అవిగో! అక్కడున్నాయిగా!! …..సాయి@366 జూన్ 25…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


విజయకృష్ణ గోస్వామి ప్రభు అద్వైతాచార్యుని వంశంలోని వాడు. నామదేవుడు పాండురంగనితో చనువుగా ఉన్నట్లు, విజయకృష్ణ గోస్వామి శ్యామసుందరునితో చనువుగా ఉండేవాడు.

ఒకసారి విజయకృష్ణ గోస్వామి కలకత్తాలో ఉంటున్నప్పుడు శ్యామసుందరుడు స్వప్నంలో సాక్షాత్కరించి ”నీవు నన్ను బంగారు నగలతో అలంకరించు” అని అడిగాడు.

విజయకృష్ణుడు ”నేను బంగారు నగలు చేయించేటంతతి ధనవంతుడిని కాను” అన్నాడు. ఆ సంగతి శ్యామసుందరునికి తెలియదా!

”సరే! నీవు నీ అత్త దగ్గరకు పోయి బంగారు నాణేలు తీసుకుని, నాకు నగలు చేయించు” అన్నాడు శ్యామసుందరుడు.

విజయకృష్ణ ”అత్త దగ్గర బంగారు నాణేలు ఉన్నాయో లేదో” అని సందేహం వెలిబుచ్చాడు.

ఆ నాణేలు ఫలానా చోట ఉన్నాయి అని ఆ ప్రదేశం కూడా చెప్పాడు. అడుగు ఆమె ఇస్తుంది. నగలు చేయించు అన్నాడు శ్యామసుందరుడు.

విజయకృష్ణ గోస్వామి అత్తను ”బంగారు నాణేలివ్వు, శ్యామసుందరునికి నగలు చేయిస్తాను” అనగా అత్త ”నా దగ్గర నాణేలు లేవు” అన్నది.

”లేకేమి. ఉన్నాయి. ఆ నాణేలు ఎక్కడ ఉన్నాయో శ్యామసుందరుడు చెప్పాడు అని ఆ రహస్య స్థలం చెప్పాడు”.

ఆమె ఆశ్చర్యపడింది. తరువాత ఆ నాణేలను విజయకృష్ణకు ఇచ్చింది. అతడు నగలు చేయించాడు దైవానికి.

1914 జూన్‌లో సాయి శరణానంద షిరిడీ నుండి తన ఇంటికి తిరిగి వెళుతూ, రాధాకృష్ణమాయి ఇంటిలో కొంత డబ్బును ఒక కంపాస్‌ పెట్టెలో పెట్టి ”సాయి సర్వాంతర్యామి అయితే ఈ డబ్బును తాను స్వీకరించాలి” అని అనుకున్నాడు.

ఆ సంగతి రాధాకృష్ణమాయికి కూడా చెప్పలేదు. సాయిబాబా ఆ డబ్బుని ఇవ్వమని రాధాకృష్ణమాయికి కబురు చేసాడు. తన వద్ద ఎటువంటి డబ్బు లేదని జవాబు పంపింది.

సాయి ఆ డబ్బు ఉన్న స్థలాన్ని చెప్పి మళ్ళీ కబురు పంపాడు. రాధాకృష్ణమాయి ఆ స్థలంలో చూడగా అక్కడ డబ్బులున్న కంపాస్‌ పెట్టె ఉన్నది.

ఆమె సాయి సర్వాంతర్యామిత్వానికి అబ్బురపడి, సాయి శరణానందకు ఈ వార్తను పంపింది.

ఆ వార్తను విన్న సాయి శరణానంద బాబా సర్వాంతర్యామిత్వాన్ని గ్రహించి సంతసించాడు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles