‘‘ఆ వాడా ‘సాఠేవాడా’గా ప్రసిద్ధి చెందుతుంది.’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

వంశోద్ధారకుడి కోసం సాఠేని మళ్ళీ పెళ్ళి చేసుకోమన్నారు బంధుమిత్రులు. వారి కోరిక మేరకు పెళ్ళి చేసుకుంటానన్నాడతను.అయితే మగపిల్లాడు పుడతాడన్న హామీని ఎవరిస్తారు? అని అడిగాడు. ఎవరిస్తారు? ఎవరివ్వగలరు? చేసేది లేక చేతులు ముడుచుకున్నారంతా.

బాబాని సందర్శించాడు సాఠే.‘‘మళ్ళీ పెళ్ళి చేసుకో సాఠే! నీకు తప్పకుండా మగపిల్లాడు పుడతాడు.

నాదీ హామీ.’’ అన్నారు బాబా. నివ్వెరపోయాడు సాఠే. బాబాకి చేతులు జోడించి, నమస్కరించాడు.బాబా చె ప్పిన మీదట దాదాకేల్కర్‌ కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు సాఠే.

బాబా హామీ ఇచ్చినట్టుగానే అతనికి మగపిల్లాడు పుట్టాడు. నాటి నుంచి బాబా అంటే ఎనలేని భక్తిశ్రద్ధలు కలిగాయి సాఠేకి. తరుచూ షిరిడీకి వచ్చి పోతుండేవాడతను.

పిలిస్తే పలికే సేవకుడిలా సాఠే ఎప్పుడూ తన ముందు ఉండడంతో బాబాకి అతనంటే అభిమానం ఏర్పడింది.

ఆత్మీయంగా పలకరించేవారతన్ని. ద్వారకామాయి నుంచి బాబా అడుగు బయటకు పెట్టారంటే సాఠే ముందు ఉండాల్సిందే!

రాజదండం పట్టుకుని ముందు నడిచేవాడతను. అలా నడుస్తూ తలదాచుకునేందుకు చోటు లేక, ఎక్కడపడితే అక్కడ దారికి ఇరువైపులా విశ్రమించే భక్తుల్ని చూసి బాధపడ్డాడు సాఠే. భక్తుల దుస్థితి బాబా దృష్టికి తీసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించాడోసారి.

‘‘బాబా’’ అన్నాడు సాఠే.‘చెప్పు’ అన్నట్టుగా చూశారు బాబా.‘‘నిన్ను క్షణం క్షణం చూసుకోవాలని, నిత్యం నీ సేవ చేసుకోవాలని ఆశించే నాలాంటి భక్తులకు, ఇక్కడ ఈ షిరిడీలో ఉండేందుకు ఒక్క వాడా(వసతిగృహం) కూడా లేదు.ఉంటే బాగుంటుందనిపిస్తోంది.’’ అన్నాడు సాఠే.

‘‘బాగుంటుంది. ఎందుకు బాగోదు? ఓ పని చెయ్యి, ఆ వాడా ఏదో నువ్వే కట్టించు.’’ అన్నారు బాబా.ఆనందంగా చూశాడు సాఠే.

అంతలోనే ఇలా అన్నాడు.‘‘నాకు అంత అదృష్టమా?’’ఆసరికి ఇద్దరూ గురుస్థాన్‌ని సమీపించారు.

వేపచెట్టు నీడలో నిల్చున్నారు.‘‘ఇది మా గురుదేవులు తపస్సు చేసిన పవిత్రస్థానం. ఇక్కడి భూగృహంలోనే మా గురుదేవుల సమాధి ఉంది.

ఈ వేపచెట్టుకీ, కింద ఉన్న ఆ భూగృహానికీ ఎలాంటి హానీ కలగకుండా వాడా కట్టించు. అది నీకే కాదు, నీలాంటి చాలా మంది భక్తులకి ఆశ్రయమవుతుంది.’’ అన్నారు బాబా.

సంతోషంతో చేతులు జోడించాడు సాఠే.‘‘ఆ వాడా ‘సాఠేవాడా’గా ప్రసిద్ధి చెందుతుంది.’’ అన్నారు బాబా.పరమానందంతో కన్నీరు పెట్టుకున్నాడు సాఠే. మర్నాడే వేపచెట్టు సమీపంలో గల స్థలాన్ని కొనుగోలు చేశాడు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles