Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-94-1116-సెలెక్ట్ అయిన ఐదు మంది 9:38
సద్గురు సాయినాధులవారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ వారు ప్రసాదించిన కృప సౌరభాలను గురుబంధువులతో సద్గురులీల ద్వార పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా వుంది.
వారు ప్రసాదించిన కృపను మా కుటుంబము జీవితాంతము మరువలేము.
వారు ప్రసాదించిన అనుగ్రహము తలచుకోనప్పుడల్లా కళ్ళ నుండి ఆనందాశ్రువులు జలజల జాలువరుతాయి.
నా పేరు యస్. శ్రీనివాసులు, మా సొంతవూరు అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలంలోని అప్పరాశ్చేరువు గ్రామము.
1979 సంవత్సరంలో ఉద్యొగము కొరకు హైదరాబాదు పోవలసివచ్చింది.
నా దగ్గర చార్జిలకి కూడా డబ్బులేని పరిస్థితి. ఒక పోలీసు వ్యాను హైదరాబాదు పోతుంటే అందులో ఒక కానిస్టేబులుకి నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి వివరించాను.
వారు నన్ను హైదరాబాదుకి తీసుకోని పోయినారు.
మనోరమ ప్రైవెట్ ఐటిఐలో ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగము కూడా నేలవరకే వుండినది.
తరువాత మకరంజా ఐటీఐలో 79 నుండి 88 సంవత్సరములవరకు ఇనస్ట్రక్టర్ గా పనిచేశాను.
1985 సం”లో నా భార్య శ్రీ సాయిసచ్చరిత్ర ఒక్క రోజులో పారాయణం చేయడం మొదలు పెట్టింది.
ఉదయం 11 గం”ల నుండి రాత్రి 8 గం”లవరకు చేసేది. నేను రాత్రి ఇంటికి వచ్చిన తరువాత మిగతా చేసేవాడిని.
నాలుగుచోట్ల పని చేస్తేకుడా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది.
రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థిత్లులొ బ్రతుకుజీవనము 91వ సంవత్సరము వరకు జరిగింది.
91 సం” లో దిల్ షుక్ నగర్ లోని శ్రీనివాసా ఐటిఐలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నప్పుడు ” బాబా వారి సాక్షాత్కారము” లభించింది.
ఆ అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. దిల్ షుక్ నగర్ శ్రీనివాసా ఐటిఐ 4వ అంతస్తులో నేను అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసుకొంటుండగా ఒక సాధువు కాషాయ బట్టలు ధరించి ఉన్నారు.
గడ్డము బాగా పెరిగి వుంది. నేను వున్నరూము వద్ద వచ్చి నిలబడి వున్నారు.
నేను ఆయనను చూడగానే లేచి అయన దగ్గరకు వెళ్ళి నమస్కారము స్వామి ఏమి ఇట్లా వచ్చినారు అని అడిగాను.
నాకు ఒక మెరుపు మెరిసింది. అందువల్ల ఇక్కడకు వచ్చాను.
ఇక నువ్వు హైదరాబాదులో ముడునేలలు మాత్రమె వుంటావు. నాల్జవ నెలలో నీకు ఒక పుణ్యక్షేత్రంలో ఉద్యోగము వస్తుంది అన్నారు.
నేను వెంటనే నా వయస్సు 40 సంవత్సరములు. నాకు ఇప్పుడు ఏ ఉద్యోగము రాదు స్వామీ అన్నాను.
ఒక తెల్ల కాగితము ఇవ్వు అన్నారు. నేను ఒక తెల్ల కాగితము ఇవ్వబోతే నేను చెప్పిన అక్షరాలు ఆ పేపరు మీద వ్రాయి అన్నారు. “ఓం హ్రీం శ్రీం” అని వ్రాయమన్నారు వ్రాశాను. పసుపు కుంకుమ తెమ్మన్నారు.
పసుపు, కుంకమతో ఆ కాగితాన్ని పూజించి ఈ కాగితము నీదగ్గర పెట్టుకో అన్నారు.
నీకు ఉద్యోగము వచ్చిన తరువాత ఒక యోగిశ్వరుడు చెప్పినాడు అనుకో అన్నారు. మానవ దేవత నీకు అభయం ఇచ్చింది అన్నారు.
నేను వారికి 51 రూపాయలు దక్షిణ ఇవ్వబోయాను. వారు తీసుకోలేదు.
టీ మాత్రము త్రాగారు. నేను నీ మేలు కోసమే ఇక్కడకు వచ్చాను. అని ఆశీర్వదించి గబగబా 4వ అంతస్తు నుండి మెట్లుదిగేదానికి మెట్లలోకి వెళ్ళిపోయినారు.
నేను గబగబా వారి ననుసరించాను. వారు అంతర్డానమయ్యారు.
బిల్డింగ్ క్రిందకి వచ్చి అక్కడ వారిని విచారిస్తే మేము ఏ సాధువును చూడలేదన్నారు.
కనుచూపు మేరలో ఎక్కడా సాధువు గారి ఆచూకి కనపడలేదు.
సాదువు చెప్పివెళ్ళిన 2 నెలలకి శిరిడి సాయిబాబా సంస్తాన్ కి సంబంధించిన ఐటిఐలో ఉద్యోగ ప్రకటనను దక్కన్ క్రానికల్ లో నా సహద్యోగులు చూసి ఎంతకాలమని ఈ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తారుసార్ మీరు ధరఖాస్తు చేయండి అనివారు అన్నారు.
మామూలుగా ఉద్యోగ ప్రకటన మరాఠి పత్రికల్లోనే ప్రచురిస్తారు. నా కోసమే బాబా ఇలా ఏర్పాటు చేశారనుకొన్నాను.
ఈ ఉద్యోగ ప్రకటన తప్పితే ఇప్పటి వరకు ఏ ఉద్యోగ ప్రకటన ఇంగ్లీష్ పేపరులో ప్రకటించలేదు.
లోకల్ వాళ్ళకు 3 రోజుల ముందు, ఇతర రాష్ట్రాలలో వున్న నాకు 15 రోజుల ముందు కాల్ లేటర్సు పంపారని తెలుసుకొన్నాను.
నా ట్రేడ్ కి సంబంధించి 31 మంది వున్నారు. వుండే ఉద్యోగం ఒక్కటే.
ఇంటర్వ్యూ కి పోయేదానికి నా దగ్గర పైసలు లేవు. అప్పుచేసి పోవడము నాకు ఇష్టం లేదు.
ఆ సమయంలో మా మామగారు మా ఇంటికి వచ్చి రూ.3000/- లు ఇచ్చారు.
బాబానే ఆయన రూపంలో వచ్చి పైసలు ఇచ్చినట్లనిపించింది. నా భార్య అయితే ఉద్యోగము ఏమి వస్తుందో ఏమో బాబాని అన్నా దర్శించుకొని వస్తాము పదండి అనింది.
అప్పుడు హైదరాబాదు నుండి శిరిడికి ఒక్కటే బస్సు వుండేది. నేను నా భార్య శిరిడి బయలుదేరాము.
ఇంటర్వ్యూ ఉదయం 9-30 అయితే 11.30కి బస్సు శిరిడి చేరింది. గబగబా ఇంటర్వ్యూ జరిపే “సాయి ఉద్యాన్” కి పోయేటప్పటికి 30 మంది ఇంటర్వ్యూ హాలులో కుర్చోనివున్నారు.
నాతొ కలిపి 31 మంది అవుతారు. ఇంటర్వ్యూ మొదలయ్యి వుంటుందని ఎంతో కంగారు పడ్డాను.
అక్కడ ఇంటర్వ్యూ కోసం వేచి వున్నవారిని ఇంటర్వ్యూమొదలయ్యిందా అని అడిగాను. ఏమో అనివార్య కారణములవల్ల ఇంటర్వ్యూ రెండు గంటలు లేటు అని చెప్పారు.
ఉదయం 9-30 ఇంటర్వ్యూ మొదలయ్యి వుంటే ఇంటర్వ్యూ లిస్టులో మొదటి పేరు నాదే కాబట్టి ఇంటర్వ్యూ కోల్పోయేవాడిని.
కానీ బాబా అడుగడుగునా కంటికి రెప్పలా కాపాడుతూనే వున్నారు.
31 మందిలో 5 మందిని సెలెక్ట్ చేసుకొని మిగతా 26 మందిని పంపించివేశారు.
సెలెక్ట్ అయిన ఐదు మందిలో కూడా మొదటి మెరిట్ నాదే కావడం బాబా వారి కృప కటాక్షమే.
కానీ మరలా ఇంకొక సమస్య ఎదురైనది. ఆ సమస్య ఏందంటే నాకు ఉద్యోగానికి వయోపరిమితి దాటి పోయినది అని ఇంటర్వ్యూ పెద్దలు అన్నారు.
మరల ఇక్కడ బాబా వారి కృపకటాక్షం వల్ల ఇంటర్వ్యూ పెద్దలు గవర్నమెంట్ కి రాసి స్పెషల్ పర్మిషన్ తెప్పిస్తామన్నారు.
అలాగే తెప్పించారు కూడా, 5 మంది లో నన్ను సెలెక్ట్ చేసుకొని మిగతా వారిని పంపించివేశారు.
ఆసమయంలో బాబా వారు ప్రసాదించిన అనుగ్రహానికి నన్ను టీచింగ్ క్లాస్ తీసుకోమన్నారు.
మాములుగా అయితే సబ్జెక్టు వాళ్ళు చెబితే మనం టీచింగ్ చేయాలి.ఏదో ఒకటి మీరే సెలెక్ట్ చేసుకొని టీచింగ్ చేయమన్నారు.
ఇది కూడా బాబా అనుగ్రహమే. నేను టి. వి . రేడియో గురించి టీచింగ్ చేసినాను. నా టీచింగ్ వాళ్ళకు ఎంతో నచ్చినది.
నన్ను సెలెక్ట్ చేసుకోవడం బాబా వారి అనుగ్రహమే.బాబా అనుగ్రహముతో 10-8-94లొ “సాయిబాబా వారి సంస్థాన్ వారి అద్వర్యంలో నిర్వహించుచున్న ఐటిఐ ఇనస్ట్రక్టర్ గా జాయిన్ అవడం జరిగింది.
2001 సం'” నుడి ఐ.టి.యస్ ఇ.యస్.యం. లో ఇనస్ట్రక్టర్ గా జాయిన్ అయ్యాను.
హైదరాబాదు శ్రీనివాసా ఐ.టి.ఐలో 4వ అంతస్తులో నాదగ్గరకు వచ్చి మూడు నెలల్లో నీకు పుణ్యక్షేత్రంలో ఉద్యోగము వస్తుంది అని చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ సాయిబాబా వారని నాకు అనుభవమైంది.
నాకు ఒక అమ్మాయి పేరు దెవరాణి, ఒక అబ్బాయి పేరు పవన్ వున్నారు. 94వ సంవత్సరంలో నా అక్క కొడుకుకే ఇచ్చి వివాహం చేయడం జరిగింది.
అనంతపురంలో మా అల్లుడికి ఉద్యోగము పోయింది. పుట్టపర్తిలో ఐదారు నెలలు పనిచేశారు.
అక్కడ వాళ్ళు జీతము సక్రమముగా ఇచ్చేవారు కాదు. చాల కష్టంగా వుండేది.
మరలా “బాబా” కుండపోత అనుగ్రహమువల్ల నా కూతురికి సాయిబాబా వారి సంస్థాన్ లో సెక్యూరిటీగా ఉద్యోగము దొరికింది.
97 నుండి 2002 వరకు సెక్యూరిటీ ఉద్యోగము చేసింది. మరల బాబా వారి అనుగ్రహకటాక్షములతో, విద్యార్హతలను బట్టి సంస్థాన్ ఇ.ఓ క్లర్క్ గా నియమించారు.
యస్ శ్రీనివాసులు ,
మేనేజర్, ద్వారకామాయి భవన్, శిరిడి
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సద్గురుకృప – శిరిడి నివాసం !—Audio
- ఇంటర్వ్యూ లేకుండానే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా అపాయింట్ మెంట్ ఇప్పించిన బాబా గారి లీల…Audio
- ఉద్యోగం తో నువ్వు నా దర్శనానికి రావాలి అనుకున్నాడు కాబోలు అప్పుడు నాకు దర్శన భాగ్యం ప్రసాదించాడు
- తేలుకాటు
- నా కంట బడటానికి నా జీవితం మారిపోటానికి బాబాయే చేసిన మిరాకిల్ ఆ ప్రకటన ఆ పేపర్ లో పడటం.–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments