Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
వేపచెట్టు చుట్టూ గోడ కట్టి, దానికి మెట్లు నిర్మించాడు. ఆ మెట్ల కింద దక్షిణాభిముఖంగా ఓ గూడుని కూడా నిర్మించాడు.
ఆ గూడులో అగరువత్తులు వెలిగించి, ధూపం వేశారు బాబా. ఆ రోజు గురువారం.
‘‘గురు శుక్రవారాల్లో, సూర్యాస్తమయం వేళ ఈ గూడులో అగరువత్తులు వెలిగించి, ధూపం వేసిన వారికి ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షాలు లభిస్తాయి.
అడగకనే ఆ దేవదేవుడు సిరిసంపదల్ని అనుగ్రహిస్తాడు. నారాయణుడంటే సాక్షాత్తూ సద్గురువే’’ అన్నారు బాబా.
గూడు నిర్మాణం అనంతరం, మిగిలిన స్థలంలో ఒక పక్కా భవనాన్ని నిర్మించాడు సాఠే. బాబాయే స్వయంగా ఆ భవనాన్ని ప్రారంభించారు. విశాలంగా బావుంది భవనం. భవనం అణువణువూ చూశారు బాబా.
‘‘జన్మ జన్మల పుణ్యఫలమే ఈ వాడా! దీని నిర్మాణాన్ని చేపట్టి ఈ జన్మను కూడా నువ్వు చరితార్థం చేసుకున్నావు.’’ మెచ్చుకున్నారు బాబా.
‘‘చాలు బాబా, ఈ జన్మకు ఇది చాలు.’’ చేతులు జోడించాడు సాఠే.‘‘ఇక మీదట దీనిని ‘సాఠేవాడా’ అని అంతా పేర్కొంటారు.’’ అన్నారు బాబా. ఆశీర్వదించారు సాఠేని.
కొంతకాలం గడిచింది.బాబా భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్, తను కూడా ఒక వాడా నిర్మిస్తే బాగుణ్ణనుకున్నాడు. బాబాని సంప్రదించాడతను.‘‘మంచి పని చేస్తానంటే కాదంటనా?’’ నవ్వారు బాబా. సాఠేవాడా సమీపంలోని స్థలాన్ని కొనుగోలు చేశాడు దీక్షిత్. యుద్ధ ప్రాతిపదికన అక్కడ భవన నిర్మాణాన్ని చేపట్టాడు. 1911 శ్రీరామనవమి నాటికి వాడాని సిద్ధం చేశాడు దీక్షిత్. ఆ రోజే భక్తులు అందులోకి ప్రవేశించారు. ఆనాటి నుంచి అది ‘దీక్షిత్‌వాడా’గా ప్రసిద్ధి చెందింది.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘నువ్వు నా వాడివి. నిన్ను నేను వదులుకుంటానా? అందుకే రప్పించుకున్నాను.’’
- బాబా నిర్ణయించిన మొత్తమే ముట్టింది(దీక్షిత్, లక్ష్మణ్ భట్)–Audio
- కాకా దీక్షిత్, లక్ష్మణ్ భట్–Audio
- ‘‘మనం దర్శించుకోవాలనుకున్నంత మాత్రాన బాబా దర్శనం కాదు. అలాగే వెళ్ళాలనుకున్నంత మాత్రాన షిరిడికి వెళ్ళలేం. అన్నిటికీ బాబా అనుమతి కావాలి.
- ఆనందదాయకుడు…. మహనీయులు – 2020 – జనవరి 23
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments