తిట్టినా వరమిచ్చు కరుణామయుడు శ్రీ సాయి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-93-1115-కరుణామయుడు శ్రీ సాయి 3:39

శ్రీమతి సుశీలా కురుక్షేత్ర అనే గృహిణి రాజస్తాన్ లోని కోటాలో సకుటుంబంగా జీవిస్తున్నారు.

ఆమెకు మొదట సాయిబాబా యందు ఏ మాత్రం విశ్వాసము లేదు.

ఒక వేసవి శెలవులకు ఆమె సోదరుని బిడ్డలు వచ్చి వారింట వున్నారు.

ఒక రోజు ఆ పిల్లలలో ఒక అమ్మాయికి చెందిన బంగారు చెవి కమ్మలను సుశీల ఎక్కడో పోగొట్టింది.

అందరు కలసి ఇల్లంతా గాలించారు గాని అవి ఎక్కడ కనిపించలేదు.

అప్పుడా అమ్మాయి శ్రీమతి సుశీల గారితో “సాయిబాబాని ప్రార్దించు దొరుకుతాయి” అన్నది.

ఆమె ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడటమే కాకుండా బాబాను నానా తిట్లూ తిట్టింది కూడా, చెవి కమ్మలు దొరకలేదు.

తర్వాత నవరాత్రి పండుగలోస్తున్నాయి ఒకనాడు ఆమెకు ఎంతో తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది ఏమి చేసిన ఆమెకు ఉపశాంతి కలుగలేదు.

కడుపులో తెరలు తెరలుగా నొప్పి ఎక్కువై మెలికలు తిరిగి పోతున్నది. ఇక దారిలేక ఆమెను దగ్గరలోని ఆస్పత్రిలో చేర్చవలసి వచ్చింది.

వైద్యులామెకు పరీక్ష చేసి ఆమెకు పెద్ద ఆపరేషన్ చేసి తీరాలన్నారు. కాని ఆమె మధుమేహ వ్యాధి(దయాబిటిస్) ఉన్నందువలన అలా చేయడమెంతో ప్రమాదకరం కూడా అయినా తప్పక ఆమెను ఆపరేషన్ థియేటరుకు తరలిస్తున్నారు.

ఇంతలో ఒక డాక్టరోచ్చాడు. ఆయనను అంతకుముందు ఆమె ఎన్నడు ఆస్పత్రిలో చూడలేదు.

అతడు వచ్చి చూచి ఆమెకు శస్త్రచికిత్స చేయవద్దని, వీలైనంతసేపు వేచియుండమని ఆదేశించాడు. వారు కొంత జాగుచేశారు.

ఆస్పత్రిలో చేరగానే ఆమెకు తన వంటిమీద నున్న నగలు తీసి ఇంటికి పంపివేయ్యమని ఒక నర్సు చెప్పింది.

ఆమె నగలు తీసి తన మేనల్లుడికిచ్చి, ఇంట్లో తన అత్తగారి కివ్వమన్నది.

అత్తగారు పనిమీద వుండి నగలను అక్కడ బల్లమీద పెట్టమని, తను తర్వాత వాటిని తీసి దాచిపెడతానని అన్నది.

అతడలానే చేశాడు. తర్వాత ఆమె నగలు తీసేటప్పుడు చూస్తే ఒక విలువైన ఉంగరం కన్పించలేదు.

అది అశుభమని తలచారు.

ఆ సుశీల గారి మేనల్లుడు సాయి భక్తుడు. తానూ తెచ్చిన ఉంగరం కన్పించనందుకు అతడు బాధపడి, అది దొరకాలని సాయిని ప్రార్ధిస్తూ గురువారమంతా ఉపవసించాడు.

నాటి సాయంత్రం తృటిలో సాయి అతనికి దర్శనమిచ్చి దొంగ ఎవరో తెల్పి, అతడు ఇంకేమేమి దొంగిలించాడో కూడా చెప్పారు.

అదే రోజు ఆస్పత్రిలో నున్న సుశీలకు స్వప్నంలో దర్శనమిచ్చారు. అమే అంతకుముందు ఎప్పుడు సాయి చిత్రపటమైన చూడకపోయిన, ఆయన బాబాయేనని ఆమెకు స్పురించింది.

త్వరలో ఆమె పరిస్థితి మెరుగైంది. ఆస్పత్రి నుండి విడుదలై ఆమె ఇల్లు చేరిన తరువాత ఒక స్నేహితురాలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సాయిపటం చూచి, తనకు దర్శనమిచ్చినది ఆయనేనని తెలుసుకున్నది.త్వరలో ఆమె స్వస్ఠురాలైంది.

శ్రీమతి సుశీలా,
కోటా, రాజస్తాన్.

సంపాదకీయం: సద్గురులీల (‘సాయి లీల’ హిందీ మాసపత్రిక సౌజన్యంతో)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles