బాబా రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే మా ప్రయాణాన్ని ఆపి కాపాడారు..Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కీ జై ! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై !!

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-115-మా ప్రయాణాన్ని ఆపి కాపాడారు 5:29

నాపేరు వేలూరు (స్వయంపాకుల) జయప్రద. మేము బెంగుళురులొ వుంటున్నాము.

నా భర్త వేలూరు సురేష్ రాఘవేంద్ర. సాఫ్ట్ వేర్ ఇంజనీరు.

మేము చాలా రోజులుగా శిరిడిలో బాబాను దర్శించాలనుకుంటున్నాము.

చాలా మంది గురుపుర్ణిమకు, విజయదశమికి శిరిడికి వెళ్ళి పది పదిహేను రోజులుండి బాబాగారిని, గురువుగారిని దర్శించుకుని వస్తుంటారు.

మాకు అలా వెళ్ళాలని వున్నా కుదరలేదు.ఈసారి విజయదశమికైనా శిరిడికి వెళ్ళి బాబాను కనులారా చూడాలని అనుకున్నాను. మా వారికి రిజర్వేషన్ దొరక్క పోలేకపోయాము. నాకు చాలా బాధవేసింది.

బాబాను చాలా ఆర్తిగా వేడుకున్నాను.ఇంతలో అక్టోబరు 25 నుంచి నెలాఖరు వరకు మా పాప శ్రీలేఖ్యకు సెలవులిచ్చారు.

అదే సమయంలో బాబా కృపవలన మా వారి ప్రాజెక్టు పని పూర్తయిపోయి వారం రోజులు సెలవు దొరికింది.

ఇది ఖచ్చితంగా బాబా మన రాకకోసమే ఏర్పాటు చేసారని నాకు శిరిడి నుండి కబురు వచ్చిందనిపించి నాకు చాలా సంతోషం వేసింది.

ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 25వ తారీఖున బెంగుళూరు నుండి కోపర్ గం వెళ్ళేదానికి రైల్వేలో రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేశాము.

ఏమి దొరకలేదు. నీరుత్సాహపడకుండా బాబా మీద భారం వేసి బస్సులో హైదరాబాదుకు వెళ్ళి అక్కడి నుండి 26వ తేది సాయంత్రం అజంతా ఎక్స్ ప్రెస్ లో నాగర్ సోల్ పోవాలని నిర్ణయించుకోన్నాము.

బస్సు ప్రయాణం చాలా కష్టమవుతుంది. అదే గాక మా చిన్న పాప శృతిప్రియకు జ్వరముగా ఉండినది.

సరే ఏలాగైతే అలాగని బస్సుకు రిజర్వ్  జరిగినది. నేను మామూలుగా ఇంటర్నెట్ చూస్తుంటే 26వ తారీఖునాటికీ బెంగుళూరు డిల్లీ ఎక్స్ ప్రెస్ లో సరిగ్గా మాకు కావలసిన మూడు తిక్కేట్లుకు రిజర్వేషన్ వుందని చూశాను.

వెంటనే ఒక్కసారిగా ‘బాబా’ అని సంతోషంతో ఏలుగెత్తి బాబాకు మనసారా కృతఙ్ఞతలు చెప్పుకొని వెంటనే ఆన్ లైన్ లో ఆ మూడు టెకెట్లు బుక్ చేశాము.

మా మామగారికి ఫోను చేసి వారిని హైదరాబాదు నుండి నేరుగా శిరిడి వచ్చేయమని చెప్పాము.25వ తారీఖున మేము చేయించుకున్న బస్సు రిజర్వేషన్ రద్దు చేయించుకున్నాము.

అసలు నాకు అంతకుముందు నేను చూసినా కనపడని ఇంటర్నెట్ టిక్కెట్స్ అప్పుడే ఎందుకు కనపడ్డయో, మేము బస్సు ప్రయాణానికి చేయించుకున్నటిక్కెట్లను బాబా ఎందుకు క్యాన్సిల్ చేశారో నాకప్పుడు అర్దమైంది.

నా భక్తుడ్ని నేను పతనం కానివ్వను. సప్తసముద్రాల ఆవల వున్నా వారిని నేను ఎప్పుడూ గమనిస్తూ, రక్షిస్తూనే వుంటాను అన్న బాబా అభయప్రధాన పలుకులు గుర్తుకు వచ్చాయి.

బాబా నన్ను నా కుటుంబాన్ని కాపాడి తన దగ్గరకు ఎలా రప్పించుకున్నారో ఈ లీల చదివితే అర్ధమవుతుంది.

మేము ముందుగా బస్సుకు రిజర్వ్ చేసుకున్న ప్రకారము అయితే 25వ తేది సాయంత్రం 6 గం:లకు బయలు దేరాలి.

ఆ రోజు సాయంత్రం 7 గం:లకు మా ఇంట్లోని స్విచ్ బోర్డులో నుండి పొగలు వచ్చి మంటలు వచ్చాయి.

మేము వెంటనే స్పందించి మెయిన్ ఆఫ్ చేసి ఎలక్ఠ్రిసిటి వారిని పిలిపించి సరిచేశాము.

లేకపోతె మా గదంతా మంటలు వ్యాపించి విలువైన వస్తువులన్నీ కాలిపోయి ఆస్తినష్టం సంభవించి ఉండేది.

అంతేగాకుండా మేము చాలా కాలానికి శిరిడికి వెళ్తున్నాము కదా! బాబాకు మేము రావడం ఇష్టం లేదేమో అనే పిచ్చి పిచ్చి సందేహాలు కూడా వచ్చేవి.

ఈ విధంగా బాబా రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే మా ప్రయాణాన్ని ఆపి కాపాడారు.

మేము ఒక రోజు తర్వాత ఎటువంటి ఇబ్బందీ లేకుండా(26వ తేదిన) చక్కగా శిరిడి వెళ్ళి బాబాను దర్శనం చేసుకున్నాము.

ఇంకో విచిత్రమేమిటంటే మేము శిరిడికి బయలుదేరే రోజునే మా పాపకు అంతకు ముందున్న జ్వరం తగ్గి పూర్తిగా నయమైంది.

మా పాప చాలా హుషారుగా, సంతోషంగా ఉండినది. శిరిడిలో బాబా సన్నిదిలో నాలుగు రోజులు గడిపినాము. ఆరతులు చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

చాలా దగ్గరి నుండి బాబావారిని దర్శించుకొనే అదృస్టం కలిగింది. అప్పుడునాకనిపించింది.

” నా సమాధి నుండి కూడా నేను మాట్లాడుతాను. నా సమాధి సమాధాన మిస్తుంది. నేను మీ వెంటే ఉంటాను.

నన్ను ఆర్తిగా పిలిచినా వారిని నేను నా చెంతకు రప్పించుకుంటాను” అని బాబా పలికిన పలుకులు గుర్తుకు వచ్చాయి” కానీ గురువుగారి దర్శనం జరగలేదు.

బాబా గురువుగార్లకు సాష్టాంగ నమస్కారములు తెలియజేస్తున్నాను…

వేలూరు (స్వయంపాకుల) జయప్రద,
నెల్లూరు.

సంపాదకీయం: సద్గురులీల (జనవరి – 2009)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles