తులందరూ ఒకోక్కరిగా పైకి లేగుస్తూ శ్రీ సాయినాధ్ మహారాజ్ కీ జై అంటూ ద్వారకామాయి లోపలికి ఆడుగుపెడుతున్నారు. ఆలా అందరితో పాటు శ్రీనందుడు కూడా ఒకడిగా ద్వారకామాయి లోకి ఆడుగు పెట్టాడు.

అయితే రాబోయే కుంభవుస్థి ని మేఘాలు ముందుగానే సూచించినట్లుగా ఆ క్షణం ఆక్కడొక మహద్బుతం జరిగింది. అందరితో పాటు లోపలికి ఆడుగు పెట్టిన శ్రీనందుడు మాత్రం సుమారు 45 నిమిషాల పాటు ద్వారకమాయిలోని బాబానే చూస్తూ నిత్చేతుడై నిలబడి పొయ్యాడు. అయితే బాబా ఆనుజ్ఞ కూడా అందుకు బలంగా తోడవ్వటంతో ఏ ఒక్కరికి ఆతన్ని పక్కకు జరిపే దైర్యమే కాదు ఆలోచన కూడా లేక మిన్నకుండి పొయ్యారు. రాను రాను సమయం గడుస్తుంది.  ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళిన పిల్లవాడు గంట దాటుతున్న బయటకు రాక పోవటంతో ఆప్పటి దాక బయటి వరండాలో కూర్చొని పారాయణ చేస్తున్న ఆతని సంరక్షకులు శ్రీనందుని కోసం వెతుక్కుంటూ లోపలకు వెళ్లారు. అయితే గంభీర వదనంతో వెన్నకు చేతులు కట్టుకొని తీక్షణ చూపులతో బాబా చిత్ర పటాన్నే చూస్తున్న శ్రీనందుడిని చూసి ఏం నానా యింతసేపటి నుంచి యిక్కడెం చేస్తున్నావ్? అంటూ ఆడిగిన వాళ్ళకి, సమాధానంగా ముద్దులోకికే ఆ చిన్నీ శ్రీనందుడు తన చేతిని బాబా చిత్రపటం వైపు చూపిస్తూ ఈ ముసలాయన నన్నొక ఎత్తయిన ప్రదేశానికి తీసుకువెళ్ళి భయమేస్తుందా ఆని ఆడిగాడు. ఎందుకు? నువున్నావుగా ఆన్నాను. అంతే నన్నెత్తుకొని ముద్దుపెట్టి తిరిగి నన్నిక్కడకు తీసుకొచ్చాడు.. అంటూ ఆ పిల్లవాడు యిచ్చిన సమాధానం విని ఆత్చర్య పోయిన ఆ బార్య భర్తలు ఒకరినొకరు చూసుకుంటూ మనసులోనే బాబాకు నమస్కారం చేసుకొని “సరే రా నానా అంటూ ఆ పిల్లవాడి చేయ్యి పట్టుకొని బయటికొచ్చారు. ( అయితే ఆనాడు బహుశా వారు కూడా ఊహించి వుండరేమో సాయి ఆనే సామ్రాజ్యానికి యీ బాలుడోక వెల కట్టలేని కోహినూర్ వజ్రంగా మార బోతున్నాడని ) ఆ పిమ్మట వారు శ్రీ నందుడి తో కలసి చావడి ని కూడా దర్శించుకొని సమాధి మందిరంలోకి ఆడుగుపెట్టారు. ఆలా ఆ బాలుడితో కలసి బాబా సమాధిని దర్శించు కుంటూ సమాధికి నమస్కారం చేయ్యబోతుండగా వెనుక నుంచి బాబా సమాధి పై ఆలంకరించమని ఒక భక్తుడు యిస్తున్న గులాబీ మాల ఆనుకొని ఒక చిత్రమైన రీతిలో చేయ్యి జారి బాబా సమాధికి నమస్కరించు కుంటున్న శ్రీనందుని కంఠ సీమను ఆలంకరించింది. బహుశా బాబా తన ప్రియ భక్తుడను ఆ విధంగా ఆనుగ్రహించాడెమో.  వెంటనే శ్రీనందుని సంరక్షకులు చెంపలు వేసుకుంటూ శ్రీనందుని కంఠ సీమను ఆలంకరించిన ఆ మాలను తియ్యబోతుండగా ఆక్కడి పూజారులు నయ్ నయ్ ఓ బాబా కా యిత్చ హై నయ్ నిఖాల్ న అంటూ చిరునవ్వుతో బాబాకు భక్తులు సమర్పించిన గుప్పెడు కలకండను తిరిగి బాబా ఆశీర్వాద చిహ్నంగా శ్రీనందునికి ప్రసాదించారు బాబా ఆలయ పూజారులు. (సాయినాధుని ఆనుగ్రహ వర్షాన్ని ఎవ్వరు మాత్రం తప్పించగలరు) ఆలా బాబా మహా సమాధి దర్సనం ఆనంతరం శ్రీనందునితో కలసి బాబా గురుస్తానానికి చేరుకొని దాని చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి గురుస్తానంలోని బాబా చిత్ర పటానికి నమస్కారం చేస్తుండగా శ్రీనందుడు మాత్రం సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించాడు. 

రేపు తరువాయి భాగం….

ఈ సమాచారం ఈ  లింక్ https://sites.google.com/site/allindiasaidevotees/about-the-location/travel-accommodations ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles