సాయి శంకర…..సాయి@366 ఆగస్టు 6….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయి పరబ్రహ్మమే!

అయినా సాయిని శంకరుని రూపముగా, అవతారముగా భావించి పూజించి, సేవించి తరించారెందరో.

నేటికి మహాశివరాత్రి దినమున, శ్రావణ సోమవార దినమున సాయి మహాసమాధిపై ఈశ్వరుని చిత్తరువును ఉంచుతారు.

ఇది సాయి మహేశ్వరుల అభేదత్వానికి గుర్తు. సాయిని ఈశ్వరుని మొదటగా గుర్తించినది సాఠే.

సాఠే ఉన్నత పదవిలో ఉన్నందున ప్రత్యక్షముగా సాయిని శివ రూపిగా పూజాదికాలు చేసుకోలేకపోయాడు.

అందుకని తనకు బదులుగా తన వంట వానిని మేఘశ్యాముని పంపాడు, సాయిని నిత్యము శివునిగా అర్చించుటకు.

అయితే మేఘుడు సాయి ముస్లిం అనే అభిప్రాయంలో ఉన్నాడు. తిరిగి వెళ్లిపోయాడు. అప్పుడే సాయీశ్వరుని లీల ప్రారంభమైంది.

ఒకనాడు శివలింగమునకు బదులుగా సాయి సాక్షాత్కరించాడు ఆ లింగంలో. అప్పుడు మేఘునకు సాయి సాక్షాత్తు శివుడనే అభిప్రాయనికి వచ్చాడు.

మరల సాయిని దర్శించాడు, పూజించాడు, అర్చించాడు తన ఇష్ట దైవమైన ఈశ్వరునిగా.

కాలి నడకన గోదావరి జలాలను (చెప్పులు లేకుండా) మండుటెండలో భుజమున పాత్రతో గోదావరి జలమును తెచ్చి సంతృప్తికరంగా ఒక మకర సంక్రాంతి దినాన సాయికి అభిషేకం చేశాడు. శివుడు అభిషేక ప్రియుడు గదా!

ఒకే ఒక సంఘటనతో లక్ష్మీబాయి షిండే సాయిని ఈశ్వరునిగా భావించింది. వామనరావ్‌ పటేల్‌ సాయీశ్వర తత్వాన్ని అనుభవంలోనికి తెచ్చుకున్నాడు.

ఇక హేమాద్‌పంత్‌ సంగతి చెప్పనక్కరలేదు. హేమాద్‌పంత్‌ రచించిన సాయి సచ్చరిత్రలోని 11వ అధ్యాయము ”ఏకాదశ రుద్రం వంటిది ” అని వ్రాశారు.

రుద్ర రూపుడైన సాయి ఈ 11వ అధ్యాయ పారాయణ చేసిన వారికి శాంతరూపధారియై వారిని అనుగ్రహించు గాక!

సాయి తన రౌద్రంచే, ఈ పారాయణ చేసిన వారి, శివ పూజ చేసిన వారి అంతరంగ శతృవులను మట్టుపెట్టు గాక!

సాయి దక్షిణామూర్తియై జ్ఞానమును అనుగ్రహించు గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles