అబ్దుల్ బాబా మూడవ బాగం…..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

అబ్దుల్ బాబా మూడవ బాగం…..

అబ్దుల్ మసీదులో బాబా దగ్గర కూర్చొని ఖురాన్ చదివేవాడు. బాబా అప్పుడప్పుడూ ఖురాన్ తెరిచి అతనికి ఇచ్చి ఆ పేజీలోని వాక్యాలను చదవమనేవారు. బాబా అప్పుడప్పుడు ఖురాన్ నుండి కొన్ని వాక్యాలను చెప్పేవారు. బాబా అప్పుడప్పుడు అతనికి ఇస్లాం మరియు సూఫీని గురించి చెప్పేవారు. ఈ మాటలు అరబిక్ లో అనేక ఉల్లేఖనాలతో ముస్లిం మరియు సుఫీ సూత్రాలకు సంబంధించినవి. దీనినిబట్టి బాబాకు ఇస్లాం మరియు సూఫీ సంప్రదాయాలు బాగా తెలుసునని తెలుస్తుంది.

బాబా చెప్పిన ప్రతి వాక్యం పరమ పవిత్రమైనదిగా భావించి వాటిని అబ్దుల్ ఎంతో శ్రద్ధతో  వ్రాస్తూ వచ్చారు. అతడు  మరాఠీ లేదా మోడీ లిపిలో బాబా అప్పుడప్పుడు చెప్పిన వాక్యాలు అన్నింటిని ఒక నోట్ బుక్ లో వ్రాసి ఉంచారు. ఇందులో బాబా యొక్క వాక్కులు ఉంటాయి. ఇదే అబ్దుల్ యొక్క ఖురాన్. బాబా యొక్క పెదవుల నుండి జాలువారిన పరమ పవిత్రమైన పదములు ఆ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఈ పుస్తకం బాబా యొక్క ఉచ్ఛారణల పుస్తకం అని పిలువబడింది మరియు అబ్దుల్ దీనిని పవిత్ర గ్రంథంగా భావించేవాడు.

బాబా పలుకులతో వ్రాసుకున్న నోట్ బుక్ ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశం చేసేందుకు సరిపోతుందని ఆయనకు పూర్తి విశ్వాసం. ఎవరైనా భవిష్యత్తు గురించి లేదా ఏదైనా సమస్య గురించి తెలుసుకోవాలని అతని వద్దకి వచ్చినప్పుడు అతను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గ్రంథం తెరచి సమాధానం చెబుతుండేవాడు.  తెరిచిన పేజీ నుండి వచ్చిన జవాబు సరైనదిగా ఉండేది.  ప్రతిసారీ సమస్యకు పరిష్కారం దొరికేది. మహాత్ముల మాటలు ఎంతో అమూల్యమైనవి. ఇది బాబా యొక్క బహుమతి, అతనికి బాబా యొక్క దయవలన లభించింది.

అటువంటి భవిష్య సంప్రదింపుల యొక్క రెండు ఉదాహరణలు ఉన్నాయి. బాబా సమాధి అనంతరం మందిర ప్రాంగణంలో ఒక బావి తవ్వబడింది. అందులో నీరు ఉప్పగా ఉన్నాయి. కాబట్టి, భక్తులు అబ్దుల్ బాబాని సంప్రదించారు. అతడు వ్రాసుకున్న బాబా యొక్క వాక్కుల నోట్ బుక్ ద్వారా బాబా సందేశం తెలుసుకోవాలని అనుకున్నారు. అతను ఆ బుక్ తెరవగా “ఇంకా లోతుగా త్రవ్వితే మంచి నీరు వస్తుంది” అని సమాధానం వచ్చింది. దీని ప్రకారం బావి ఇంకా  2 అడుగుల లోతుగా త్రవ్వగా మంచి నీరు వచ్చాయి.

మరొక ఉదాహరణ : బారిస్టర్ గాడ్గిల్ తన కుమారుడు ఇంగ్లాండ్ నుంచి తిరిగి వస్తాడా లేదా అతను అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటాడా అని తెలుసుకోవాలనుకున్నాడు. ఈ విషయమై అబ్దుల్ ని సంప్రదించగా, “అతను తిరిగి వస్తాడు” అని వచ్చింది. అలాగే అతను తన ఆంగ్లేయురాలైన భార్యతో మరియు పిల్లలతో తిరిగి వచ్చాడు.

అలా అబ్దుల్ చెప్పిన విషయాలు సత్యం కావడంతో అప్పటినుండి అబ్దుల్ ‘అబ్దుల్ బాబా’ గా పిలవబడ్డాడు. అబ్దుల్ బాబా ఈ పుస్తకాన్ని తన ‘ఖురాన్’ గా బావించేవాడు. అతను చేతిలో జపమాల పట్టుకొని భక్తిపూర్వకంగా లీనమై మరీ ఆ పుస్తకం చదివేవాడు.

1997లో మరియాన్నే వారెన్ మరియు వి.బి. ఖేర్ లు అబ్దుల్ బాబా వ్రాసిన బాబా యొక్క ఉచ్ఛారణ పుస్తకాన్ని ఆగ్లంలో అనువదించారు. వారు చేసిన ఆ  ప్రయత్నములో  ఇస్లాం ధర్మం మరియు సూఫీయిజం గురించి బాబాకున్న అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నారు.

రేపు అబ్దుల్ బాబా నాల్గవ బాగం…..

తరవాయి బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

(Source: Life of Sai Baba by Late Shri.B.V.Narasimha Swamiji and www.saiparichai.com)

http://bonjanrao.blogspot.in/2012/09/abdul-baba.html

For More Information about Abdul Baba and for downloading e-book on Abdul Baba log on to http://www.saiparchai.com 

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “అబ్దుల్ బాబా మూడవ బాగం…..

Maruthi

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

sai.. manchi information estunnavu.. baba cheppina quran abdul baba vaalla entlo nenu chusanu.1999..lo..eppudu musium lo pettaru…gud collection..

Sreenivas

బాబా సమాధి అనంతరం మందిర ప్రాంగణంలో ఒక బావి తవ్వబడింది….అవును ఆ బావిలోని నీళ్లతోనే రోజు బాబా కి అభిషేకము చేస్తారని షిర్డీ సాయి బాబా సమాధి మందిర పూజారి కూడా చెప్పారు…. కొత్త విషయం షేర్ చేసినందుకు thanks సాయి

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles