నా కంట బడటానికి నా జీవితం మారిపోటానికి బాబాయే చేసిన మిరాకిల్ ఆ ప్రకటన ఆ పేపర్ లో పడటం.–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio prepared by Mr Sreenivas Murthy


ఎక్కడికి వెడతాను. నాకు ఇంక గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేదు.

అప్పటికి నా వయసు 38  సంవత్సరాలు. అసలైతే నాకు గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చేదే కానీ ఇంటర్వ్యూ ల సమయం లో మా నాన్నగారు పోవటంతో ఆ ఉద్యోగం రాలేదు.

ఇప్పుడు నేను ఇంత పెట్టుబడులు పెట్టి సొంతగా ఇన్సిట్యూట్ చేసుకొనే సమయం లో నేను వేరే వెళ్లిపోతానని ఈ పెద్దమనిషి చెబుతాడేంటి? అని నేను ఇది జరిగేది కాదు అనుకోని పెద్దగా పట్టించుకోవటం మానేసాను .

ఇది జరిగిన సరిగ్గా 15 రోజుల లో శిరిడీ సంస్థానం నుండి ఒక ITI  కాలేజీ లో ఒక పోస్ట్ వుంది అని, క్రానికల్ పేపర్ లో పడింది.

అసలు శిరిడీ సంస్థానం నుండి యాడ్స్ పడాలంటే మహారాష్ట్ర పేపర్ లోనే వేస్తారు. అది దాటి వేరే పేపర్స్ లో వెయ్యరు.

అదేమిటో మరి నా కంట బడటానికి నా జీవితం మారిపోటానికి బాబాయే చేసిన మిరాకిల్ ఆ ప్రకటన ఆ పేపర్ లో పడటం.

నేను పని చేస్తున్న శంకర మఠం దగ్గర ITI లోనే నాతొ పాటు కొంతమంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా పనిచేస్తున్నారు.

వాళ్ళు ఆ సంస్థానం ప్రకటన ఎదో టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో చూసారు.

నాకు చూపించి అప్లై చేయమన్నారు. ఇప్పుడు నేను అప్లై చేయటం అనవసరం, ఎందుకంటే నా వయసు సరిపోదు.

పైగా ఎక్కడో మహారాష్ట్ర లో ఒక్కటే పోస్ట్ వుంది. వాళ్ళ వాళ్ళని వదిలేసి ఒక తెలుగు వాడికి ఆ ఉద్యోగం రాదు రానివ్వరు. పైగా నాకిక్కడ బోలెడు పనులున్నాయి.

నేను పెట్టుకున్న ఇన్సిట్యూట్ ను, పెట్టుబడులను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. నాకా ఉద్యోగం వద్దు. ఏమి వద్దు అన్నాను.

వాళ్ళల్లో ఒకతను మరీ పట్టుబట్టాడు. సార్ అప్లికేషను నేను తీసుకు వస్తాను. మీరు ఫిల్ చేయండి చాలు అని నా చేత సంతకం చేయించి తానే అప్లికేషను ఫిలప్ చేసి నా సర్టిఫికెట్స్ తానే జిరాక్స్ తీయించి తానే పోస్ట్ చేసాడు.

నాకసలు ఇష్టం లేదు. రాదు అని కూడా గట్టి నమ్మకం. ఇంటర్వ్యూ కి రమ్మంటూ 15 రోజుల లో లెటర్ వచ్చింది.

నా దగ్గర డబ్బులు లేవు. నాకు వెళ్ళాలన్న కోరిక లేదు. అప్పు చేసి వెళ్ళచ్చు కానీ రాని ఉద్యోగం ఎందుకని ఊరుకున్నాను.

ఆ సమయంలో మా మామ గారు ఆయనకి నలుగురు కూతుళ్ళు అబ్బాయిలు లేరు. ఆయన కూతుళ్ళందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు.

ఒక్కళ్ళకి ఏదిస్తే అందరికి అది ఇస్తాడు. ఒక కూతురికి ఎదో అవసరం కొద్దీ 3000 రూపాయలు ఇచ్చారుట ఎవరితోనో పంపించారు.

అది అందగానే మా ఆవిడ నాకు ఫోన్ చేసింది , డబ్బు చేతికందింది. మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

మీతో పాటు నేను వస్తాను. అటు ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్లు వుంటుంది. ఇటు బాబా దర్శనం చేసుకున్నట్లు వుంటుంది అంది.

చాలా సేపు తర్జనబర్జనల తర్వాత మా పిల్లల్ని మా ఇంటి ఓనర్స్ దగ్గర పెట్టి మేము శిరిడీ కి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాము.

The above telugu TEXT typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles