రాబోయే మృత్యువును ఆపడానికి బాబా వచ్చారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి బంధువులకు సాయిరామ్, నా పేరు రమణి(మహతి) మీ అందరికీ తెలుసు. రైల్వే కోడూరు కడప జిల్లా.  ప్రస్తుతం నేనుండేది ఇక్కడే. నా జీవితంలో జరిగిన ఒక దివ్య లీల మీ అందరికీ చెప్పబోతున్నాను.

మనకు అమ్మ ప్రేమ అవసరమైనపుడు సాయి అమ్మగా మారి మనకు మాతృ ప్రేమనందిస్తారు. అదే మనం అమ్మగా ఆలోచించేటపుడు సాయి బిడ్డగా పసివాడుగా మన ఒడిలో చేరి మారాం చేస్తారు. అనువించినా, అనుభవాలు ఇచ్చినా ఆయనకే చెల్లింది

కోడూరులో షిరిడి సాయి దేవాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం పక్క పక్కనే వున్నాయి.  వాటి పూజారులు ఒకే ఇంట్లోని తండ్రీ కొడుకులు. 2014 డిశంబర్ లో మా అబ్బాయికి పెళ్ళి సంబంధం వస్తే జాతకాలు కుదిరాయో లేదో అని చూపించాలని మా పనిమనిషి భామతో ఉదయం 11గంటల వేళ బాబా గుడికి వెళ్ళాను.

బాబా గుడిలో కాని రాఘవేంద్ర గుడిలో కాని ఎవరూ లేరు. గుడి వెనకే పూజారుల ఇల్లు. బాబా గుడికి, రాఘవేంద్ర స్వామి గుడికి మధ్య ఒక రావి చెట్టు వుంది. నేను పూజారి గురించి చూస్తూ రావి చెట్టు దాటుతుంటే ఎవరో నా చీర కుచ్చెళ్ళు పట్టుకుని లాగారు. కిందికి చూశాను. ఒక చిన్న పది నెలల బాబు చామన చాయగా వున్నాడు. పుష్టిగా మొలకు వెండి మువ్వల మొలత్రాడు వుంది. నా చీర లాగుతున్నాడు.

భామా ఎవరీ బాబు నా చీర లాగుతున్నాడు. వీళ్ళవాళ్ళెవరైనా వున్నారేమో చూడు అన్నాను. ఆమె ఆశ్చర్య పోతూ యెక్కడమ్మా ఇక్కడెవరూ లేరే అంది. నేను కిందికి చూస్తే యెవరూ లేరు. నా భ్రమేమో అనుకున్నాను.

మరలా ముందుకు అడుగు వేయబోతే మరలా చీర లాగుతూ నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని మారాం చేస్తున్నాడు. ఈసారి స్పష్టంగా కనిపించాడు.
 రావి చెట్టు మొదట్లో యెవరో కాషాయ వస్త్రాలతో వున్న బాబా బొమ్మను పెట్టారు. నా చీర లాగుతున్న బాబు మాట్లాడిన మాటలు ఆ బాబా బొమ్మలోంచి వినపడుతున్నాయి.

 వెంటనే భామా నా చీర లాగుతున్నది బాల సాయి అన్నాను. ఇంటికి తీసుకు పోదాం అన్నది భామ. కాని నా భర్త బాబా ధ్వేషి నన్ను తిడతారని భయపడి బాబా బొమ్మ దగ్గరకెళ్ళి బ్రతిమాలాను. సాయి కన్నా నా భర్తకు నువ్వంటే పడదు. నిన్ను తీసుకెళ్తే నిన్ను తిట్టించిందాన్నవుతాను. ఆయనను అనుమతి అడిగి తీసుకెళ్తాను. అని చెప్పి ఇంటికి వచ్చేశాము.

జనవరి ఫస్ట్ ముక్కోటి ఏకాదశి శుక్రవారం పడింది. ఆముందు రోజు డిశంబర్31 గురువారం. రాత్రి 8:30 కి రెండు కాళ్ళు గబగబా పరుగెడుతూ వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయాయి. నాకు అపుడు గుర్తు వచ్చింది. బాబా(బు) అడిగిన విషయం. నిజానికి నేను మరచిపోయి రొటీన్లో పడిపోయాను. ఆ వచ్చినవి సాయి పాదాలు. గుర్తు పట్టి సాయి పాదాలకు భక్తితో ప్రణామం చేశాను.

తర్వాత మావారికి జరిగిందంతా చెప్పాను. యెక్కడ పెడతావు చోటు లేదు కదా అన్నారు. నేనెక్కడుంటే ఆయన అక్కడేవుంటారు. మీకు అడ్డం లేకుండా చూసుకుంటాను అని చెప్పాను. అయితే తెచ్చుకో అన్నారు.

మర్నాడు జనవరి 1వ తేది శుక్రవారం వచ్చింది. గుడికి ఉదయం 11 గంటలకి వెళ్ళాను. గుడి దగ్గర పెద్ద్ద క్యూ వుంది. ఈ రోజు గురువారం కూడా కాదు. ఇంత క్యూ ఉందేమిటి అని ఒకరినడిగితే ఈ రోజు ముక్కోటి ఏకాదశి అన్నారు. శుక్రవారం కదా విగ్రహాన్ని ఇస్తారో లేదో అని సందేహిస్తూనే పూజారి గారికి జరిగింది చెప్పి విగ్రహాన్ని అడిగాను.

నాకేమి అభ్యంతరం లేదమ్మా కానీ అది పగిలిన విగ్రహాహం. మిగిలినవి ఇంట్లో ఎవరు పెట్టుకోరు మీకు అభ్యంతరం లేకపోతే తీసుకెళ్లండి అన్నారు. నాకు బ్రహ్మానందం అయిపోయింది. ఆ బొమ్మను చంటి బిడ్డను ఎత్తుకున్నట్లు తీసుకొచ్చాను.

ఆ బొమ్మను ఉత్త్తర దిక్కు చూస్తున్నట్లు పెట్టాను. ఎంతో మంది చూడ్డానికి వచ్చారు. స్వామి వచ్చాక విశేషంగా ధన ఆదాయం పెరిగింది. చూడ్డానికి వచ్చినవారు దక్షిణ దిక్కులో పెట్టారేంటి మంచిది కాదు తీసెయ్యండి అన్నారు. నాకు వాస్తు తెలియదు. మా ఇంట్లో ఉత్త్తర దక్షిణలు తప్ప వేరేచోట పెట్టేందుకు వీలు లేదు.

ఆ బొమ్మను అక్కడ నుండి మర్చి ఉత్తర దిక్కున కిచెన్లో పెట్టాను. ఇంట్లో అకారణంగా గొడవలు మొదలయ్యాయి. మావారు ముందే బాబా ద్వేషి పగిలిన విగ్రహం ఇంట్లో ఉండకూడదు తెఛ్చి పెట్టావ్. అది బయట పారెయ్ అన్నారు. ఆయన మాట శాసనం.  మా ఇంటి ఎదురుగా వున్నా శివాలయంలో బొమ్మను ఏడుస్తూ వదలి వచ్చ్చేసాను.

అసలు బాబా ఎందుకు వఛ్చినట్టు ఎందుకు వెళ్ళిపోయినట్టు అని మెడిటేషన్ లో కూర్చొని ప్రశ్న వేసుకుంటే నాకు రాబోయే మృత్యువును ఆపడానికి వచ్చారని తెలిసింది. ఆ వివరాలు అప్రస్తుతం కనుక చెప్పడం లేదు.

మరలా తెల్లని బాబా బొమ్మను అదే దక్షిణ దిక్కు లోనే పెట్టాను. మా ఇంట్లోని ఆ చోటు బాబాకు చాలా ఇష్టం.

నా వరాల తండ్రి సాయినాధునికి వినయపూర్వక నమస్కారములు

సమాప్తం …

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “రాబోయే మృత్యువును ఆపడానికి బాబా వచ్చారు

super experience…sai..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles