మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా ఐదవ భాగం ….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా ఐదవ భాగం ….

రామాయణంలో వారధి (సేతువు)

శ్యామా ఒకసారి బాబాను ఈ విధంగా అడిగారు. దేవా! రాముడు లంకకు వెళ్ళడానికి వారధి నిర్మించారు కదా. దాన్ని ఒక కోటి వానరాలు నిర్మించినట్లు చెప్తారు. ఇదంతా నిజమేనా!

అప్పుడు బాబా, శ్యామా అదంతా నిజమే, సముద్రం నిజం, రాముడు నిజంగా అక్కడ ఉన్నాడు.

శ్యామా:  దేవా! అన్ని వానరాలు ఎక్కడ కూర్చున్నాయి అక్కడ అంత ప్రదేశం ఉందా!

బాబా:  ఆ కోతులన్ని కొమ్మల మీద, చెట్ల మీద, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చున్నాయి. అవన్ని చీమల్లాగా కనిపించినవి.

శ్యామా: చూచినట్లే చెబుతున్నారే!, బాబా నీవు నిజంగా ఇవన్ని చూశావా!

బాబా: స్వయానా నా కళ్ళతో నేను చూశాను శ్యామా!

శ్యామా: బాబా నిన్ను మొదట చూసినప్పుడు నీకు సరిగ్గా మీసం కూడా రాలేదు, మరి నీవు ఇవన్ని ఎట్లా చూశావు.

బాబా: శ్యామా మనిద్దరం చాలా జన్మల నుండి కలసి ఉన్నాము. నాకు అవి గుర్తు ఉన్నాయి. నీకు అవి గుర్తులేవు.

శ్యామా: నీకు అప్పుడు ఎన్ని సంవత్సారాలు దేవా!

బాబా: “నువ్వు ఎట్లా నన్ను చూస్తున్నావో అట్లానే అప్పుడు ఉన్నాను”

శ్యామా: దేవా ఇది నిజంగా సత్యమేనా!

బాబా: శ్యామా నేనెప్పుడైన ద్వారాకామాయిలో అబద్ధం చెప్పానా! అంతా నిజమే!

ఈ విధంగా శ్యామా ద్వారా మనకు బాబా నుంచి మంచి విషయాలు తెలియడం మన అదృష్టం.

మొలల వ్యాధి

ఒకసారి శ్యామాకు మొలల వ్యాధి వస్తే సోనాముఖి కాషాయం త్రాగమని బాబా అతనికి చెప్పారు. ఆ కాషాయం త్రాగాగానే శ్యామాకు వ్యాధి తగ్గినది. రెండు సంవత్సరాల తర్వాత ఆ వ్యాధి శ్యామాకు మరల వచ్చింది. ఈసారి అతడు బాబాను అడగకుండానే సోనాముఖి కాషాయం త్రాగగా వ్యాధి తీవ్రమైనది.

అప్పుడు బాబా వద్దకు వెళ్లి చెప్పుకోగా బాబా ఆశీర్వాదం వలన వ్యాధి తగ్గినది. ఇక్కడ గమనించవలిసింది ఏమిటంటే కాషాయం కాదు, బాబా ఆశీర్వాదమే వ్యాధి తగ్గుటకు మూల కారణం.

పాము విషమును శాసించుట

ఒకరోజు శ్యామా ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా ఆయన అతని బుగ్గ గిల్లారు. అతడు కోపం నటిస్తే, “72 జన్మలనుండి రక్షిస్తున్నా, నిన్ను ఎన్నడూ గిల్లనైనాలేదు. ఇప్పుడు తాకీతాకకముందే కోపగించుకుంటావెందుకు?” అన్నారు.

“ఇలా గిల్లేదేవుడు మాకొద్దు. ప్రేమతో ముద్దులు, మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి.  అటువంటి మీపై నాకు పూర్ణవిశ్వాసం వుండేలా అనుగ్రహించండి” అన్నాడు శ్యామా. సాయి, “నేనందుకే వచ్చాను” అని ఆశీర్వదించారు.

కాని ఇతనికొకసారి పాము కరచి త్వరగా విషమెక్కుతున్నది. అతని స్నేహితులు విరోబా ఆలయానికి పోదామన్నా అతడు మశీదుకే వచ్చి మెట్లెక్కుతున్నాడు. బాబా ఉగ్రులై, “ఓరీ దొంగపూజారీ! పైకెక్కవదు ! దిగు! ఫో బయటికి! పైకెక్కావో జాగ్రత్త!” అని గద్దించారు. శ్యామా నివ్వెరబోయాడు.

ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా, “భయంలేదు, యీ ఫకీరు నిన్ను తప్పక కాపాడుతాడు. నీవు చింతించవలసిన పనిలేదు. నీవు ఇంటికి పోయి ఇష్టం వచ్చింది తిను, కానీ నిద్రపోవద్దు” అని దీక్షిత్ తో అతనిని ఇంటికి పంపిరి. తర్వాత శ్యామాకు బాధంతా తగ్గిపోయింది.

అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలసిపోయి పైకెక్కుతున్న విషాన్నే. ఆ విధంగా బాబా వాక్కుతోనే అతనిని పాము కాటు నుండి రక్షించిరి. ఆ పాముకాటు తగ్గించుటకు బాబా ఎట్టి మంత్రములను, మందులను వాడలేదు. ఇదే బాబా వారి విశిష్ట విధానమంటే.

తన ప్రతినిధిగా శ్యామాను పంపుట

ఒకప్పుడు కాకాదీక్షిత్, తన కుమారుడి ఉపనయనానికి శ్రీ సాయిని నాగపూర్ ఆహ్వానించడానికి శిరిడీ చేరాడు. అదే సమయానికి నానాచందోర్కర్, తన కుమారుడి వివాహానికి సాయిని గ్వాలియర్ ఆహ్వానించటానికి వచ్చాడు.

సాయి ఆ యిద్దరితో తమ ప్రతినిధిగా శ్యామాను తీసుకెళ్ళమని చెప్పి, తాము కాశీ, ప్రయాగ, దర్శించి శ్యామాకంటే ముందుగానే గయ చేరగలమని మాట యిచ్చారు. శ్యామా ఆ శుభకార్యాలకు హాజరయ్యాక వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోను, కాశీలోనూ గడిపి, గయలో ఒక  పూజారింటికి వెళ్ళారు.

అక్కడ సాయిపటం దర్శనమిచ్చింది. దానిని చూడగానే శ్యామాకు ఆనందభాష్పాలొచ్చాయి. ఆ పూజారి 12 సంవత్సరాలకు పూర్వం శిరిడీ వెళ్ళి, శ్యామా యింటనున్న ఆ పటం తనకు కావాలన్నాడు. సాయి ఆజ్ఞననుసరించి శ్యామా ఆ పటమిచ్చాడు.

శ్యామా కంటే ఎన్నో సంవత్సరాల  ముందే సాయి అచటికి చేరారు. శ్యామా ఆ పూజారి యింటనే బస చెయ్యడం ఆశ్చర్యం! అక్కడగూడా బాబా తమ వాణ్ణి తమ వద్దనే వుంచుకున్నారు.

రేపు తరువాయి బాగం…

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles