Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
శివుడు రెండోసారి కలలో కనిపించాడామెకు. కనిపించి, ‘నా ఆలయాన్ని నువ్వే పూర్తి చేయించాలి. నీ డబ్బుతోనే చేయించాలి. చేయించు! నీ భర్త డబ్బు నాకు వద్దు.’ అన్నాడు. ఉద్యోగమా? సద్యోగమా? తను సాధారణ గృహిణి.
తన దగ్గర ఆలయాన్ని మరమ్మత్తు చేయించగలిగేంత సొమ్ము ఎక్కడిది? అనుకుందామె. ఆ మాటే అన్నది శివుడితో. ‘మనసుంటే మార్గం ఉంటుంది, ఆలోచించు! నీ దగ్గర డబ్బు లేకపోవడమేమిటి?’ అన్నాడు శివుడు.ఆలోచించిందామె.
అవును! తన దగ్గర డబ్బు లేకపోవడమేమిటి? తన దగ్గర పుట్టింటివారిచ్చిన నగలు ఉన్నాయి. అవి అమ్మితే డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఆలయ మరమ్మత్తులకు సరిపోతుందని అనుకున్నదామె.
ఆ ఆలోచనను పొద్దునే భర్త ధనరాజ్ ముందుంచింది.ఆమె ఆలోచనకి అతనికి స్పృహ తప్పినట్టయింది.
నగలు అమ్మి, వచ్చిన డబ్బుతో శివాలయం మరమ్మత్తులు చేయిస్తుందా?
అయ్యయ్యో! ఇదేం బుద్ధి? నట్టింటి నగలు బయటికి వెళ్ళడానికి వీలు లేదు. అమ్మడానికి అంతకన్నా వీలు లేదు. ఎక్కడ ఉన్న నగలు అక్కడే ఉండాలి.
నగలు తన దగ్గరే ఉండాలి. ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆలోచించసాగాడు ధనరాజ్.
ఆలోచించి ఆలోచించి, ఓ నిర్ణయానికి వచ్చాడతను.దుబాకి అనే మహిళ తన దగ్గర రెండు ఎకరాల భూమిని తాకట్టు పెట్టింది.
ఆ భూమి ఎందుకూ పనికి రాదు. గడ్డికూడా మొలవదక్కడ. అలాంటి భూమిని తాకట్టుగా తనెందుకు తీసుకున్నాడంటే, చాలా చౌకగా వస్తోందది, కాదనుకుంటే ఎలా? అనుకున్నాడు. తీసుకున్నాడు.
ఇప్పుడు ఆ భూమిని భార్యకి అందజేసి, నగలను నట్టింటి నుంచి కదలనీయకుండా చేద్దామనుకున్నాడతను.‘ఏమిటి ఆలోచిస్తున్నారు? నగలు అమ్ముతానంటే మాట్లాడరేమిటి’ అడిగింది భార్య.
‘నీ నగలు నీ ఇష్టం. అమ్ముకో, కాదనను. కాకపోతే నీ నగల్ని నాకే అమ్మాలి. నీ నగలకి రెండు ఎకరాల భూమిని నేను నీకిస్తాను. తీసుకో’ అన్నాడు ధనరాజ్.‘భూమినేం చేసుకోను?
‘భూమి మాత్రం డ బ్బు కాదా? ఆ భూమిని గుడి పూజారికిచ్చి, డబ్బు చెయ్యమను. ఆ డబ్బుతో ఆలయ మరమ్మత్తులు చేయించమను.’ అన్నాడు ధనరాజ్.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘మనసుంటే మార్గం ఉంటుంది. ఆలోచించు. నీ దగ్గర డబ్బు లేకపోవడమేమిటి?’
- అవిగో! అక్కడున్నాయిగా!! …..సాయి@366 జూన్ 25…Audio
- వారి రెండు జన్మలకూ ప్రత్యక్షసాక్షిగా నేను శివాలయాన్ని అంటిపెట్టుకునే ఉన్నాను.
- బాబా నిర్ణయించిన మొత్తమే ముట్టింది(దీక్షిత్, లక్ష్మణ్ భట్)–Audio
- కాకా దీక్షిత్, లక్ష్మణ్ భట్–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నగలు అమ్మి, వచ్చిన డబ్బుతో శివాలయం మరమ్మత్తులు చేయిస్తుందా?”
kishore Babu
January 22, 2017 at 6:48 pmSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba
http://saileelas.com/m/sounds/view/Sai-Devotee-4