బాబా ఉన్నారు రెండవ బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

బాబా ఉన్నారు రెండవ బాగం…

 జర్మనీలోని స్వాతి గారి ఈ రోజు మరొక బాబా లీలను తెలుసుకుందాము.

చిన్నవాడయిన మా అబ్బాయికి వంట్లో బాగుండలేదు.  కాని బాబా నాతోనే ఉన్నారన్న విషయం నాకు తెలుసు. అంతా ఆయనే చూసుకుంటారు. బాబా నాతోనే ఉన్నపుడు నేను దేని గురించీ ఆందోళనపడనవసరం లేదు. ఆయనే నాతండ్రి. మాయోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు.

మా అబ్బాయికి ఒంట్లో నలతగా ఉండటంవల్ల తల్లిగా నాకు చాలా దిగులుగా ఉంది.  అది సహజం.  చెడు ఆలోచనలను పారద్రోలడం కోసం ప్రతిరోజు చేసే పూజల తరువాత, యూ ట్యూబ్ లో సాయి సచ్చరిత్రను పెట్టాను. ఆ చరిత్ర శ్రవణం నాకు ధైర్యాన్నిస్తుంది. పొద్దున్న అంతా కూడా బాబాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను.

మధ్యాహ్నం మా యింటి తలుపునెవరో కొట్టారు. మా అబ్బాయి తలుపు తీయడానికి వెంటనే పరిగుత్తుకుని వెళ్ళాడు.  ముందర వచ్చినదెవరో కనుక్కోమని చెప్పాను.  ఎవరదీ అని అడిగాడు మా అబ్బాయి.

వచ్చినతను ఒక జర్మన్ సేల్స్ మన్. మీ అమ్మగారు ఉన్నారా అని అడిగాడు మా అబ్బాయిని.  నేను మా అబ్బాయి వెనకాలే నుంచున్నాను.  నేను ఏదో మాట్లాడేలోపే, అతను ఇలా అన్నాడు, “బాబా ఉన్నారు”.  నాకు పాపా ఉన్నారా అన్నట్లుగా వినపడింది.  అతను పాపా అన్నాడేమో అనుకున్నాను. నేను దాని గురించి పట్టించుకోలేదు.

అతనింకా నన్ను ఏదో అడిగాడుగానీ, నేను ఏదీ తీసుకోలేదు. అప్పుడతను మరేమీ ఫరవాలేదులెండి, నో ప్రోబ్లెం, ఓం సాయిరాం అన్నాడు. అతను ఓం సాయిరాం అనగానే నేను కొంచెం షాక్ కి గురయ్యాను. నేను కూడా అతనికి ఓం సాయిరాం అని సమాధానం చెప్పాను, అతను ముందుకు వెళ్ళిపోయాడు.

నేనింకా ఆ షాక్ లో ఉండే తలుపు వేశేశాను.  అప్పుడు ప్రవేశ ద్వారానికి ఎదురుగా గోడ మీద బాబా పటాన్ని చూశాను.  బహుశా అతను బాబా ఫోటోని చూసి ఉండవచ్చు.  అందుచేతనే అతను బాబా ఉన్నారు అని అన్నాడు. కానీ నాకు మరొకలా వినపడింది.  నేను అర్ధం చేసుకోలేకపోయాను.

నేను, మా అబ్బాయి యింట్లో ఒంటరిగా ఉండటంతో, ఆ వచ్చినతనికి బాబా ఎలా తెలుసాని అడగనందుకు నేను చాలా బాధపడ్డాను.  అతని ద్వారా బాబా తను ఉన్నానని చెప్పారు.  నేను నీవద్దనే ఉన్నాను, ప్రతీచోటా ఉన్నాను చింతించకు అని బాబా చెప్పినట్లుగా అనిపించింది నాకు. 

మనం ఆయనకు సర్వశ్య శరణాగతి చేస్తే సర్వం సాయిమయంగానే కనపడుతుంది అన్నది సత్యం.

లేకపోతే, ఒక జర్మనీ దేశస్థుడు వచ్చి తలుపు కొట్టడమేమిటి, బాబా ఉన్నారు అని చెప్పి ఓం సాయిరాం అనడమేమిటి. అదంతా కూడా బాబా ఏర్పాటు.  ఆయనకంతా తెలుసు.  ఆయనెప్పుడు మన యోగక్షేమాలు చూస్తూ ఉంటారు.  బాబా! నన్నెపుడు ఒంటరిగా వదలద్దు, ఇదే నా వినమ్రమై నా అభ్యర్ధన.  నన్ను నీదివ్య చరణాల వద్దనే ఉండనీ.  నాతప్పులనీ, అహంకారాన్నీ క్షమించు. నన్ను నీఅధీనంలోకి తీసుకో.

ఓం సాయిరాం.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles