శ్రీ సాయిబాబా వారిని దర్శించిన వెంటనే శాంతి పొందిన సాఠే.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

   సాయి బాబా        …        సాయి బాబా         …         సాయి బాబా        …        సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు.

సాఠే.

సాఠే యనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను.

కాలాంతరమున వ్యాపారములో చాల నష్టము పొందెను.అంతేగాక మరికొన్ని సమస్యలతనిని చీకాకు పరచెను.అందుచే నతడు విచారాగ్రస్తుడయ్యెను.

విరక్తి చెందెను.మనస్సు చెడి చంచలమగుటచే నిల్లు విడిచి చాలా దూరము పోవలెననుకొనెను.మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడుగాని,కష్టములు,నష్టములు,దుఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్ధించును.

అతని పాప కర్మలు ముగియువేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయును.వారు తగిన సలహానిచ్చి అతని క్షేమమును జూచెదరు.

సాఠే గారికి కూడ అట్టి అనుభవము కలిగెను.అతని స్నేహితులు శిరిడీ కి వెళ్ళుమని సలహా ఇచ్చిరి.అచ్చట సాయిబాబాను దర్శించి యనేకమంది శాంతి పొందుచుండిరి.వారి కోరికలు గూడ నెరవేరుచుండెను. సాఠెగారికి ఇది నచ్చెను.

వెంటనే 1917వ సంవత్సరములో శిరిడీ కి వచ్చెను.

అచ్చట శాశ్వతబ్రహ్మవలె స్వయంప్రకాశుడై, నిర్మలుడు,శుద్ధస్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే యతనికి మనశ్చంచల్యము  తగ్గిపోయి శాంతి కలిగెను.

అతని పూర్వ జన్మపుణ్యమువలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను.

అతను గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్రము పారాయణ మొదలుపెట్టెను.

7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా యానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను.అది యిట్లుండెను.

బాబా గురుచరిత్రము చేతిలో బట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠె కు బోధించుచున్నట్లు,అతను దానిని శ్రద్ధగా వినుచున్నట్లు జూపెను.

సాఠే నిద్ర నుండి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను.మిగుల సంతసించెను.

అజ్ఞానమనే నిద్రలో గుఱ్ఱుపెట్టి నిద్రపోవుచున్న తనవంటి వారిని లేపి, గురుచారితామ్రుతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద్రహృదయమె గదా యనుకొనెను.

ఆ మరుసటిదినమాదృశ్యమును కాకాసహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయియుండునో సాయిబాబా  ని అడిగి తెలిసికొనుమనెను.

ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొనమనెను.

కాకాసాహెబు సమయము చూచి బాబాను ఇట్లడిగెను,”ఓ దేవా! యీ దృశ్యము వలన సాఠే కు ఏమని చెప్ప నిశ్చయించితివి?అతడూరకొనవలెనా లేక యింకొక సప్తాహము పారాయణము చేయవలెనా?అతడు అమాయిక భక్తుడు;అతని కోరిక నేరవేరవలెను.అతనికి ద్రుస్టాంతార్ధమును బోధించవలెను.వాని నాశీర్వదింపు”డన బాబా ,”అతడు గురుచరిత్ర మింకొక సప్తాహము పారాయణ చేయవలెను.ఆ గ్రంధమునే జాగ్రత్తగా పఠించినచో నాతడు పావనుడగును;మేలు పొందగలడు.భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధముల నుండి తప్పించును!”అనెను.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

    సాయి బాబా        …        సాయి బాబా         …         సాయి బాబా        …        సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles