Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సాయి పలికిన పలుకులు మాత్రమే అక్షర సత్యాలు కావు. కృష్ణ శాస్త్రి జగేశ్వర్ భీష్మ రచించిన గీతాలు, ఆయన సగుణోపాసనలోని ఇతర గేయాలు కూడా అక్షర సత్యాలే.
శేజారతిలో భీష్మ ”దావుని భక్త వ్యసన హరీసి, దర్శన దేశీ త్యాలాహో…” అని లిఖిస్తారు. అంటే ”భక్తుల సంకటములను నశింపచేసి, వారికి దర్శనము ఇచ్చెదవు” అని అర్థంగా చెప్పుకోవచ్చు.
ఒకసారి ఇమాంభాయ్ చోటాఖాన్ సాయిని దర్శించాడు షిరిడీకి వెళ్ళి. ఇక తిరిగి వెళ్ళేందుకు సాయి అనుమతిని కోరాడు.
”ప్రజలు బయటకు వెళ్ళకూడాదు. వెళితే తుఫానులొస్తాయి. అగ్ని గోళాలు వర్షిస్తాయి” అన్నారు. సాయి ఉద్దేశం అర్థం అయినా ప్రయాణం మొదలు పెట్టాడు.
‘వారి’ నది దగ్గరకు చేరేటప్పటికి సాయంత్రం అయింది. ఆ గ్రామ పటేల్ ఆకాశం మేఘలతో కప్పబడి ఉన్నదని, ప్రయాణం మానుకొమ్మన్నాడు. అయినా నడక సాగించాడు.
ఉరుములు మెరుపులతో తుఫాను మొదలైంది. పిడుగు దగ్గర్లో పడ్డది. ఆ కాంతిని చూడలేక తల త్రిప్పుకున్నాడు.
సాయి మాట వినకపోవటమే ఈ అనర్ధాలకు కారణమైంది. బిడ్డ చేసిన తప్పును క్షమించ గలిగే మాతృ హృదయం సాయిది. వెనుకకు తిరిగి చూచాడు. సాయి నిలబడి ఉన్నాడు.
ఆయన వెంట రెండు కుక్కలున్నాయి. ఇమాంభాయ్ వెంటనే సాయి పాదాలకు నమస్కరించాడు. సాయి అదృశ్య మయ్యాడు.
ఇక అతను నదిని దాటాడు. నది ఒడ్డుకు చేరాడు. వెనుదిరిగి చూచాడు. నీరు రెండు గట్టుల పైనుండి ప్రవహిస్తోంది. అంటే నదీ ప్రవాహం కనీసం 20 అడుగులపైనే ఉంది. అది చూసి ఇమాంభాయ్ గుండె ఝల్లుమన్నది ఒక్కసారిగా.
ఇటువంటి అనుభవం భీష్మకు కూడా జరిగింది. ఉమ్రేడ్‌లో సత్సంగంలో ప్రసంగించి తిరిగి తన ఊరికి పోదామని ఎడ్ల బండిలో ప్రయాణమయ్యాడు భీష్మ.
చంద్రభాగ నది ఉపనది (మొహపా)ని దాటాలి. నది వద్దకు వచ్చే సరికి ఎద్దులు ఆగిపోయాయి. ఎదురుగా నది వరదలలో ఉన్నది.
నదిని దాటటం కష్టం అని తలంచి భీష్మ తనను కాపాడమని సాయిని వేడుకున్నాడు. ఎద్దులు అతి వేగంగా నదిని దాటాయి.
ఆవలి ఒడ్డున సాయి నిలబడి ఉన్నాడు. భీష్మ నమస్కరించాడు సాయి పాదాలకు.
భీష్మ ఆగస్టు 16, 1854న జన్మించాడు. భావము తెలుసుకొని (అర్థవంతముగా) ఆరతులను గానము చేయుదుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- జై సచ్చిదానంద! …..సాయి@366 ఆగస్టు 11….Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 18 వ భాగం–Audio
- అదా కారణం!…..సాయి@366 ఆగస్టు 1…Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 16 వ భాగం–Audio
- సాయి శంకర…..సాయి@366 ఆగస్టు 6….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments