Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘కథేంటి బాబా? ఏం జరిగింది?’ అడిగాడు భక్తుడు. భోజనం సంగతే మరచిపోయాడు.‘రా, చెబుతాను.’ అని చెట్టునీడకు చేర్చానతన్ని. ఇందాక ఎక్కడ కూర్చున్నామో అక్కడే ఇద్దరం కూర్చున్నాం. చిలుం ముట్టించి, రెండు దమ్ములు లాగాను. అతను చేయి జాస్తే ఇచ్చాను. అతనో దమ్ము లాగాడు.
‘చెప్పండి బాబా, కథేంటి?’ అడిగాడు.‘కథేంటంటే…ఒకప్పుడు ఒక శివాలయం ఉండేది. బాగా పాడుబడి ఉండేదది. దానిని బాగు చేయించాలనుకున్నారు గ్రామ ప్రజలు.
చందాలు వేసుకున్నారు. కూడిన మొత్తం ఆలయాన్ని బాగు చేసేందుకు సరిపోదు, ఇంకొంత కావాలి. ఆ కావాల్సింది, ధనరాజ్ ఇస్తాడనుకున్నారు.
ధనరాజ్ ఆ గ్రామంలో బాగా డబ్బున్న వ్యక్తి. అడుగుతున్నది దేవాలయం కోసం కాబట్టి కాదనడనుకున్నారు ప్రజలు. పైగా చందాలుగా సేకరించిన మొత్తాన్నంతా అతని చేతిలోనే పోశారు. ఇలా అన్నారు.
‘మేము కొంత ఇచ్చాం. మీరు కూడా కొంత వెయ్యండి. సరిపోతుందప్పుడు. ఆలయం బాగుపడుతుంది. ఆలయాన్ని కూడా మీరే దగ్గరుండి బాగు చేయండి.’అలాగేనన్నాడు ధనరాజ్.
డబ్బుకీ ప్రాణాకీ అతనికి లంకె. పైసా ఖర్చు చెయ్యడు. పిసినారి. పైగా వడ్డీవ్యాపారి. ప్రతి దానికీ లాభనష్టాల బేరీజులు వేసుకుంటాడు.
దగ్గరుండి ఆలయం మరమ్మత్తులు చూడడమే గాక, తన వాటాగా చందా చెల్లించాలా? సగానికి సగం డబ్బు ఇవ్వాలా? చచ్చినా ఇవ్వననుకున్నాడు ధనరాజ్. అనుకున్నట్టుగానే ఇవ్వలేదు.
ప్రజలు ఇచ్చిన డబ్బుతోనే అయినకాడికి ఆలయం మరమ్మత్తులు చేయించాడు. ఇంకా చాలా చేయించాలి. చేయించాలంటే డబ్బు కావాలి. మళ్ళీ చందాలు వేసుకున్నారు ప్రజలు. అయినా ఆలయం మరమ్మత్తులు పూర్తి కాలేదు.
ఒక రాత్రి ధనరాజ్ భార్యకు కలలో శివుడు కనిపించాడు.‘నా ఆలయం మరమ్మత్తులు నువ్వు పూర్తి చేయించు’ అని అజ్ఞాపించాడు. ఆనందించిందామె. మేలుకుంటూనే తన కి వచ్చిన కల గురించి ధనరాజ్‌కి చెప్పింది.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘మనసుంటే మార్గం ఉంటుంది. ఆలోచించు. నీ దగ్గర డబ్బు లేకపోవడమేమిటి?’
- నగలు అమ్మి, వచ్చిన డబ్బుతో శివాలయం మరమ్మత్తులు చేయిస్తుందా?
- వారి రెండు జన్మలకూ ప్రత్యక్షసాక్షిగా నేను శివాలయాన్ని అంటిపెట్టుకునే ఉన్నాను.
- మండుతున్న చితి మంటల్లోనుంచి మా గురువు గారు (తిరుమల శెట్టి సుబ్బారావు) లేచి కూర్చొని – ”నువ్వు పారాయణ చేయించు, ఆపొద్దు” అని చెప్పినట్లు అనిపించింది.
- సాయి సేవకే నా పూర్తి జీవితం …..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments