Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-95-1116-గీస్తు కొట్టుకొనిపోవాల్సిందే 9:34
తేది. 19.3.2004న విద్యానగర్ లో మేము వుంటున్నఇంటికి(బాడుగ ఇల్లు) గృహ వాస్తు బాగా తెలిసిన వ్యక్తీ రావడం, అతను ఇల్లు అంతా కలయ చూసి,
ఈ ఇంటిద్వారానికి ఎదుగుగా బావి వున్నది కాన ఇందు నివశిం చేవారికి గృహవేధన ఎక్కువగా ఉంటుంది,
పైగా మీ పోర్షన్ ఉత్తరం వైపు వున్నా ఖాళీ జాగాలో వేరే వాళ్ళు క్రొత్తగా బిల్డింగ్ కట్టడం ప్రారంభించడం చూసి వాళ్ళు బిల్డింగ్ పూర్తిచేస్తే మీకు ఇంకా ఎక్కవగా కష్టాలు వుంటాయి కాన మీరు వీలైనంత తొందరగా అంటే 10 నుండి 15 రోజులలోపు వేరే ఇంట్లోకి మారడం మంచిది.
అంతేకాని ఈ ఇంట్లో వుంటే చాలా అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయి అని చాలా గట్టిగా చెప్పి వెళ్ళాడు.
మేము ఆలోచనలో పడ్డాము. ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు అంటే దొరకడం చాలా కష్టం, పైగా ఇప్పడున్న ఇల్లు మాదగ్గరి బంధువుది.
మనం ఏదో వాస్తు దోషం వుంది అని చెప్పి వెళితే వాళ్ళు బాధపడతారు, వేరే ఎవ్వరైనా ఆ పోర్షన్ లో చేరడానికి భయపడవచ్చు.
అందుకని మేము 1, 2 రోజులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాము.
మనం సాయిబాబాని నమ్ముకొని ఉన్నాం, ఈ సమస్య కూడా అయన పాదాల వద్దే పెడితే ఆయనే ఆదుకుంటారు
అని 22వ తేదీ విద్యానగర్ బాబా మందిరంలో ఉదయం అయన ముందు నిలబడి “బాబా మేము అత్యవసరంగా వున్నవసతి గృహం మార్చడం మంచిది లేకపోతె అనుహ్యపరిణామాలు జరగుతాయని,
బాధలు ఎక్కువ అవుతాయని సిద్దాంతి చెప్పి వెళ్ళాడు. మేము ఏం నిర్ణయము తీసుకోలేము.
మేము ఒకవేళ ఇల్లు మారడం మంచిదే అని మీరూ అనుకుంటే మాకు అనువైన, దోషరహితమైన మేము అద్దె భరించగల స్థాయిలో వున్న గృహాన్ని మీరే మాకు చూపించి అందులోకి మారమని చెప్పండి లేక ప్రస్తుతం వున్న గృహంలోనే వుండవచ్చు అని మీరు అనుకుంటే అదైనా మాకు చెప్పండి.
ఈ నిర్ణయం మీదే. మేము నడచుకొంటాము అని చెప్పుకోవడం జరిగింది.
తేది. 23.3.2004 మంగళవారం ఉదయం పనిమీద నేను వేరే ఊరు వెళ్ళవలసివుండి వెళ్ళాను.
ఇంట్లో నా భార్య ఒక్కటే వున్నది. షుమారు ఉదయం 11.30 ల ప్రాంతంలో మా ఇంటికి ఎదురుగా ఉన్న వీధిలో కాస్త దూరంగా ఎవరో 4 లేక 5 మంది కాషాయవస్త్రాలు ధరించి ఇంటింటికి బిక్షమెత్తడం నా భార్య చూచి వీళ్ళు మన ఇంటికి కూడా వస్తారేమో నాదగ్గర డబ్బులు లేవు,
బియ్యం బిక్షగా ఇస్తే తిసుకోరేమో, పైగా మా అయన కుడా ఇంట్లో లేరే అని తలుపులు వేసేస్తే వాళ్ళు వచ్చి తలుపు వేసివుందిలే అనుకోని వెళ్ళిపోతారు అనుకోని ముందు వరండాకి వున్న గ్రిల్ మూసివేసి లోపల వున్న సింహద్వారం తలుపు వెయబొతూ వుండగా...సాయిరాం…సాయిరాం..సాయిరాం.
అని పెద్దగా నామాన్ని ఉచ్చరిస్తూ కంపొండ్ గేటు వద్ద నుంచి వస్తున్న శబ్దాన్ని విని ఠక్కున వేయబోయిన తలుపు తీసి బయటకు చూచి ఎవరో గొప్ప సాధువులా వుండడం చూసి రండి స్వామీ…అని లోపలి పిలిచింది
అయన పూర్తిగా తెల్లటి సిల్కు పంచ, కాషాయజుబ్బా, మెడనిండా రుద్రాక్షలు ఆ రుద్రాక్షల మద్య అక్కడక్కడా బాబా ఫోటో డాలర్స్ తలకు కాషాయ కప్నీ, కాళ్ళకు ముందు వంపుతిరిగి వుండే బూటు ధరించి చాల శోభాయమానంగా వుండడం,
ఆ స్వామిని చూడగానే ఆమె మనస్సు శాంతించినట్లు కావడం, ఆ స్వామిని కూర్చోమని కుర్చీ చూపించిన, కూర్చోక నిలబడే అక్కడ సింహద్వారం పైన తగిలించివున్న
బాబా ఫోటో వైపు చూస్తూ “తల్లి! ఈ ఇంటిమీద బాబా అనుగ్రహం పూర్తిగా వుంది. మీరు ఎట్టి పరిస్థితులలోనూ ఈ గృహం మారవలసిన అవసరం లేదు.
త్వరలో మీ కోరిక తీరి మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. అమెరికాలాంటి ఇతరదేశాలకు పోతాడు. మీరు ఆర్దికంగా పటిష్టమైన స్థితికి వస్తారు.
మీరు ఇంట్లో సాయి సత్యవత్రం చేయించుకోండి అన్ని అవే సర్దుకుంటాయి అని చెప్పి నా భార్యను దీవించి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వమని తీసుకొని కొద్దిగా త్రాగి తిరిగి ఆమెకు ఇవ్వడం వాటిని నా భార్య అక్కడే త్రాగడం జరిగినది.
స్వామి, తల్లి! నేను ‘దత్తఘాట్'(మహారాష్ట) నుంచి వస్తున్నాను శ్రీ పండరీపురంలో శ్రీ పంచవతి గంగ, శ్రీ శిరిడి సాయిబాబా బీదవారి అన్నదాన సంస్థ నుంచి వచ్చాను.
కాన మీరు పై సంస్థకు అన్నదానానికి ఏదైనా డబ్బు ఇస్తే మంచిది అనికోరాడు. ఈమె వద్ద డబ్బులు లేక కేవలం ఒక్క రూపాయి మాత్రమే వుండటం ఏమిచేయాలో ఆలోచించుకునే పరిస్తితులో లేచి ఆమె ఆ ఒక రూపాయను తీసుకుపోయి ఆ స్వామికి ఇచ్చింది.
ఆయన దాన్ని తీసుకోని తల్లి! ఏదైనా పెద్ద మొత్తం ఇస్తే మంచిది అని తిరిగి అడగతంతో నా భార్య స్వామి! ఇంట్లో మావారు లేరు,
నావద్ద ఇక డబ్బులు లేవు పోనీ ప్రక్క ఇంట్లో అడిగి చేబదులు తీసుకోని అయినా రూ.100/-లు ఇస్తాను కొంచెం కూర్చోండి అని చెప్పింది,
అందుకు ఆ స్వామి నవ్వుతూ ప్రక్క ఇంట్లో అడగక్కరలేదు
తల్లి నీ దగ్గరనే పర్సులో నీ డబ్బు వుంది, అవి తెచ్చి ఇవ్వు చాలు, అంతకు 10 రెట్లు బాబా నీకు లాభం కలిగేలా చేస్తాడు అని అడగటం అప్పటి వరకు తన పర్సులో డబ్బులున్న సంగతి గుర్తుకురాని ఆమె వెంటనే గుర్తుకుతెచ్చుకొని సంతోషంగా తనవద్దవున్న రూ.300/-లు ఆ స్వామికి ఇచ్చి పాదనమస్కారం చేసుకోవడం ఆ స్వామి ఆశీర్వదించి 11-00లు తిరిగి నా భార్యకు ఇచ్చి తల్లి! వీటిని ఎత్తిపరిస్తితుల్లొనూ ఖర్చుపెట్టవద్దు.
వీటిని భద్రముగా మీరు డబ్బులు వుంచుకునే పెట్టెలో వుంచండి.
ఇంకా మీ ఇంట్లో డబ్బుకు ఇబ్బందిపడవలసిన పరిష్తితి వుండదు అని చెప్పి తన అడ్రసుతో కూడుకున్న రశీదు ఇచ్చివెళ్ళాడు.
ఈమే నిర్ఘాంతపోతూ గేట్ కాంపౌండ్ దాటేదాకా చూచి ఆ తరువాత తేరుకొని వెళ్ళి బయట చుస్తే ఆ స్వామి ఇక ఆవిధులొఎక్కడ కనిపించలేదు.
అంతకుమునుపు కనిపించినా వారి శిష్యులు 4-5 మందికూడా ఎక్కడా కనిపించలేదు. ప్రక్క ఇళ్ళవాళ్లని విచారిస్తే అలాంటి దుస్తులు ధరించిన వారెవ్వరూ రాలేదని చెప్పారు.
మా ఇంటికి మాత్రమె వచ్చి భిక్ష స్వీకరించి ప్రక్క ఇంటికి కూడా పోకుండా కాంపౌండు గేట్ దాటిన తరువాత ఇక కనిపించకుండా పోవడం అంతా లీలగానే వుండిపోయింది ఆ తరువాత అనుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒక స్నేహితుని ద్వారా 9వేలు కమిషన్ రావడం, సాయిబాబా సత్యవ్రతం చేయించుకోవడం,
ఆబ్బాయికీ ఉద్యోగం రావడం మా ఆర్దిక పరిస్థితులన్నీ చక్కబడటం, ఆబ్బాయి ప్రస్తుతం ఇటలీలో ఉద్యోగం చేస్తూ వుండడం సిద్దాంతి చెప్పిన చేడు మాకు ఆ గృహంలో జరగకపోగా అంతా మంచే జరగడం, ఇదంతా బాబా వారి ఆశిర్వాదబలంగాక ఇక ఏమిటి?
“నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించుటే నా కర్తవ్యం
“నా సహాయమునుగాని, సలహానికాని కోరినచో తక్షణమే ఒసంగెదను” అన్న బాబా సూక్తులకు ఇంతకంటే నిదర్శనం ఇంకేంకావాలి?
ఆనాడు భౌతిక శరీరంతో ఇలాంటి లీలలను ఎన్నో చూపి తన భక్తులను ఆదుకున్న బాబా వారు, ఈనాడు కూడా తన సమాధినుంచే అంతకంటే ఎక్కువగా తన భక్తులను కాపాడుతున్నాడు.
మనలనుంచి ఆయన ఆశించే ప్రతిఫలం “నిష్ఠ సబూరి” అనే రెండు పైసలు మాత్రమె. అవి ఆయనకు అర్పించి, అయన పాదాలు ఆశ్రయమిస్తే మన బాద్యతలన్ని ఆయన నెరవేరుస్తాడు.
మీ గురుబంధువు
డి. రమణారెడ్డి,
విద్యానగర్, నెల్లూరు జిల్లా.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఇంట్లో ఉన్న వాస్తు దోషాన్ని, ఆంజనేయస్వామి చేత తీసివేయించిన బాబా వారు
- సద్గురు కృప – పునర్జన్మ. టి భాస్కర్ శిరిడీ–Audio
- వినాయక చవితి నాడు బాబా ఫోటో రూపంలో భక్తురాలి ఇంటికి వచ్చుట…Audio
- కోయవానిరూపమున దర్శనమిచ్చిన బాబా–Audio
- దారి చూపిన దీన బాoధవుడు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments