Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
మహిళలంటే చాలా గౌరవం బాబాకి. వారిని తోబుట్టువులతో సమానంగా చూసేవారాయన. ఆర్తిగా తనని సమీపించిన స్త్రీమూర్తిని ‘అమ్మా’ అంటూ ఆదరించేవారు.
సోదరి సమానురాలయిన బయిజాబాయి మరణం తర్వాత ఆమె కుమారుడు తాత్యాని చేరదీసి, ఆమె పట్ల తనకు గల అభిమానాన్ని స్పష్టం చేశారు బాబా.
అలాగే షిరిడీని ఒక సంస్థానంగా రూపొందించిన రాధాకృష్ణమాయి మరణించినప్పుడు తన దుఃఖాన్ని ఇలా ప్రకటించారు బాబా.‘‘చిన్న వయసులోనే అల్లాలో ఐక్యమయిన ధన్యురాలు.
’’ఇక లక్ష్మీబాయిషిండే విషయానికి వస్తే…భర్తని కోల్పోయిన ఆమె దుఃఖోపశమనం కోసం బాబాని ఆశ్రయించింది.
ఆమెను ఇలా అనునయించారు బాబా.‘‘అమ్మా! దేహం అశాశ్వతం. దేహ సంబంధమయిన బంధాలన్నీ తల్లి, తండ్రి, పిల్లలు, భర్త అందరూ అంతా దేహంతో పాటే పోతాయి. ఆత్మ శాశ్వతం. ఆ ఆత్మని భరించేది భగవంతుడే! ఆ భగవంతుణ్ణి సేవించు. అతన్ని చేరుకునేందుకు ప్రయత్నించు. ఆత్మ శాంతిస్తుంది.’’
‘‘భగవంతుణ్ణి ఏరకంగా సేవించాలి బాబా?’’ అడిగింది లక్ష్మీబాయి.
‘‘ఎలా సేవించాలంటే భక్తితో సేవించాలి. భాగవతంలో నవవిధ భక్తి సూత్రాలని తొమ్మిది సూత్రాలు ఉన్నాయి. అవి తెలుసుకుని, ఆ రకంగా భగవంతుని సేవిస్తే అంతకు మించిన ముక్తి లేదు.’’ అన్నారు బాబా.
‘‘నవవిధ భక్తి సూత్రాలను వివరంగా చెప్పండి బాబా.’’ ప్రార్థించింది లక్ష్మీబాయి.చెప్పేందుకు సిద్ధమయ్యారు బాబా. వినేందుకు ఒళ్ళంతా చెవులు చేసుకున్నారు లక్ష్మీబాయి సహా శ్యామా తదితరులు.
1)‘‘నవవిధ భక్తి సూత్రాల్లో మొదటిది శ్రవణం. అంటే వినడం, ఏం వినాలి? భగవంతుని లీలలు వినాలి.
2)రెండు కీర్తనం. అంటే భగవంతుణ్ణి కీర్తించాలి.
3)మూడు స్మరణం. అంటే భగవంతుణ్ణి ఎల్లవేళలా స్మరించాలి.
4)నాలుగు పాదసేవ. అంటే భగవంతుని పాదాలను ఆశ్రయించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అతడే అనుకోవాలి. అనుకుని భగవంతుని పాదాల మీద తల వాల్చాలి.
5)అయిదు అర్చన. భగవంతుణ్ణి అర్చించాలి.
6)ఆరు నమస్కారం. అంటే అహంకారాన్ని అణచుకుని, నీ పాదాలే శరణంటూ భగవంతుని పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయడం.
7)ఏడు దాస్యం. అంటే మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా భగవంతునికి పరిచర్యలు చెయ్యాలి.
8)ఎనిమిది సఖ్యత్వం. అంటే భగవంతుణ్ణి హితునిగా సన్నిహితునిగా స్నేహితునిగా భావించడం.
9)తొమ్మిది ఆత్మనివేదన. అంటే భగవంతునికి శరణాగతి అయి ఆత్మార్పణ చేసుకోవడం.’’ చెప్పారు బాబా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సహనం లేని భక్తి.
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం(7వ.భాగమ్)
- భక్తి పాదధూళి! … మహనీయులు – 2020 – జనవరి 17
- భక్తి శ్రద్దలతో చేసిన పూజని స్వీకరించిన బాబా …!
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తి మార్గం (4వ.భాగమ్)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “నవవిధ భక్తి సూత్రాలను వివరంగా చెప్పండి బాబా…లక్ష్మీబాయి.”
సాయినాథుని ప్రణతి
March 31, 2017 at 9:51 amSreenivase murthy garu so nice .కాకపోతే మిరు typing లో ఉపయేగించే colours కొని మరి లైట్ గా కనపడకూండా వునాయి .అవి సరిచూసుకొండి.తపుగా చెపివుంటే క్షమించండి
Sreenivas Murthy
April 5, 2017 at 10:21 amNo Problem Pranathi గారు, Maximum రెండు కలర్స్ నే యూజ్ చేస్తాను. గ్రీన్ కలర్ లైట్ గానే కనిపిస్తుంది. కాని బాబాకి గ్రీన్ కలర్ ఇష్టం అని ఆ కలర్ ని బోల్డ్ చేస్తాను. particular గా ఈ లీలలో నవ విధభక్తి లో nine Colours Use చేస్తాను. You always share your opinions with Boldly . This is Baba website