‘‘రాత్రి కలలో నేను చెప్పిందంతా నిజమే! వెళ్ళు, శివుడొస్తున్నాడు. త్రిశూలాన్ని గియ్యి.’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘హరహర మహాదేవ! శంభో శంకర’’ అంటూ పెద్ద పెట్టున అరిచాడు. కూర్చున్న చోటు నుంచి పడుతూ లేస్తూ బాబాని సమీపించాడు.

భక్తులంతా మేఘుణ్ణి విచిత్రంగా చూడసాగారు.‘‘భయపడకండి, ఈ మేఘుడికి నేను శివుడిలా కనబడి ఉంటాను. అదే పనిగా పంచాక్షరీ జపిస్తున్నాడుగా, నాలో శివుణ్ణి చూసుకుని ఉంటాడు. నేనే శివుణ్ణనుకుంటున్నాడు, పాపం! భ్రమపడి ఉంటాడు.’’ అన్నారు బాబా.

‘‘భ్రమ కాదు బాబా, నువ్వే శివుడివి. అనుమానం లేదు. నా ఆరాధ్యదైవం నువ్వే! ఇక నేను నిన్ను వదలను. నీ పాదాలే నాకు శరణు.’’ అన్నాడు మేఘుడు. బాబా పాదాల మీద వాలిపోయాడు.

‘‘ నన్ను మీరే  కటాక్షించాలి. ముక్తిని ప్రసాదించాలి.’’ అన్నాడు మళ్ళీ. నవ్వారు బాబా. ఆ మర్నాటి నుంచి మేఘుడు బిల్వపత్రాలతో బాబా పాదాలను అర్చించసాగాడు. ఆ పత్రాల కోసం అడవిలో మైళ్ళకు మైళ్ళు ఒంటరిగా నడిచి వెళ్ళేవాడు.‘‘ఓం సాయి! ఓం సాయి’’ అనుకుంటూ బాబానే చూస్తూ కూర్చునేవాడు.

ఆకలి అనేవాడు కాదు, దాహం అనేవాడు కాదు. అంతా సాయిమయం అంటూ భజన చేస్తూండేవాడు.ఓ రాత్రి మంచి నిద్రలో ఉన్నాడు మేఘుడు. బాబా కలలో కనిపించారతనికి. చేతిలోని అక్షింతలు అతని మీదికి జల్లారు. ఆశీర్వదించారు.‘‘మేఘా! నీ శివుడు వస్తున్నాడు. లే! లేచి శివుని ఆయుధం త్రిశూలాన్ని గియ్యి.’’ అన్నారు.

అదృశ్యమయిపోయారు. మెలకువ తెచ్చుకున్నాడు మేఘుడు. లేచి కూర్చున్నాడు. అరచేతి కింద బియ్యంలా తగిలితే తీసి చూశాడు. అక్షింతలు. ఆశ్చర్యపోయాడు. నిద్రపోలేదు మళ్ళీ. ఎప్పుడు తెల్లవారుతుందా? బాబాని ఎప్పుడు దర్శించుకుంటానా? అన్నట్టుగా నిరీక్షించాడు.

తెల్లారింది.బాబాని దర్శించాడు మేఘుడు. అతన్ని అల్లంత దూరం నుంచి చూస్తూనే ఇలా అన్నారు బాబా.‘‘రాత్రి కలలో నేను చెప్పిందంతా నిజమే! వెళ్ళు, శివుడొస్తున్నాడు. త్రిశూలాన్ని గియ్యి.’’

వాడాకి పరిగెత్తాడు మేఘుడు. గది గోడకి వేలాడుతున్న బాబాపటం దగ్గరగా సిందూరంతో త్రిశూలాన్ని గీశాడు. ఆ బొమ్మ మీద తలాన్చి శివుణ్ణి ప్రార్థించాడు.

మర్నాడు భక్తుడొకడు పునా నుంచి వచ్చాడు. బాబాని దర్శించుకున్నాడు. కానుకగా శివలింగాన్ని సమర్పించుకున్నాడు. చిన్న లింగం. చూడముచ్చటగా ఉంది.

పక్కనున్న మేఘుణ్ణి చూశారు బాబా. ఆరాధనగా తన చేతిలోని లింగాన్నే చూస్తున్న మేఘుడికి లింగాన్ని బహూకరించి ఇలా అన్నారు బాబా.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles