నా నుండి దక్షిణ స్వీకరించినది మీరేనా బాబా(దీక్షిత్)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

కాకా సాహెబ్ దీక్షిత్ కి బాబా మీద అపరిమితమైన విశ్వాసం, నమ్మకం.  అతను బాబా ఆదేశాలను శిరసా వహించడమే కాదు, బాబా స్వభావాన్ని, ఆయన జీవన విధానాన్ని కూడా అలవరచుకోవడానికి ప్రయత్నించేవాడు.

ఆ విధంగా ఉండటానికి అతను చేసిన ప్రయత్నం తను కూడా ఏదో ఒక రోజున  తన సద్గురువులా ఉండటానికే. ఎంతో కఠోరమైన శ్రమతో నిజంగానె అతను అందులో సఫలీకృతుడయ్యాడు.

ఒకరోజు సాయంత్రం, కాకా తన ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు.  దారిలో ఒక ధృఢమయిన వ్యక్తి అతనికి ఎదురుగా వచ్చి ధర్మం చేయమని అడిగాడు.  కాకా అతని మొహంలోకి పరీక్షగా చూసి ఆ వ్యక్తి తన సద్గురువు తప్ప మరెవరూ కాదనే విషయం అర్ధం చేసుకొన్నాడు. 

వెంటనే అతనికి కొన్ని నాణాలను ఇచ్చాడు. నాణాలను తీసుకున్న వెంటనే ఆవ్యక్తి ఒక చిన్న నవ్వు నవ్వి మరెవరినీ ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయేంతవరకు దీక్షిత్ అతనినే చూస్తూ నిలబడ్డాడు.

అదే రోజు దీక్షిత్ షిరిడీకి బయలుదేరాడు.  బాబా దర్శనం చేసుకున్న తరువాత ఒక బలిష్టుడయిన వ్యక్తి రూపంలొ వచ్చి నా నుండి దక్షిణ స్వీకరించినది మీరేనా బాబా అని అడిగాడు. “ అవును. ఆ రూపంలో నీఎదుటకి వచ్చినది నేనే” అని సమాధానమిచ్చారు బాబా.  ఆ మాట వినగానే దీక్షిత్ కి ఎంతో సంతోషం కలిగింది.

(దీనిని బట్టి మనం గ్రహించుకోవలసినది ఈ పాటికి మీకు అర్ధమైందనుకుంటాను.  కాకా దీక్షిత్ తన సద్గురువైన బాబా ఆదేశాలను శిరసా వహించడమే కాదు ఆయనలా ఉండటానికి ప్రయత్నిస్తూ అందులో విజయం సాధించాడు.

అందువల్లనే అతను బాబా మరొక రూపంలో వచ్చినా గుర్తించగలిగే శక్తి వచ్చింది.  అంతే కాదు తననుంచి నాణాలను తీసుకున్న వ్యక్తి చిన్న చిరునవ్వు నవ్వడం, మరింకెవరినీ అడగకపోవడం ఇవన్ని గమనించడంవల్లనే కాకా బాబాను గుర్తించగలిగాడు.

 మనం కూడా బాబా చెప్పిన సూత్రాలను పాటించి మనం కూడా విజయాన్ని సాధిద్దాము. విజయం సాధించాలంటే ప్రతిరోజు శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేయడమే కాదు, బాబా చెప్పిన సూత్రాలని ఆచరణలో పెట్టాలి.)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles