Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
అబ్దుల్ బాబా ఐదవ బాగం…..
1922లో బాబా యొక్క పరమ భక్తుడు దీక్షిత్ అహ్మద్ నగర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ను సంప్రదించి, ఒక పబ్లిక్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయటానికి కోర్టునుండి అనుమతి పొందారు. దానిని వ్యతిరేకిస్తూ తనని అభిమానించే కొందరు వ్యక్తుల ప్రేరణతో అబ్దుల్, తాను సాయిబాబాకు చట్టబద్ధమైన వారసుడనని, తాను సమాధిమందిర నిర్వహణకు తగిన హక్కు కలిగి ఉన్నానని ట్రస్ట్ ఏర్పాటును సవాలు చేస్తూ కోర్టును సంప్రదించారు.
బాబా అనుగ్రహంతో, సమాధిమందిరం ఒక మఠం గానీ, ఆశ్రమం గానీ కాదని మరియు సాయిబాబాకు వారసులు ఎవరూ లేరని, అలా సాయిబాబాకు తాను వారసుడినని అబ్దుల్ చెప్పుకోవడానికి వీలులేదని కోర్టు పేర్కొంది.
ఆ విధంగా అతను ఆ కేసును ఓడిపోయాడు. తద్వారా మందిర నిర్వహణతో ఎలాంటి సంబంధం లేకుండా నిరోధించబడ్డాడు అబ్దుల్. అంతేగాక, అతనికి ఉచిత ఆహారాన్ని నిలిపివేసి, సమాధి మందిరంలో అతను ఉంటున్న గదిని కూడా ఖాళీ చేయమన్నారు. కొంతకాలం తర్వాత, సంస్థాన్ వారు ఈ తీవ్రమైన ఆంక్షలను ఉపశమించి, సమాధి మందిర నిర్వహణకు అనుమతించారు.
అప్పటినుండి 1954 ఏప్రిల్ 2న అతని మరణం వరకు అబ్దుల్ బాబా సమాధి మందిర కార్యక్రమాలలో పాల్గొని బాబా సేవ చేసుకున్నారు. బాబా సమాధి చెందిన తర్వాత 36 సంవత్సరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాను సేవించాడు అబ్దుల్.
బాబా సమాధి చెందిన తరువాత అబ్దుల్ బాబా పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి, బాబా ఊదీని అనేకమందికి అందించి, దానితో వారు వ్యాధుల నివారణ మరియు ఇతర కోరికలు సాధించుకోవటానికి సహాయ పడ్డాడు.
బాబా యొక్క అంగరక్షకుడుగా, సమాధిమందిరంలో పరిచారకునిగా తనకు 66 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు పనిచేసారు. అతను బాబా యొక్క హనుమంతునిగా గౌరవించబడ్డాడు.
ఎటువంటి చెల్లింపు లేదా ప్రతిఫలాన్ని ఎదురు చూడకుండా గురువు మీద పూర్తి విశ్వాసంతో గురుసేవకు నిరంతరం హాజరయ్యాడు అబ్దుల్. గురువు యందు పరిపూర్ణ భక్తి, విశ్వాసాలకు మరియు చురుకైన సేవకు ఇతడు గొప్ప ఉదాహరణ. అతను బాబా చెప్పిన శ్రద్ధ మరియు సబూరిలను కలిగి ఉన్నారు.
బాబా అప్పుడప్పుడు అబ్దుల్ అంతస్తులో గల గృహంలో నివసిస్తారని మరియు అతను మహిమాన్విత సమయాన్ని కలిగి ఉంటాడని చెప్పారు. అందుకు తగట్టుగానే అబ్దుల్ కొంతకాలం బూటీ వాడాలో నివసించారు. హిందువులు మరియు ముస్లింల యొక్క విస్తృత వర్గాలలో గౌరవం పొందారు. అతను బాబా సేవలో తన మొత్తం జీవితాన్ని అంకితమిచ్చిన ఒక అంకిత భక్తుడు.
బాబా తమ మహాసమాధి తరువాత కూడా అబ్దుల్ ను కాపాడుతున్నారు. రాధాకృష్ణమాయి మరణానంతరం ఆమె నివసించిన మట్టి ఇంటిలో అబ్దుల్ బాబా నివసించేవాడు. ఆ ఇల్లు చాలా పురాతనమైనది కావడం వలన శిథిలావస్థలో ఉన్నది. సుమారు 1927వ సంవత్సరంలో ఒకసారి అబ్దుల్ ఆ ఇంటిలో కూర్చుని ఖురాన్ చదువుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఇల్లు కూలిపోయింది. శిధిలాలలో అతను దాదాపు కూరుకుపోయాడు. అయితే బాబా దయవల్ల అతను గాయపడలేదు.
1954 లో అతని మరణం తరువాత, అతనిని సమాధిమందిర సముదాయంలో లాండీబాగ్ సమీపంలో ఖననం చేసారు. అతని చిన్న నివాస గృహం చావడికి ఎదురుగా ఉంది. సందర్శకుల సందర్శనార్థం ఆ ఇంట్లో ప్రధాన గది అబ్దుల్ బాబా జ్ఞాపకార్థం ఒక స్మారకంగా మార్చబడింది.
అబ్దుల్ బాబా కుటీరాన్ని సందర్శించే భక్తులు ఎడమవైపు గోడపై వేలాడుతున్న బాబా యొక్క అసలు ఛాయాచిత్రాలు మరియు బాబా వాడిన చిమ్టాను చూడవచ్చు. ఆ చిమ్టాను బాబా స్వయంగా అతనికి ఇచ్చారు. అబ్దుల్ వాటిని భద్రంగా దాచివుంచి, ప్రతిరోజు ధూపంతో పూజించేవాడు.
బాబా మహాసమాధి తరువాత, అబ్దుల్ భక్తుల నొప్పులను మరియు రోగాలను నయం చేసేందుకు ఈ చిమ్టాను ఉపయోగించాడు. బాబా అతనికి సాట్కా మరియు ఒక రేకు డబ్బాను కూడా ఇచ్చారు.
అబ్దుల్ భార్య ఉమ్రాన్రావు బి. వీరి కుమారుడు అబ్దుల్ పఠాన్(ఘనీ భాయ్) 1901 లో జన్మించాడు మరియు డిసెంబరు 14, 1984 న మరణించాడు. అబ్దుల్ కి ఐదుగురు మనవళ్ళు ఇబ్రహీం, అజీజ్, రెహ్మాన్, రహీం మరియు హమీద్ మరియు ఇద్దరు మనుమరాళ్ళు శంషాద్ బి మరియు ఇర్షద్ బి. ప్రస్తుతం రెహెమ్ మరియు హమీద్ మాత్రమే బ్రతికి ఉన్నారు.
అబ్దుల్ తరువాత అతని వారసుడు ఘనీ భాయ్ కి రోజూ ఉదయం 10 గంటలకి బాబా సమాధిని శుభ్రపరిచి పువ్వులతో అలంకరించే గౌరవం ఇవ్వబడింది. అబ్దుల్ బాబా యొక్క మనవడు హమీద్ బాబా ఈనాడు కూడా అబ్దుల్ బాబా యొక్క వారసత్వం కొనసాగిస్తున్నారు.
సమాప్తం…
(Source: Life of Sai Baba by Late Shri.B.V.Narasimha Swamiji and www.saiparichai.com)
http://bonjanrao.blogspot.in/2012/09/abdul-baba.html
For More Information about Abdul Baba and for downloading e-book on Abdul Baba log on to http://www.saiparchai.com
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- అబ్దుల్ బాబా మూడవ బాగం…..
- అబ్దుల్ బాబా నాల్గవ బాగం…..
- అబ్దుల్ బాబా మొదటి బాగం…..
- అబ్దుల్ బాబా రెండవ బాగం…..
- షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ కొర్హలె గ్రామము – 1 వ బాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “అబ్దుల్ బాబా ఐదవ బాగం…..”
Madhavi
June 8, 2017 at 11:42 amsai..bhale raasavu..manchi information echavu abdul baba gurinchi..baba bless u.sai..enka chalaa manchi,manchi bhakthula gurinchi nuvvu raayalani nenu korutunnanu..sairam…
Sai Suresh
June 8, 2017 at 12:34 pmthank you so much aunty garu