బాబా నిర్ణయించిన మొత్తమే ముట్టింది(దీక్షిత్, లక్ష్మణ్ భట్)–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

 1910 వ.సంవత్సరంలో షిరిడీలో కాకా దీక్షిత్, లక్ష్మణ్ భట్ కి చెందిన కొంత  పొలం కొందామనుకున్నాడు.  భట్ దాని ఖరీదు రెండువందల రూపాయలు చెప్పాడు.

దీక్షిత్ అంత ధర చెల్లించడానికిష్టపడలేదు.  నూటయాభై రూపాయలయితే దానికి సరయిన ధర అని భావించాడు.  భట్  ని ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు కాని భట్ మొండి పట్టుదలతోనే ఉన్నాడు.

దీక్షిత్ రాజీ పడదల్చుకోలేదు.

ఇద్దరి మధ్యా చాలా సేపు చర్చలు జరిగాయి.

ఆ రోజు మధ్యాహ్నం భట్ ద్వారకామాయి వద్దనుండి వెడుతుండగా,  బాబా అతనిని పిలిచి“దీక్షిత్ కి నీకు మధ్య వాదోపవాదాలు చర్చ జరిగింది దేని గురించి”అని అడిగారు.

భట్ బాబాకి జరిగినదంతా వివరంగా చెప్పాడు. “నువ్వు ఆ భూమిని నూట డభై అయిదు రూపాయలకు అమ్ము” అని ఆవిషయాన్ని పరిష్కరించారు.

భట్ డబ్బు వసూలు చేసుకోవడానికి దీక్షిత్ దగ్గరకు వెళ్ళాడు.  భట్ కి, భాబాకి మధ్య జరిగిన విషయం,

ఒప్పందం ఏమీ తెలియని దీక్షిత్ తాను ముందరే చెప్పిన ధర ప్రకారం నూటయాభై రూపాయలు ఇచ్చాడు.

భట్ కూడా బాబా ఖరారు చేసిన మొత్తం ఎంతన్నది  దీక్షిత్ కి చెప్పలేదు.

దీక్షిత్ ఇచ్చిన డబ్బు లెక్కపెట్టకోకుండానే తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళిన తరువాత ఒకసారి డబ్బు లెక్క చూసుకున్నాడు.  మళ్ళీ మళ్ళీ లెక్కపెట్టాడు.

లెక్కపెట్టగా బాబా నిర్ణయించిన ధర ఎంతయితే ఉందో సరిగ్గా అంటే నూటడభై అయిదు రూపాయలు ఉంది.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles