Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….
అబ్దుల్ బాబా రెండవ బాగం…..
శిరిడీలో రోడ్డుప్రక్కన లెండీతోపు వున్నది. బాబా రోజూ రెండు పూటలా అందులో ఒక్కరే కొంతసేపుండేవారు. అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా వుండేవాడు. మిట్టమధ్యాహ్న వేళలో అబ్దుల్ కు తప్ప వేరే ఎవరికీ లెండీ లోపలికి ప్రవేశం ఉండేది కాదు.
అబ్దుల్ ఇలా చెప్పాడు: “ఆ తోపులో ఒకచోట రెండడుగుల లోతున ఒక గుంటలో అఖండదీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైన ఒక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు వుండేవి. నేనా దీపాన్ని కనిపెట్టుకుని వుండేవాణ్ణి. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపం కన్పించేది గాదు. ఆయన దగ్గరే రెండు కుండలతో నీరు పెట్టేవాణ్ణి. ఆయన ఆ నీరు అన్నివైపులకూ చల్లి, ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూచేవారు. అప్పుడాయన మంత్రమేదైనా చదివేవారేమో తెలియదు”.
ఇంకా అబ్దుల్ ఇలా చెప్పారు: “నేను ఒకరాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకొని కునుకుతీసాను. అప్పుడు సాయి, “చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమి?” అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి అయన మీద పడ్డాను. అయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరురోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో దోసిట్లో నీళ్ళు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతామని అయన ముందుగా చెప్పారు.”
బాబా నన్ను ఆశీర్వదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కొక్కసారి వారి ఆశీర్వాదం తిట్లు, దెబ్బల రూపాలలో ఉండేది. బాబా నన్ను చాలా చెడ్డగా తిట్టేవారు. నన్ను, జోగ్ ను కొట్టారు కూడా! అదీ ఆశీర్వచనమే!
ఒకసారి ఉదయాన్నే బాబా చావడిలో కూర్చొని, “నీవు భవసాగరాన్ని దాటడానికి తోడ్పడ్డాను. మట్టిని బంగారంగా మార్చాను. ఎంత పెద్ద భవనాన్ని కట్టి ఇచ్చాను!” అని నన్ను ఆశీర్వదించి మశీదుకు బయలుదేరారు. (మొదటి రెండు అతని ఆధ్యాత్మిక ప్రగతి గురించి బాబా చెప్పిఉండవచ్చు. మూడవది అతని భవిష్యత్తును సూచిస్తూ ఉంది. బాబా సమాధి చెందిన తరవాత అతడు సమాధి పూజ నిర్వహిస్తూ బూటీ వాడాలోని గదిలో నివసించేవాడు.)
మొదటి 5 సంవత్సరాలు అతను ఎల్లప్పుడూ బాబా కు సేవ చేస్తూ మసీదు సమీపంలో స్థిరంగా నివసించేవాడు. కొంతకాలం తర్వాత చావడికి ఎదురుగా ఉండే ఇంటిలో నివసించేవాడు.
రేపు అబ్దుల్ బాబా మూడవ బాగం…..
తరువాయి బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….
(Source: Life of Sai Baba by Late Shri.B.V.Narasimha Swamiji and www.saiparichai.com)
http://bonjanrao.blogspot.in/2012/09/abdul-baba.html
For More Information about Abdul Baba and for downloading e-book on Abdul Baba log on to http://www.saiparchai.com
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- అబ్దుల్ బాబా నాల్గవ బాగం…..
- అబ్దుల్ బాబా మూడవ బాగం…..
- అబ్దుల్ బాబా మొదటి బాగం…..
- అబ్దుల్ బాబా ఐదవ బాగం…..
- బాబా ఉన్నారు రెండవ బాగం…
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments