బాబాయే నా సర్వస్వం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబాయే నా సర్వస్వం

ఈ రోజు బెంగుళూరు నించి విజయారావు గారు బాబాతో తమ అనుబంధాన్ని తెలియచేస్తూ మెయిల్ పంపించారు. ఇందులో ఆమెకు బాబా మీద ఉన్న అపరిమితమైన భక్తి, శ్రధ్ధ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏ జన్మలోనో ఆయనతో ఉన్న అనుబంధంతోనే మనము ఆయనకు దగ్గరవుతాము, ఆయన మనలని తనకు దగ్గరగా చేసుకుంటారు.

విజయగారు పంపించిన తన అనుభవాన్ని ఆమె మాటలలోనే …

నాకు బాబా గురించి చిన్నప్పటి నుంచీ తెలియదు. నేను మచిలీపట్నంలో పీ.జీ. చదువుతున్నప్పుడు మా రూంమేట్ ద్వారా నాకు బాబా పరిచయం అయింది. ఎం.సీ.ఎ. మొదటి సెమిస్టర్ పరీక్షలు నేను సరిగా రాయలేదు.

నేను ఫెయిల్ అవుతానేమోనని చాలా టెన్షన్ గా వుంది. పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఒక సబ్జెక్ట్ 2 మార్కులతో పోయింది. నేను బాబాని ప్రార్థించాను. రీకౌంటింగ్ కి పెట్టాను. నేను ఊహించని విధంగా మార్కులు వచ్చాయి. నేను సబ్జెక్ట్ పాస్ అయ్యాను. 70 పైన పెర్సెంటేజ్ వచ్చింది.

బాబా రోజూ నా కలలో కనిపించేవారు. నా చేత పూజ చేయించుకునేవారు. నాకు అర్ధం అయ్యేది కాదు. నేను బాబాకి పూజ చేయడం ఏమిటి అని అంతగా ఆ కలని పట్టించుకునేదాన్ని కాదు. కాని ఆ కల తొందరలో నిజం అవుతుందని నాకు తెలియదు, బాబాకి మాత్రమే తెలుసు…

నా చదువు పూర్తి అయింది. నేను ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్ళిపోయాను. బాబాని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు, మనం ఎక్కడ ఉన్నా ఆయన మనలని తన దగ్గరికి లాక్కుంటారు. అలాగే నేను కూడా. నేను ఉన్న హాస్టల్ లో బాబా పూజా గది వుంది. కొన్ని రోజుల వరకు నేను పట్టించుకోలేదు.

బాబా నా మనసుని ఆయన వైపు లాక్కున్నారు. ఇంక రోజూ బాబాకి పూజలు చేయడం మొదలు పెట్టాను. కొన్నాళ్ళకి అందులో పూర్తిగా ఎలా మునిగిపోయానంటే ప్రతీ రోజూ 4 ఆరతులు ఇచ్చేదానిని.

ప్రొద్దున్నే కాకడ ఆరతి ఇచ్చి అభిషేకం చేసేదానిని. మధ్యాహ్న ఆరతి ఇచ్చి భోజనం పెట్టేదానిని. సాయంత్రము, రాత్రి కూడా ఆరతి ఇచ్చి పడుకోబెట్టి, నేను వెళ్ళి పడుకునేదానిని.

బాబాకి నాకు మధ్య చాలా గట్టి అనుబంధం ఏర్పడింది. నాకు బాబా మీద ఎంత ప్రేమతో కూడిన భక్తి భావం పెరిగిందంటే, ఒక్కరోజు కూడ బాబాను విడిచి వుండలేను అన్నంతగా వుండేది. ఉద్యోగ ప్రయత్నాలు మానేసాను. కేవలం బాబా సేవలోనే గడిపాను.

ఎంతోమంది ఉద్యోగం చేయమని చెప్పినా కూడా నేను వినేదాన్ని కాదు. బాబాకి ఆరతులు ఇవ్వాలి, అందుకనే నేను ఉద్యోగం చేయను అనేదాన్ని. నాకు ఆఫీసు ప్రొద్దున 10 నించి సాయంత్రం 5 వరకూ వుంటేనే జాబ్ లో జాయిన్ అవుతాను, లేదంటే నేను జాయిన్ అవను అని చెప్పేదాన్ని.

కాని గవర్నమెంట్ జాబ్ తప్ప ఆ టైమింగ్స్ లో ఏ కంపెనీ వాళ్ళూ పంపించరు. అందరూ నన్ను నిందించేవాళ్ళే. ఇంటర్వ్యూకి వెడితేనే ఎవరైనా ఇస్తారు, ఎప్పుడూ పూజలు చేస్తూ అందులోనే మునిగిపోతే మన దగ్గరికి ఉద్యోగాలు రావు అని తిట్టేవాళ్ళు.

కాని వాళ్ళకి నేను ఒకటే చెప్పేదాన్ని బాబాయే నాకు ఉద్యోగాన్ని నా దగ్గరికి తీసుకువస్తారు చూడండి అన్నాను. ఒకరోజు మా ఫ్రెండ్ ఒక కంపెనీ పేరు చెప్పి వాళ్ళకి నా ప్రొఫైల్ పంపించమని చెప్పింది. నేను అలాగే కంపెనీకి నా ప్రొఫైల్ పంపించాను.

కంపెనీ వాళ్ళు ఫోన్ లోనే యింటర్వ్యూ చేసారు. మరుసటి రోజు వాళ్ళు నాకు కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు, వచ్చి జాయిన్ అవండి అని చెప్పారు. అప్పుడు అనిపించింది, బాబానే నాకు ఈ జాబ్ ఇప్పించారు అని.

కాని నేను జాబ్ లో జాయిన్ అవలేదు. అప్పటికే నాకు బాబాని విడిచి వుండలేని పరిస్థితి. బాబా సేవ తప్ప ఇంక ఏవీ ఎక్కువ కాదు అనుకున్నాను . రెండు కంపెనీలలో వచ్చాయి గాని నేను వెళ్ళలేదు.

ఎక్కడ బాబా భజన జరిగినా నేను వెళ్ళేదానిని. పుష్పాలంటే బాబాకి ఇష్టం అని ఎక్కువగా పూలను తెప్పించి బాబా గదంతా పూలతో అలంకరించేదానిని. బాబాకి దీపాలను వెలిగించడం అంటే ఇష్టం అని గది అంతా దీపాలు వెలిగించేదానిని. ప్రతి గురువారము ఇలాగే చేసేదానిని.

ఒకరోజు కనకదుర్గ అమ్మవారు నా కలలో కనిపించి, “నువ్వు ఎందుకు ఉద్యోగం చేయడంలేదు? బాబా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎప్పుడూ నీతోనే వుంటారు. నువ్వు పిలవగానే వస్తార”ని చెప్పింది.

నేను మనసులో అనుకున్నాను, ‘తలుచుకోగానే బాబా ఎందుకు వస్తారు?’ అని వెనుకకు తిరిగాను. బాబా డాన్స్ చేస్తూ వచ్చేసారు. నిజంగా చాలా సంతోషం పొందాను.

మాది మధ్యతరగతి కుటుంబం. నా తల్లితండ్రులు నన్ను కష్టపడి చదివించారు. నా అన్నయ్య మెంటల్లీ రిటార్టెడ్ పెర్సన్. ఒకరోజు తను ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు. మెంటల్లీ రిటార్టెడ్ పెర్సన్స్ వాళ్ళకి ఏమి తెలియదు. చిన్నపిల్లలకంటే కూడా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు.

ఇంటిలో అమ్మావాళ్ళూ అన్నిచోట్లా వెతికారు, చాలా బాధపడ్డారు. రాత్రి అంతా బాధపడుతూనే వున్నారు. ప్రొద్దున్న మా అమ్మగారు బస్ స్టాండులో వెతుకుతూ బాబాకి మొక్కుకున్నారు, మా అన్నయ్య దొరికితే షిరిడీకి వస్తామని. అనుకున్న వెంటనే బస్ స్టాండ్ లో కనిపించాడు. మేము అందరమూ చాలా సంతోషించాము.

ఇదంతా బాబా లీల అని అనుకున్నాము. బాబాయే కరుణ చూపకపోతే మా అన్నయ్య మాకు దక్కేవాడు కాదు. అంతేకాకుండా, అప్పటి నుంచి అన్నయ్య ఎవరి తోడూ లేకుండా ఒక్కడే బయటకి వెళ్ళడం మానేసాడు. ఇంత మార్పు తీసుకువచ్చింది బాబానే……బాబాకి ఎంతో ఋణపడివున్నాము….

విజయ

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles