Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్
మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-116-విషం ఏక్కకుండా చెయ్యి 2:08
మాది ఇందుకూరు పేట మండలం, మొత్తలు దగ్గర వరణాశివారి కండ్రిగ అను చిన్న గ్రామము. నా పేరు పద్మావతి.
బాబాను నమ్మిన వారిని బాబా ఎలా చెంత వుండి ఆదుకుంటారో నాకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకుటున్నందుకు నాకు ఆనందంగా వుంది.
నేను మా వారు వయసులో పెద్దవాళ్ళం. మేము క్రింద పడుకోలేని పరిస్థితి మాది.
మేము మంచం మీద పడుకుంటాము. ఒక రోజు ఎందుకో నాకు మంచం మీద నిద్రపట్టక క్రింద పడుకోవాలనిపింఛి, క్రింద చాప వేసుకొని పడుకున్నాను.
పడుకున్న కొంత సేపటికి బాగా నిద్రపట్టేసింది. కొంతసేపటికి ఉన్నట్లుండి ఏదో చేతిమీద కుట్టినట్లు అనిపించింది.
కొంతసేపటికి వెంటనే మెలకువ వచ్చి మావారిని లేపి ఏదో కుట్టిందని వారికి చెప్పి టెన్షన్ పడుతూ చాప పైకెత్తి చూడసాగాను.
అక్కడ పెద్ద తేలు చాప క్రింద నుంచి వెళ్ళ సాగింది. వెంటనే కర్రతో దానిని మావారు చంపేశారు.
కాని నాకు చాలా భయము వేసి ఏడవసాగాను. వెంటనే బాబా పటంవైపు పరిగెత్తుకు వెళ్ళి బాబా విభూదిని రాసి బాబాకు మొర పెట్టుకున్నాను.
బాబా నాకు నొప్పి ఒర్చుకొనే శక్తి లేదు. విషం ఏక్కకుండా చెయ్యి, నువ్వు తప్ప ఇంకెవరు దిక్కులేరు. అంటూ ఊదీ పూసి ఏడవ సాగాను. కొంత సేపటికి నాకు అసలు నొప్పి అన్నమాటేలేదు.
తరువాత కొంత సేపటికి బాగా నిద్రపోయాను. ఉదయం నొప్పి అన్నమాటే లేకుండా చేశారు బాబా. ఉదయం బాబాకు కృతఙ్ఞతలు చెప్పుకున్నాను.
ఆపదలో ఉన్నవారికి బాబాగారి ఊదీ మహాప్రసాదం అని నాకు అనుభవమైనది.
వరణాశి పద్మావతి,
వరణాశివారి కండ్రిగ,
నెల్లూరు జిల్లా.
సంపాదకీయం: సద్గురులీల (ఫిబ్రవరి – 2009)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333
Latest Miracles:
- నువ్వు కూడా అన్నయ్య లాగా బాబా పూజ చెయ్యి నీకు మంచి సంభందం వస్తుంది
- ఇలా వచ్చి దక్షిణ స్వీకరించి, ఆశీర్వదించారు, బాబా కాక ఇంకెవరు బాబానే.–Audio
- బాబా నువ్వు నా గురుంచి ఆలోచిస్తున్నవా! అని సంతోషించాను.—Audio
- ‘నా ఆలయం మరమ్మత్తులు నువ్వు పూర్తి చేయించు’
- బాబా నీ ప్రేమ తప్ప నాకేమి వద్దు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments