‘‘భక్తుడంటే మేఘుడే! మేఘుడే సరయిన భక్తుడు.’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘శివుడొస్తున్నాడన్నానా! వచ్చాడిదిగో! తీసుకో, పూజ చేసుకో.’’దోసిట పట్టి శివలింగాన్ని కళ్ళకద్దుకున్నాడు మేఘుడు.

వాడాలో, తనున్న చోటున, బాబాపటం దగ్గరగా లింగాన్ని ఉంచాడు. ఆ లింగంలో బాబాని దర్శిస్తూ పూజ చేయసాగాడు. నిత్యం లింగాన్ని అభిషేకించేవాడు. ఆ నీటిని శిరసున జల్లుకుని పునీతమయ్యేవాడు.సంక్రాంతి పర్వదినం.మేఘడికి బాబాని అభిషేకించాలనిపించింది.

చెంబుతో గంగాజలాన్ని తీసుకుని ద్వారకామాయికి చేరుకున్నాడతను. తనని సమీపించిన మేఘుణ్ణి చూసి సన్నగా నవ్వారు బాబా.‘‘నేను ముస్లింని. నాకు అభిషేకాలు కూడదు.’’ అన్నారు.

‘‘నువ్వు ముస్లింవి అయితేనేం, నువ్వే నా దేవుడివి. నా దేవుడికి ఈ రోజు అభిషేకం చేయక తప్పదు.’’ అన్నాడు మేఘుడు.‘‘తప్పదా’’‘‘తప్పదు’’ గట్టి పట్టే పట్టాడు.

‘‘అయితే నా శరీరాన్నంతా తడపకు. అసలే చలికాలం. శిరసునొక్కదాన్నే తడుపుకో.’’ అన్నారు బాబా. అనుమతి లభించడమే ఆలస్యం మేఘుడు చేతిలోని గంగాజలాన్ని బాబా శిరసున అభిషేకించాడు.

‘‘హర హర మహాదేవ! శంభో శంకర’’ అని నినదించాడు.తల మీది నీరు తరలి వచ్చి తనువంతా తడిపేయాలి. తడవదే! నెత్తి మీది నీటిచుక్క నేల రాలదే! అక్కడే ఉండిపోయింది. జటాఝూటంలో ఆకాశగంగని శివుడు బంధించినట్టుగా మేఘుడు అభిషేకించిన నీటిని బాబా శిరసునే ఉంచేశారు. 

అది చూసి ఉప్పొంగిపోయాడు మేఘుడు. చేతులు జోడించాడు.‘‘అనుమానం లేదు, నువ్వు శివుడివే’’ అన్నాడు.1912లో మేఘుడు చనిపోయాడు. అతను పోయాడన్న వార్తవిని, బాబా కుంగిపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. బాబా కన్నీరు పెట్టుకోవడాన్ని అంతా వింతగా చూశారానాడు.‘భక్తుడంటే మేఘుడే! మేఘుడే సరయిన భక్తుడు.’’ అన్నారు బాబా.

ఆ మర్నాడు మేఘశ్యాముడు రోజూ అభిషేకించే శివలింగాన్ని తెచ్చి, బాబాకి చూపించారు.‘‘దీన్నేం చెయ్యమంటారు?’’ అడిగారు.‘‘గురుస్థాన్‌ దగ్గర ప్రతిష్ఠించండి.’’ ఆజ్ఞాపించారు బాబా. అలాగే ప్రతిష్ఠించారు దాన్ని. ఆనాటి నుంచి ఆ లింగం నేటికీ పూజలు అందుకుంటోంది.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles