ఒక భక్తురాలికి జరిగిన కొన్ని బాబా లీలలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఈ రోజు పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలి అనుభవాలను తెలుసుకుందాము.

నా స్నేహితురాలికి సాయి దర్శనమిచ్చుట

బాబా ప్రేరణతో నేను ప్రతీరోజు భక్తుల అనుభవాలను కొంతమంది నా స్నేహితులకు (మెయిల్ ద్వారా) పంపడం మొదలుపెట్టాను. రోజూ ఒక అనుభవం అయినా వాళ్ళకు మెయిల్ చేస్తూ ఉండేదానిని.

సహజంగా నేను భక్తుల అనుభవాలు మెయిల్ చేసేటప్పుడు ఆ అనుభవం యొక్క హెడ్డింగ్ పెట్టి, అనుభవం జత చేసి పంపేదాన్ని.  బాబా యొక్క ఫోటో ఆ అనుభవానికి జత చేసి పంపేదాన్నికాదు. ఇంటర్నెట్ యొక్క సర్వీసు  నెమ్మదిగా వుండడం వలన బాబా ఫోటో జతచేసినా అది వాళ్ళు చూడలేరు అని బాబా ఫోటో పంపేదాన్ని కాదు.

ఎప్పటిలాగే పోయిన వారం నేను ఒకరి అనుభవం మామూలుగానే ఒకే గ్రూపులోని స్నేహితులందరికీ పంపించాను. సాయంత్రం నేను హాస్టల్ కి వెళ్ళాక నా స్నేహితులలో ఒకామె, నువ్వు పంపిన మెయిల్  లో బాబా ఫోటో చాలా బాగుందనీ, అందుకని ఆ బాబా ఫోటోని మళ్ళీ మళ్ళీ చూడడం కోసం ఆ మెయిల్ మూడుసార్లు చూశానని చెప్పింది. 

నేను బాబా ఫోటో ఏదీ మెయిల్ కి జతచేసి పంపలేదు అని చెప్పాను. కానీ తను ఖచ్చితంగా బాబా ఫోటో చూశానని, అది ఎలాగుందో కూడా నాకు వివరించి చెప్పింది. నాకు ఆ బాబా ఫోటో కొన్ని రోజుల క్రిందట బ్లాగులో చూసినట్టు గుర్తు. కానీ ఆరోజు నేను బాబా ఫోటో ఏదీ జత చేయలేదని నమ్మకంగా చెప్పగలను.

నా ఫ్రెండ్ తను చెప్పింది నిజమే అని ఋజువు చెయ్యడానికి తను ఆ మెయిల్ మళ్ళీ ఓపెన్ చేసి చూసింది. కానీ అప్పుడు అక్కడ ఏ బాబా ఫోటో లేదు. మేము ఆ బాబా లీలకు విస్మయం చెందాము.

నా ఫ్రెండ్ రోజూ బాబా గుడికి వెళ్తుండేది. ఋతుక్రమం వలన కొన్ని రోజులుగా గుడికి వెళ్ళడం లేదు. అందుకని బాబా ఆమె కోసమే మెయిల్ లో కనపడి దర్శనము, ఆశీర్వాదము ఇచ్చారు.  ఇక ఏమి చెప్పను? అద్భుతమైన ఈ బాబా లీల చూసి మేము అందరం ఎంతో సంతోషపడ్డాము. బాబా తన అద్భుతలీలలు మాపై కురిపించారు.

మరొక బాబా లీలను కూడా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

నా వివాహ శుభకార్యమునకు బాబా చేసిన సహాయము.

నేను బాబా అనే చల్లని నీడని ఆశ్రయించాక నాకు మా స్వంత ఊరిలో ఉన్న బాబా గుడిలో వివాహం చేసుకోవాలనే కోరిక ఉంది. తీరా బుక్ చేసుకున్న తరువాత అబ్బాయి తరఫు వాళ్ళు అంగీకరిస్తారో లేదో తెలీదు. బాబా దయవలన నాబాయ్ ఫ్రెండ్ తన తప్పులు తెలుసుకొని నా దగ్గరకి వచ్చి క్షమాపణ చెప్పాడు.

అప్పటినుండి బాబా దయవలన అన్నీ శుభంగా జరుగుతున్నాయి. మా యిరువైపుల పెద్దలు మా పెళ్ళి జూన్ లేదా జూలైలో జరపాలని నిర్ణయించారు. అబ్బాయి తండ్రి పెళ్ళికని మూడు, నాలుగు తేదీలు అనుకొని ఆ తేదీలలో ఏదో ఒకరోజుకు వివాహం జరగాలని అనుకున్నారు. మా అమ్మ కూడా జ్యోతిష్యులను మంచి ముహూర్తంకోసం సంప్రదించింది.

వారు మేము అనుకున్న రెండు తేదీలు కూడా బాగున్నాయని చెప్పారు. ఆ రెండు తేదీలలో ఏ తేదీ నిర్ణయించుకోవాలో తెలియని అయోమయంలో పడ్డాము. మేము మంచిరోజు కోసం బాబాని ప్రార్థించాము. మేము గుడికి వెళ్లి విచారిస్తే ఆ రెండు తేదీలలో ఒక తేదీలో అప్పటికే మ్యారేజ్ హాల్ బుక్ అయిందని చెప్పారు. అందుకని మేము జూలై 9వ తేదీన వివాహం జరపాలని నిశ్చయించుకొని మ్యారేజ్ హాల్ బుక్ చేశాము.

మేము చాలా ఆనందించాము, ఎందుకంటే 9 వ సంఖ్య బాబాకు చాలా ఇష్టమైన సంఖ్య. బాబాయే 9వ తేదీన మా వివాహం జరిగేలా చూస్తున్నారని సంతోషించాము. అందుకే ఆరోజే హాలు ఖాళీగా వుండడం, మేము బుక్ చేసుకోవడం జరిగింది. బాబా మాకు ప్రతిదీ చేసిపెడుతున్నందుకు మేము బాబాకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాము.

ఇంకో విషయం ఏమిటంటే, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు బాబా భక్తులు కాకపోయినప్పటికీ, బాబా గుడిలో వివాహం జరిపించేందుకు అబ్బాయి తన తల్లిదండ్రులను ఒప్పించాడు.  అందుచేత ఏమీ సందేహమే లేదు, బాబాయే ఇదంతా జరిపించారు. నేను  బాబా పాదాలకు మనఃపూర్వకంగా ప్రణమిల్లి మా వివాహం  ఏ ఆటంకం లేకుండా జరగాలని వేడుకున్నాను.  మా పెళ్ళికి వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించాలని బాబాని వేడాను.

లవ్ యు  బాబా.  మీరు లేకుండా నేను జీవితంలో ఏమీ సాధించలేను సాయి.

దీర్ఘకాలంగా వున్న నా వీపునొప్పిని బాబా నయం చేశారు

2, 3 సంవత్సరముల నుండి నేను విపరీతమైన వీపునొప్పితో బాధపడుతూ ఉండేదానిని. నొప్పి తరచుగా వస్తూ ఉండేది, కాని ఏ మందులూ పనిచేయలేదు. చివరగా బాబా ఊదీని ఆశ్రయించాను. నా వీపునొప్పి తగ్గించమని, భరించలేనని మనఃస్పూర్తిగా వేడుకొని  ఊదీ తీసుకోవడం మొదలుపెట్టాను.

కొన్నిరోజుల తర్వాత నొప్పి తగ్గడం మొదలయింది. కొన్ని నెలల నుండి నొప్పి నుండి చాలా రిలీఫ్ గా వుంది. బాబానే నా నొప్పిని నయం చేసారని నాకు తెలుసు. బాబా మీకు ధన్యవాదాలు. నిజంగా బాబా ఊదీ ఎటువంటి అనారోగ్యానికైనా అమోఘమైన నివారణోపాయం.

బాబా నా చర్మ సమస్యను నయంచేశారు

నా మొహం మీద మొటిమల వల్ల, శరీరం వేడి చేయడం వలన చర్మం మీద బాగా మచ్చలు వచ్చాయి. ఆ చర్మం గురించి నాకు చాలా బాధగా వుండేది. నేను ఒకసారి భక్తుల అనుభవాలు చదివేటప్పుడు, ఇలానే ఒక అమ్మాయికి చర్మ సమస్య ఉన్నప్పుడు  రోజూ రాత్రి బాబా ఫోటో ముందు ఒక గ్లాసు నీటిలో బాబా ఊదీ కొంచెం వేసి, రాత్రంతా అలాగే వుంచి ఉదయం లేవగానే  తీసుకొనేది అని చదివాను.

నేనూ అలానే చెయ్యడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా చర్మసమస్య చాలా తగ్గి మెరుగయింది.  ఏదో ఒకరోజు బాబా దయవలన మొహంమీద ఉన్న మచ్చలు తగ్గి మునుపటి అందమైనచర్మం వస్తుందని నాకు నమ్మకం. బాబా తన భక్తుల యొక్క చిన్న కోరికలను కూడ విని, వాళ్ళ కోరికలు తీరుస్తున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు సాయి.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles