Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
భక్తులకు ఏది కావాలంటే అది ప్రసాదించడం, వారు ఎలా కోరుకుంటే అలా ప్రత్యక్షం కావడం బాబాకి ఇష్టం.
మేఘశ్యాముడు వంట బ్రాహ్మణుడు. గొప్ప శివభక్తుడు. రాత్రీ పగలూ అతనికి ఒకటే ధ్యానం.ఓం నమశ్శివాయ.అన్న పానాలక్కర్లేదతనికి. పంచాక్షరీ మంత్ర జపం చాలు. దాంతోనే జీవితం కడతేరిపోవాలనుకుంటున్నాడు మేఘుడు.
హరి వినాయక్‌సాఠే గమనించాడతన్ని. మేఘుని అచంచల భక్తిని చూసి, బాబాని దర్శించమన్నాడు. షిరిడీకి వెళ్ళమన్నాడు.బ్రాహ్మణుణ్ణి. ఓ ముస్లింని దర్శించడం ఏమిటి? మల్లగుల్లాలు పడ్డాడు మేఘుడు.
అతని సందేహాన్ని అర్థం చేసుకున్న వాడిలా ఇలా అన్నాడు వినాయక్ సాఠే.‘‘ముందు షిరిడీకి వెళ్ళు, తర్వాత నీకే అన్నీ అర్థమవుతాయి.’’‘సరే’నని బయల్దేరాడు మేఘుడు.
ద్వారకామాయిలో అడుగుపెట్టాడు. చుట్టూ చూశాడు. అంతా మసీదు వాతావరణం. దీనిని ద్వారకామాయి అంటారేమిటి? అనుకున్నాడు.
బాబాని చూశాడు. గద్దె మీద కూర్చుని బాబా బాగానే కనిపించారు కాని, దేవుడా ఇతను? అన్న అనుమానం కలిగిందతనికి. ఆ అనుమానంతోనే బాబా దగ్గరగా నడిచాడు.
వస్తున్న మేఘుణ్ణి చూసి విసురుగా తలెత్తారు బాబా. ఇలా అన్నారు.‘‘నువ్వు బాహ్మణుడివి, నేనేమో ముస్లింని. నన్ను దర్శిస్తే నీ జాతి, మతం మైలబడిపోతాయి. ఎందుకొచ్చావిక్కడకి? పోపో’’ కసురుకున్నారు.
మేఘడి ముఖం చిన్నబోయింది. వెనుతిరిగి వచ్చేశాడక్కణ్ణుంచి. తిరిగి ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాడుగాని, ఎందుకో వెళ్ళ బుద్ధి కాలేదు. బాబా దర్శనంతో మేఘుడి ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది.
దాంతో షిరిడీలోనే ఉండిపోయాడు. వాడాలో ఉంటూ, రోజూ ఖండోబా ఆలయానికి వెళ్ళి ఖండోబాని పూజించి, తర్వాత ద్వారకామాయికి చేరుకునే వాడు మేఘుడు.
ద్వారకామాయికి చేరుకుని, అక్కడ ఓ మూలన బాబాకి కనిపించకుండా కూర్చునేవాడు. కూర్చుని బాబానే తదేకంగా చూస్తూ పంచాక్షరీ జపించసాగాడు.
ఎప్పటిలాగానే ఆ రోజూ మేఘడు పంచాక్షరీ జపిస్తూ బాబాని చూడసాగాడు. కాస్సేపటికి బాబా కనిపించలేదతనికి. బాబా స్థానంలో శివుడు కనిపించాడు. శివలింగం కనిపించింది. మేఘుడి ఆనందానికి అంతులేకపోయింది.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘రాత్రి కలలో నేను చెప్పిందంతా నిజమే! వెళ్ళు, శివుడొస్తున్నాడు. త్రిశూలాన్ని గియ్యి.’’
- ‘‘భక్తుడంటే మేఘుడే! మేఘుడే సరయిన భక్తుడు.’’
- ‘‘ద్వారకామాయి పక్కనే ఓ వాడా నిర్మించు. దాని మధ్యలో ఓ మందిరాన్ని కూడా నిర్మించు.”
- భగవంతుడు మననించి కోరేది ఏమిటి ?
- తిరస్కారం నుండి పురస్కారం వరకు…..సాయి@366 జనవరి 19….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments