దత్తావదూత శ్రీ స్వామి జగద్విఖ్యాత గారికి బాబా ఇచ్చిన అద్భుత అనుభవాలు రెండవ భాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాబా ఆశ్శిస్సులతో అందరికి ఈ నూతన సంవత్సరంలో శుభం జరగాలని కోరుకుంటున్నాను.

బాబా మహా సమాధి దర్సనం ఆనంతరం శ్రీనందునితో కలసి బాబా గురుస్తానానికి చేరుకొని దాని చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి గురుస్తానంలోని బాబా చిత్ర పటానికి నమస్కారం చేస్తుండగా శ్రీనందుడు మాత్రం సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించాడు. అంతలోకి సంకకు జోలే తగిలించుకొని ఆక్కడుకు వచ్చిన ఒక పండు ముస్లిం వ్యక్తి శ్రీనందున్ని చూస్తూ హే మాష్ ఆల్లా బడియా బహుత్ బహుత్ బడియా జీతే రహో బేటా అంటూ శ్రీనందున్ని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తూ శ్రీ నందుని పైకీ లేపి తను తగిలించుకున్న జోలెలో నుంచి 5 వేపాకులను తీసి ఓ లేలో ఖావో బేటా అంటూ శ్రీ నందుని చేతిలో వున్న తియ్యని కలకండతో కూడా ఆ వేపాకులను కలిపి ప్రేమగా తినిపించాడు. ఆ ఆనంతరం శ్రీనందున్ని కాసేపు తన వొళ్ళో కూర్చోపెట్టుకొని ముద్దులాడుతూ విష్ణు సహస్ర నామంలోని అనన్యాస్చింత యంతోమాం ,ఏ జనాః పర్యు పాసతే ఆనే శ్లోకాన్ని చదువుతూ శ్రీనందున్ని చెవుల దగ్గరా బుగ్గల దగ్గరా ముద్దులు కురిపిస్తూ ఆలా కొంతసేపు వాత్చల్య పూర్వకంగా శ్రీనందు’ని లాలించి ఆక్కడి నుంచి విశ్రమించారు. ఆ ఆపరిచిత ముస్లిం వ్యక్తి. ఆలా ఆడుగడుగున ఆనందత్చార్యలతో సాగిన షిర్డీ యాత్రను ఆద్యంతం ఆశ్వాదించి 9 రోజుల తర్వాత శ్రీ నందునితో కలసి ఆంద్ర దేశానికీ చేరుకున్నారు ఆతని సంరక్షకులు. అయితే షిర్డీ నుంచి వచ్చిన శ్రీనందుని దైనందిన జీవితంలో మాత్రం పెనుమార్పులు మొదలయ్యాయి. క్షణమొక యుగంలా గడుస్తుంది. ఎవ్వరితో మాట్లాడడు ఎవ్వరు పలుకరించిన ఉలకడు పలుకడు. ఆన్న పానియాలు అంటేనే ఆమడ దూరం. బలవంతంగా తినిపించిన ఆవి నేలకే అంకితం. కాలకృత్యాల మాట యిక సరే సరి ! దృష్టి అంత శూన్యం వైపే. ఆలా 57 రోజుల పాటు ఆలౌకిక ఆనందంలో తెలియాడిన శ్రీనందుడు డిసెంబర్ 13 వ తారీకు మద్యానం 12 గంటల 30 నిమిషాల సమయంలో తన తల్లిని పిలుస్తూ ఆమ్మ మేమిక భాగిరధి తీరానికి వెళ్ళాలిసిన సమయం ఆసన్నమైనది. కానీ తల్లిగా అందుకు నీ ఆనుమతి ఆశ్విర్వాదం మాకవసరం. నువ్వు తల్లిని నేను కొడుకును ఆనే భవబందాలకు లోను కాక మమల్ని సాగనంపు. అయితే ఆనాడు నువ్వడిగినట్లుగానే నీ చివరి నిమిషం వరకు నువ్వు మాతోనే వుండగలవు. సూర్య చంద్రులు గతులు తప్పినన్ మా ఈ మాట పొల్లుపోదు’ అంటూ శ్రీనందుడు అంటున్న అ మాటలు ఆ మాతృమూర్తికి ఆ క్షణంలో యిసుమంతైననూ పాలుపోకపోయినా. సర్వం భగవదేచ్చ! అంటూ అందుకు తనపూర్తీ ఆంగికారాన్ని తెలిపింది. అంతే శ్రీనందుడు తన మాతృమూర్తి కాళ్ళకు నమస్కరించి తండ్రికి ఈ విషయాన్నీసావధానంగా వివరించమని చెప్తూ కట్టుబట్టలతో ఆక్కడి నుంచి బయలుదేరాడు శ్రీనందుడు.

ఆలా ఆ క్షణం నుంచి నిశబ్దంగా మొదలైన శ్రీనందుని ఆద్యాత్మిక జైత్ర పరంపరలో డిసెంబర్ 18,2000 అజ్మీర్ దర్సనం. ఆజ్మీర్ దర్శనంలోనే సూఫీ సాంప్రదాయానికి చెందిన గొప్ప మహాత్ముడు శ్రీ హజారత్ బాబా నవాబ్ జాన్’తో తోలి కలయిక.  మొదటి కలయిక లోనే శ్రీనందుని ( గౌతం చంద్ర నంద కిషోర్ ) ఆనే పేరును శ్రీ స్వామి జగద్విఖ్యాతగా మార్చిన బాబా నవాబ్ జాన్. తర్వాత ఏన్నో పుణ్య స్థలాలు, మహాత్ముల దర్శనం చేసుకుంటూ 2003 వ సంవత్సరంలో షిర్డీ దర్శించారు.

అక్టోబర్ 27,2003 షిర్ది లో నెలకొన్న చిత్రమైన చమత్కారం

బాబా గారి మద్యాన హారతి సమయానికి విజయవాడ నుంచి కొంత మంది సాయి భక్తులతో షిర్డీకి చేరుకున్న శ్రీ స్వామి జగద్విఖ్యాతుల వారు మద్యాన హరతికై శ్రీ సాయి నాధుని సమక్షంలో కూర్చొని ” ఏమయ్యా సాయినాధ అంత దూరం నుంచి, ఆకళి దప్పులు భరించి నీ దర్శనం కోసం వస్తే ఆటువంటిది మా ఆకలి తీర్చకుండా నీ భక్తులు చేసే ‘ఆహ వోహో ‘నాదాలతో ఆనందిస్తున్నావా?. సరే.. మరి నా మాట ఎంచేస్తావ్, నేనిక్కడ మటన్ బిర్యాన్ని కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నాను. మరి దయతో నా వైపు కూడా కాస్త చూడరాదూ! అంటూ చిరునవ్వుతో గంబిరంగా సాయిని ప్రశ్నించి హారతి ముగిసిన ఆనంతరం సమాధి ముందు బాగం వైపుకొచ్చి ఎదురుగా వున్న శ్రీ ఆంజనేయ స్వామివారి గుడి మెట్లపై చతికిల పడ్డారు శ్రీ స్వామి జగద్విఖ్యాతుల వారు. అయితే ఆక్కడ వున్నవారందరిని సంభ్రమాచర్యాలకు గురిచేస్తూ ఆక్కడికోచ్చిన ఒక ముస్లిం జంట ఒక ప్యాకెట్ను శ్రీ స్వామి జగద్విఖ్యాతుల వారి చేతిలో పెడుతూ స్వామి ఈ రోజు బాబా సన్నిదిలో మా పెద్దబిడ్డకు వడుగులు చేసుకున్నాం కనుక ఆ సందర్భంగా బాబాకు నివేదించిన ఈ మటన్ బిర్యానీ ని మీరు దయతో స్వీకరించగలరు అంటూ నమస్కారం చేసి ఆక్కడి నుంచి వెళ్లి పొయ్యారు. అయితే ఆనుకొని ఈ సంఘటనకు కంగు తిన్న కొంత మంది సాయి భక్తులు స్వామిని ఈ విధంగా ప్రశ్నించారు. స్వామి మీరేందుకని బాబాను మటన్ బిర్యానీ ఆడిగారు. అయితే స్వామి అందుకు ఈ విధంగా సమాదానమిస్తూ ఏమి  తండ్రిని బిడ్డ ఆడగ కూడదా? వారు మన తండ్రి కనుకనే వారినడిగి పొందే ప్రతి హక్కు మనకుంది. ఏలయన నిర్మల ప్రేమతో నిత్చల భక్తితొ హృదయ పూర్వకంగా ఎ మంచి కోరికను కోరిన వారు తప్పక’దాన్ని ఆనుగ్రహిస్తారని మాకు తెలుసు . ఐనా జాతి బేధము కుల బేధము రుచీ బేధము చూపించిన వారిని మహానియులని ఎందుకనేదరు.? ఆట్టి వారు కాదు మన తండ్రి. అంటూ ఆ కోరిక వెనుక దాగిన మర్మాన్ని నిర్భయంగా విశధికరించారు స్వామి.

ఈ సమాచారం ఈ  లింక్ https://sites.google.com/site/allindiasaidevotees/about-the-location/travel-accommodations ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles