‘‘గురువుని మించిన దైవం లేడు.”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

సద్గతిని ఆశించేవారంతా సద్గురువును ఆశ్రయించాలి. సద్గతికి సద్గురువే మార్గదర్శి అంటారు బాబా.

అలా అని తాను సద్గురువునని, తనని పూజించమని ఎన్నడూ చెప్పలేదు బాబా. భక్తులు తనని పూజిస్తే కాదనలేదు.ఆనాడు గురుపూర్ణిమ. శ్యామాని పిలిచారు బాబా.‘‘ఇవాళ గురుపూర్ణిమ. ధుని దగ్గర స్తంభానికి గురుపూజ చేసుకోమని, నూల్కర్‌కి చెప్పు.’’ అన్నారు బాబా.

‘నూల్కర్‌ ఒక్కడేనా గురుపూజ చేసుకునేది?’ మనసులో అనుకున్నాడు శ్యామా.‘‘నీకు కూడా చేసుకోవాలనిపిస్తే, గురుపూజ చేసుకో! నాకేం అభ్యంతరం లేదు.’’ నవ్వారు బాబా. తన మనసులో మాట ఇట్టే గ్రహించి, వెంటనే సమాధానం చెప్పిన బాబాని చూసి కంగు తిన్నాడు శ్యామా.

అంతలోనే తేరుకున్నాడు. ఇలా అన్నాడు బాబాతో.‘‘అయితే స్తంభాలకీ, గోడలకీ కాదు పూజలు. నువ్వే మా గురువువి. నిన్నే పూజిస్తాం. అభ్యంతరం చెప్పకు.’’

‘‘చెప్పకు అన్నంత మాత్రాన చెప్పకుండా పోతానా, వద్దు శ్యామా, నాకు పూజలేమిటి? వద్దు.’’ అన్నారు బాబా.

‘‘ఆ మాటే అనొద్దు. నువ్వు దేవుడివి, నీకే మా పూజలన్నీ.’’ అన్నారు ముక్తకంఠంతో మహల్సా, తాత్యా, కేల్కర్‌, నూల్కర్‌…అంతా.‘‘అది కాదయ్యా…’’ అని బాబా నచ్చజెప్పజూశారు. వినలేదెవరూ. పైగా పూజించేందుకు బాబాని ఒప్పించారు.

ఆ సాయంత్రం, బాబాని ఆసనం మీద కూర్బోబెట్టారు. పాదాల్ని కడిగారు. పాదపూజ చేశారు. మెళ్ళో పూలమాలలు వేసి, ఆయనకు నూతన వస్త్రాలూ, దక్షిణలూ సమర్పించారు. ఆరతి పాడారు. వైభవోపేతంగా ‘గురుపూజ’ను ముగించారు. ఆనందించారు బాబా.

తర్వాత ఇలా అన్నారు అందరితో.‘‘గురువుని మించిన దైవం లేడు. అందుకని ప్రతియేడూ గురుపూజ చేసుకోండి. ఆశీస్సులందుకోండి.’’‘‘తప్పకుండా’’ అన్నారు భక్తులంతా.

‘ఆవో సాయీ’ అని బాబాని పిలిచిన దగ్గర్నుంచి ఆయననే తన గురువుగా భావించాడు మహల్సాపతి. గురుపూజకు అంగీకరించడంతో బాబాని పూజించాడుగాని, ఆ పూజ అతనికి ఎందుకో పెద్దగా సంతృప్తినీయలేదు.

బాబాకి చందనం పూసే భాగ్యానికి నోచుకోలేకపోయాననుకున్నాడు మహల్సా. బాధపడ్డాడు. ఆ బాధతోనే నిద్రపోయాడు. నిద్రలో బాబా సాక్షాత్కరించారతనికి. ముఖానికి చందనం పూసుకుని మరీ ప్రత్యక్షమయ్యారు.ఉలిక్కిపడి మేల్కొన్నాడు మహల్సా.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles