Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….
అబ్దుల్ బాబా నాల్గవ బాగం…..
అబ్దుల్ ఒక స్త్రీ ముఖం చూసి ఆమెకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా లేదా అనే విషయాలు చెప్పగలిగేవాడు. అతడలా చెప్పినవన్నీ చాలాసార్లు నిజమయ్యాయి. అదంతా బాబా కృపవలనే సంభవమయింది అని అతడు చెప్పేవాడు.
కొంతకాలం తర్వాత అబ్దుల్ మొట్టమొదటి గురువు షిరిడీకి వచ్చి షిరిడీ నుండి తిరిగి తనతోపాటు రావాలని కోరారు. బాబా అనుమతి లేకుండా ఏమీ చేయలేనని అబ్దుల్ విజ్ఞప్తి చేశారు. బాబా అనుమతినివ్వకపోవడంతో అతని గురువు షిరిడీ నుండి వెళ్ళిపోయారు.
అబ్దుల్ బాబా యొక్క భార్య, కొడుకు నాందేడ్ లో ఉండేవారు. అతని కొడుకుకి యుక్తవయస్సు రాగానే అబ్దుల్ బాబా యొక్క తల్లి అబ్బాయికి పెళ్లి సంబంధం చూడటం ప్రారంభించారు. ఒక సంబంధం చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని ఒక ఫకీర్ కొడుకుకి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్ళిచేయడం ఇష్టం లేదని చెప్పారు.
దానితో నిరాశకు గురై ఆమె బాబా వద్దకు వచ్చి మొరపెట్టుకొని బాబా యొక్క సహాయాన్ని అర్ధించింది. అప్పుడు బాబా “చింతించకండి, బాలునికి మంచి వధువు దొరుకుతుంది, సరైన సమయంలో అన్నీ సక్రమంగా జరుగుతాయి” అని ఆమెకు తృప్తినిచ్చేలా ఓదార్చారు.
కొన్ని రోజుల తరువాత అబ్బాయి మరియు అతని నాన్నమ్మ కొంతమంది స్నేహితులు మరియు బంధువులను సందర్శించడానికి వెళ్లారు. అక్కడ వారు ఒక వ్యక్తిని కలుసుకున్నారు. అతడు అబ్దుల్ యొక్క కొడుకుతో తన కుమార్తెనిచ్చి వివాహం చేసేందుకు ఆసక్తి కనబరిచారు.
అప్పుడు అబ్బాయి నాన్నమ్మ అబ్బాయి ఒక ఫకీర్ కొడుకు అని చెప్పింది. కానీ అతని పెద్ద కూతురికి పెళ్లి కానప్పటికీ, చిన్న కుమార్తెను ఈ అబ్బాయి చేతిలో పెట్టడానికి చాలా ఆసక్తి చూపాడు. బాబా వాక్కు ఫలించింది. పెళ్లి గొప్పగా అందరికీ ఆనందదాయకంగా జరిగింది.
బాబా దేహత్యాగానికి కొంత సమయం ముందు అబ్దుల్ ను రమ్మని కబురు చేసారు బాబా. కాని ఇతడు కాసేపు ఆగి వస్తానని చెప్పాడు. అ మాట విని బాబా చిరునవ్వు చిందించారు. అతను వచ్చేటప్పటికి బాబా దేహత్యాగం చేయటం చూచి తన దురదృష్టానికి ఎంతగానో దుఃఖించాడు అబ్దుల్.
అబ్దుల్ తన అంతిమ క్షణం వరకు బాబాను అట్టిపెట్టుకొని ఉన్నారు. బాబా యొక్క మహాసమాధి తరువాత, అబ్దుల్ 1922 వరకు బాబా సమాధి మందిరములో ఎడమవైపునవున్న గదిలో ఉంటూ సమాధిమందిరం శుభ్రపరచడం, బాబా సమాధికి అభిషేకము చేసి, వస్త్రములతో మరియు పూలతో అలంకరించి, మహానైవేద్యము పెట్టడం చేసేవాడు. భక్తులు ఇచ్చిన దక్షిణ మరియు బాబా ప్రసాదంలోని కొంత భాగంతోనే అతను జీవనం సాగించేవాడు. ఇప్పటికి కూడా అబ్దుల్ వంశస్థులు ఉదయాన్నే బాబాకు పూలను సమర్పిస్తున్నారు.
రేపు అబ్దుల్ బాబా ఐదవ బాగం…..
తరువాయి బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….
(Source: Life of Sai Baba by Late Shri.B.V.Narasimha Swamiji and www.saiparichai.com)
http://bonjanrao.blogspot.in/2012/09/abdul-baba.html
For More Information about Abdul Baba and for downloading e-book on Abdul Baba log on to http://www.saiparchai.com
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- అబ్దుల్ బాబా మూడవ బాగం…..
- అబ్దుల్ బాబా ఐదవ బాగం…..
- అబ్దుల్ బాబా మొదటి బాగం…..
- అబ్దుల్ బాబా రెండవ బాగం…..
- సాయి భక్త బడేబాబా నాల్గవ బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments