Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
శివనేశన్ స్వామి.
ఆ మొదటి రోజులలో శివానేశన్ స్వామి వారు కానిఫ్ నాథుని ఆలయంలో ఉంటు తరువాత మారుతీ ఆలయమునకు మకాము మార్చారు.
వారికి రోజు నాలుగు అణాలు కావలసి వచ్చేది.అంత దక్షిణ లభించని రోజు ఒక రొట్టేతిని,టీ త్రాగేవారు.
వాటికి కూడా డబ్బులు లేనిరోజు లెండీబాగ్ లోని బావి నీరు త్రాగి కాలం గడిపేవారు.
ఎట్టి పరిస్థితులల్లోను దేనికి ,ఎవ్వరిని యాచించే వారు కాదు.
స్వామి వారు ఆకలి బాధ భరించలేనప్పుడు “బాబా! నాకు ఆస్తిపాస్తులు వద్దు.ఆకలిబాధ తీరడానికి అన్నమైనా పెట్టించు లేక ఆకలైనా లేకుండా చెయ్యి” అని ప్రార్థించేవారు.
ఆకలిబాధ భరించలేకపోవడం,షిరిడీలో ప్రజలు వీరిని పెట్టే కష్టాలకు ఓర్చుకోలేకపోవడంతో స్వామి షిరిడీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదామని తలచినారు.
తన ఒక జత గుడ్డలు,పుస్తకాలు మూటగట్టుకొని కాలినడకన షిరిడీ వదిలి వేళ్ళుచు మధ్యాహ్నముకు అలసిపోయి ఒక చెట్టు క్రింద స్వామి నిద్రపొయినారు.
సాయంత్రం నిద్ర నుండి లేచి చెట్టు పైకి చూడగా ఆ చెట్టుపై అంతకుముందు లేని బాబా పటము వ్రేలాడుతూ కనిపించింది.
తాను వచ్చినప్పుడు లేనిది ఇప్పుడు ఆ చిత్రపటం అక్కడకు ఎలా వచ్చినది అని ఆశ్చర్యపోయినాడు స్వామి.
దాహమై నీరు తెచ్చుకొనుటకు మూటలోని చెంబును తీయబోగా ఆ చెంబు అందులో లేదు.
అప్పుడు “బాబా కు దూరంగా వెళ్ళిపోతే త్రాగటానికి నీరు కూడా లభించదు అని ఈ లీల బాబా చూపించారు”అని శివనేశన్ స్వామి గ్రహించారు.
ఇంకా ముందుకు వెళ్లక వెనుకకు తిరిగి రాత్రికి షిరిడి వచ్చారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయిబాబా నివేదన శివనేశన్ స్వామికి భోజనమగుట.
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- శివనేశన్ స్వామిని చావడి బాబా అని సంబోధించుట.
- శివనేశన్ స్వామి ఫకీరు రూపంలో యున్న బాబాకు వస్త్రముల నిచ్చుట.
- శ్రీ సాయిబాబావారు శివనేశన్ స్వామిలా దర్శనమిచ్చారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments