Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా జీవిత చరిత్రలో ఎందరో భక్తులు, సందర్శకులు ఒకొక్కరు ఒకొక్క విధంగా సాయి సాహిత్యంలో దర్శనమిచ్చారు.
సాయి పిలిపించుకొన్న వారొకరకంగా ఉంటారు. సాయి తిరస్కరించిన వారూ ఉన్నారు. అయితే ఆ తిరస్కారంతో కథ అయిపోయినట్లేనా? అవుననవచ్చు కాదనవచ్చు.
ఒక ఆంగ్లేయుడు వచ్చాడు. షిరిడీలో సాయిని దర్శించాలని, అయన హస్తాన్ని చుంబించాలని అతని కోరిక.
ఆ కోరిక అతనికి న్యాయబద్ధముగా కన్పించ వచ్చును. కాని సనాతన హిందువులకు అలా అనిపించదు. ఎవరికీ ఎలా అనిపించినా సాయికి లెక్కలేదు.
సాయి మాటే సుగ్రీవాజ్ఞ. అతనిని లోనికి రానీయలేదు. కారణం తెలియదు. అయినా అతనిపై అనుగ్రహం లేదన కూడదు.
అతడు షిరిడీని విడిచి వెళ్ళటానికి అనుమతి కోరినప్పుడు సాయి అనుమతివ్వలేదు. సాయి మాట కాదని ప్రయాణం కట్టాడు. ఆసుపత్రి పాలయ్యాడు.
సాయి తన దర్శనాన్ని కోరిన కర్టిన్ దంపతులను దర్శనాన్ని తిరస్కరించ లేదు కాని, ఎప్పటికప్పుడు “ఇప్పుడు కాదు, కాసేపయిన తరువాత” అనే వాడు.
అది వారూ తమను పరీక్షిస్తున్నారని గ్రహించలేక దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోయారు.
హరి వినాయక సాఠే అనే సాయి భక్తుడు తన వంటవాడైన మేఘశ్యాముడిని సాయి వద్దకు పంపాడు. అతనిచే సాయికి శివునికి చేసే అభిషేకం చేసినట్లు చేయిద్దామనే తలంపుతో.
కాని సాయి బాబా ముస్లిం అని తెలియటంతో మేఘుడు తన గురువైన సాఠే వద్దకు వెళ్ళి సాఠేను
“ఇల్లా మశీదు, తలకా సెల్లాముడి కట్టు జడగా, చేత సటకా మే
నెల్లా కాఫ్నీ! జపమా
‘అల్లా మాలిక్’…శివుడగు నెట్లయ్యా? “
అని ప్రశ్నిస్తాడు.
త్రయంబకేశ్వరంలోని శివలింగానికి బదులు సాయిని చూచి చకితుడవుతాడు. సాయియే తన శివుడిని గ్రహిస్తాడు.
ఇక షిరిడీకి వెళ్లిన తరువాత అతడు తన జీవిత కాలమంతా సాయి శివ సేవలోనే ఉండిపోయాడు.
సాయే ఈశ్వరుడని గ్రహించిన మేఘుడు ప్రతి నిత్యమూ ఒంటి కాలిపై నిలబడి, ఏకాగ్ర దృష్టితో సాయికి ఆరతులిచ్చే వాడు.
ప్రతిరోజు మైళ్ళ దూరం నడిచి బిల్వ పత్రాలను సేకరించి వాటితో సాయికి పూజ చేసేవాడు.
మేఘుడు సాయి వైపు ఎన్ని వేల అడుగులు వేశాడో ఊహించలేము. ఫలితంగా సాయి సాయిజ్యాన్ని పొందాడు.
రాముడు సీతకై విలపిస్తాడు అరణ్యంలో
సాయి కూడ మేఘుని మృతి పట్ల విలపిస్తాడు
మేఘశ్యాముడు సాయి శివునిలో ఐక్యమైన రోజు 19 జనవరి, 1912.
ఈనాడు మేఘుని, సాయి శివుని స్మరిద్దాం! తరిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కథలు కంచికి – గాధలు సాయిలోకి…..సాయి@366 జనవరి 15….Audio
- జన్మ జన్మల బంధం …..సాయి@366 డిసెంబర్ 23….Audio
- సాయి శంకర…..సాయి@366 ఆగస్టు 6….Audio
- కాదు సుమా! కల కాదు సుమా!! …..సాయి@366 జనవరి 10…Audio
- ‘‘భక్తుడంటే మేఘుడే! మేఘుడే సరయిన భక్తుడు.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments