దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా… . … …. మహనీయులు – 2020… ఆగస్టు 6



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“అచ్చంగా తెలుగు వాడనే తేనెటీగ తన సంగతి మరచిపోవడం జరిగింది” అంటారు ఆంధ్ర సాహిత్య రచయిత ఆరుద్ర.

ప్రథమ దత్తావతారుడు తెలుగు వాడని శ్రీ వాసుదేవానంద సరస్వతులు తెలుపవలసిన పరిస్థితి ఏర్పడ్డది.

విశిష్టాద్వైత సాంప్రదాయకుడు నింబార్కుడు …ఇలా ఎందరెందరో తెలుగు వారే.

ప్రథమ దత్తావతారుడు శ్రీపాద వల్లభుడు తెలుగునాట, పిఠాపురంలో భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే 6 – 8 – 1323న జననమందారు.

మానవులు, దేవతలకన్నా ఏ మాత్రం తీసిపోరని, రెండాకులు ఎక్కువే చదివారని తెలుస్తోంది.

తాను పరీక్షించవలసిన వ్యక్తి గర్భంలో జన్మించ వలసి వచ్చింది దత్తునకు. దత్తుని ప్రథమావతారం కూడా అదే పరిస్థితిలో జరిగింది.

దత్తాత్రేయుని ప్రథమావతారానికి శ్రీపాద  శ్రీవల్లభుడని నామం ఉంది. ఇది రెండు సందర్భాలలో వచ్చిన నామం.

పుట్టిన బిడ్డడికి ఉన్న మంచి చిహ్నములు చూచియు, ఇంకా సాముద్రికం తెలిసినవారు, ఆ బాలుని పాదములలోని అద్భుత చిహ్నములను చూచి శ్రీపాదుడని పేరు పెట్టారు.

శ్రీపాదునకు వివాహం చేయ ప్రయత్నించినప్పుడు, తాను యోగశ్రీకి వల్లభుడనని పలికారు. ఏక నామము శ్రీపాద శ్రీవల్లభుడు.

దత్తావతారములలో పంచముడుగా కీర్తింపబడే సాయికి కూడా పాదములకు శుభ చిహ్నములున్నవి.

దత్తావతారుడు అంటే దత్తుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగానే కాక, వారి దేవేరులుగా ఆ అవతారంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తారు.

ఉదాహరణగా శ్రీపాద శ్రీవల్లభుడు ఆత్మహత్య చేసుకొనబోవు తల్లి కుమారులను వారిస్తాడు.

విద్యా విహీనుడైన ఆ కుర్రవానికి సకల శాస్త్ర పాండిత్యం ఇస్తాడు శ్రీపాదుడు. అంటే సరస్వతీ మాతగా కటాక్షించాడు శ్రీపాదుడు.

జ్ఞాన బోధ చేశాడు తల్లియైన సుమతికి.

సేవ చేసిన రజకునకు సామ్రాజ్యమే కట్టబెట్టాడు.’

ఎన్నో లీలలను చూపి కురువపురంలో కృష్ణా నదిలో అంతర్హితుడైనాడు. నేటికీ సూక్ష  రూపంలో దర్శనమిస్తారు. మహా సమాధి అనంతరం లబ్ది పొందిన వారిలో వల్లభేశుడు అనే భక్తుడు ఒకడు.

శ్రీపాద శ్రీవల్లభులు ఎచటకు వెళ్ళినా ప్రజలకు విజ్ఞానము, శాంతి, ఊరట కలిగించేవారు. భగవంతుని వైపు మనుష్యులను త్రిప్పేవారు.

నేడు ఆగస్టు 6, శ్రీపాద శ్రీవల్లభుల జయంతి.

నేడు శ్రీపాద వల్లభులను స్మరించెదము గాక!

“దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles