Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
మరువరాని బాబా దర్శనానుభూతి
ఈ రోజు బెంగళూరు నివాసి శ్రీ సతీష్ గారిని బాబా వారు ఎలా అనుగ్రహించారో తెలుసుకుందాము.
ఒక రోజు నాకొక అద్భుతం జరిగింది. నేను బాబాని చూశాను. వారి అనుగ్రహం నాకు కలిగింది.
కొన్ని వారాలు, నెలల క్రితం నించి నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉండి నన్ను చాలా చికాకు పరుస్తున్నాయి. నిన్న రాత్రి నేను బాబాని, “ఈ కష్టాలు, బాధలు ఎందుకని నన్ను వదలివెళ్ళిపోవటంలేదు?” అని అడిగాను.
రాత్రంతా నాకు నిద్ర లేదు. ఈ రోజు ఉదయం నేను ఎప్పుడూ దర్శించే బాబా మందిరానికి వెళ్ళాను. నేనెప్పుడూ వారాంతములలోనే బాబా గుడికి వెడుతూ ఉంటాను. కాని ఈ రోజు ఎందుకు వెళ్ళానో నాకే తెలియదు. నేను బాబాతో, “నువ్వే కనుక నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నువ్వు వున్నట్లుగా నాకు నీ దర్శనం కావాలి” అన్నాను.
బాబా మీద నాకు కొద్దిగా కోపంగా ఉంది. బాబాని ప్రార్థించిన వెంటనే నేను గుడినించి బయటకు వచ్చాను. బయట ధోతీ పైజామా (మాసిన బట్టలు) ధరించి ఉన్న ఒక ముసలి వ్యక్తిని చూశాను. అతను, “నాకు ఒక కప్పు టీ ఇప్పించగలవా?” అని అడిగాడు. రెండు నిమిషాలు నేను షాక్ తిన్నాను, తరువాత అతనితో “అలాగే” అని చెప్పాను.
దగ్గరలో ఉన్న టీ స్టాల్ కి తీసుకునివెళ్ళి టీ ఇప్పించాను. ఈలోగా నేను ఆ ముసలి వ్యక్తిని, అతని వివరాలు, అతను యెక్కడనించి వస్తున్నాడు అని అన్ని వివరాలు అడగడం మొదలుపెట్టాను. అతను తన పేరు “సంత్ రాం” అనీ, తాను భిక్షమీదే ఆధారపడి జీవిస్తున్నట్లు చెప్పాడు.
నేను అతని కళ్ళల్లోకి చూసి, “బాబా! నిన్ను గుర్తించాను” అన్నాను. అతను ఒక చిన్న నవ్వు నవ్వి, “అవును” అన్నాడు. అతను నా కళ్ళల్లోకి చూసి, ఒక కన్నీటిని రాల్చాడు. నేను గట్టిగా “బాబా, బాబా” అని ఏడిచాను.
ఆ ముసలి వ్యక్తి కూడా నాతోపాటుగా ఏడిచారు. అతను నాతో “నీ విధి నువ్వు నిర్వర్తించు, మిగతాది నేను చేస్తాను” అన్నాడు. నేనతనితో నాకు కొన్ని సమస్యలున్నాయని చెప్పాను. అతను “ఏమీ చింతించద్దు, దేవుడు రక్షిస్తాడు” అని చెప్పారు.
నేను బాబాని డబ్బేమన్నా కావాలా అని అడిగాను. అతను వద్దన్నారు. తను అన్ని దేవాలయాలని దర్శిస్తానని, భిక్షగా ఏది లభిస్తే అదే తింటానని చెప్పారు. నేనతనితో కొన్ని బిస్కట్స్ కొని ఇస్తానన్నాను. అతను వద్దన్నారు.
అతను, “ప్రపంచంలో చాలా మంది పేదవారున్నారు. కొంతమందికి సరైన తిండి కూడా లేదు” అన్నారు. నేనతనిని నా నుంచి కొంత డబ్బు తీసుకోమని బలవంతం చేశాను. కాని అతను నిరాకరించారు.
అతను “నువ్వు నాకిప్పుడు టీ ఇప్పించావు, అలాగే మధ్యాహ్నం ఎవరో ఒకరు తినడానికి ఏదో ఒకటి ఇస్తారు” అన్నారు. అతని కళ్ళు చూడటానికి చాలా ఆకర్షణీయంగానూ, ఆనందకరంగానూ ఉన్నాయి.
నేనతనికి ఒక సాయి ఫొటో ఇస్తానన్నాను, దానికతను సమ్మతించాడు. అతనా ఫోటోని పరీక్షగాచూసి, తీసుకున్నారు. ఇప్పుడతను “నేను వెళ్ళాలి” అన్నారు. నేనతని పాదాలను ముట్టుకున్నాను. అతను “అంతా సరి అవుతుంది” అన్నారు.
నేను నా కారు వద్దకు వెళ్ళి లోపల కూర్చున్నాను. కారు లోపల పెద్దగా ఏడిచాను. శశికళా సిస్టర్ కి ఫోన్ చేసి, నేను బాబాని చూశాను అని ఏడిచాను.
నేను మరొకసారి అనుగ్రహింపబడ్డాను. నా అనుభూతులని నేను మాటలలో వర్ణించలేను. నా జీవితంలో యింత గట్టిగా నేనెప్పుడూ ఏడవలేదు. సాయి భక్తులందరికీ నేను చేసే విన్నపం ఏమిటంటే- మనకెప్పుడూ సాయి ఉన్నాడు. మనం శ్రద్ధ, సహనంతో ఉండాలి అంతే.
నాకు చాలా సంతోషంగా ఉంది.
సాయిరాం
సతీష్
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయితో మరువరాని ఆ…ఖ…రి…కలయిక–Taarkad-18–Audio
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
- బాబా ప్రేరణ
- బాబా ఉన్నారు రెండవ బాగం…
- బాబా ఆశీర్వదించి దృష్టిని ప్రసాదించారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “మరువరాని బాబా దర్శనానుభూతి”
సాయినాథుని ప్రణతి
March 31, 2017 at 7:49 amఈ అనుభవం చాలా ఆనందదాయకంగా వుంది. ఇది చదువుతుంటే నాకు లాస్ట టెమ్ శిరిడీలో బాబాను చూసి నేను పోంగిన ఆనందాలు ఇంక నా ప్రండ్ కి ఈ మద్య బాబా ప్రసాదించిన మదురమైన అనుభుతులు గుర్తుకొస్తున్నాయి .ఇది చదివేక మనస్సుకు ఆనందంగా ప్రశాంతంగా వుంది. జై శ్రీ సాయినాధాయ నమః
Sai Suresh
April 5, 2017 at 7:50 amsaibaba saibaba
kishore Babu
April 5, 2017 at 10:13 pmబాబా వారు నా చర్యలు అగాధాలు అంటారు …వాటిని మనము ఎప్పటికి గుర్తుంచలేము..అయన ఎప్పుడు ఎలా ఏ రూపం వస్తారో తెలియదు.. వచ్చి అయన వెళ్లినాక…భక్తులు, మళ్లీ అయన దయద్వారా గుర్తించ కలుగుతారు.
Prathibha sainathuni
April 6, 2017 at 4:28 amSaibaba saibaba saibaba saibaba….