మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా రెండవ భాగం ….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

మాధవరావు దేశ్‌పాండే ఉరప్ శ్యామా రెండవ భాగం ….

శ్యామా వృత్తి వివరాలు

శ్యామా షిర్డి మరాఠి బడిలో ఆరవ తరగతి వరకు చదివాడని చెప్పుకున్నాము. సుమారు 15-16 సంవత్సరాల వయస్సులో అదే బడిలో ఉపాధ్యాయునిగా చేరాడు. నానా రత్నపార్కె అనే ఆయన వాళ్ళకి ప్రధాన ఉపాధ్యాయుడు. లక్ష్మణ మాష్టారు అనే ఆయన కూడా అక్కడ పనిచేసేవాడు.

శ్యామా టీచరుగా సుమారు 6 సంవత్సరాలు పనిచేశారు. ఆ తరువాత బాబా అనుమతితో నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న అష్టగాం అనే గ్రామానికి పటేల్ గా పని చేసారు.

ఆ తరువాత కొంత వైద్యం నేర్చుకుని బాబా అనుగ్రహంతో వైద్యుడిగా సేవ చేయడం జరిగింది. రోగుల నాడి చూసి జబ్బు కనుక్కోవడంలో మంచి పేరు తెచ్చుకొన్నారు. ఆయుర్వేద మరియు కొన్ని ఇంగ్లీషు మందులు ఇచ్చేవారు.

బాబా ఊది కలిపి, ఆయనను ప్రార్ధించి మందులను ఇచ్చేవారు. అందరికి వ్యాధులు తగ్గేవి. పెద్ద పట్టణాలలో పేరు మోసిన డాక్టర్ల వలన తగ్గని వ్యాధులు ఇతని వద్ద తగ్గేవి. కాని ఆయన మాత్రము ఈ మందులు వాడేవారు కాదు. బాబా చెప్పిన వైద్యం మాత్రమే చేసుకునేవారు.

మెల్లగా షిర్డికి వచ్చిన యాత్రికుల మంచి, చెడ్డలు చూడటం వారికి వసతి సౌకర్యాలు ఏర్పరచటం లాంటి పనులలో నిమగ్నమై ఉండేవారు. బాబాకు కావల్సిన పనులన్ని చేసిపెట్టేవారు. బాబాని ఎవరైనా వారి ఇండ్లకు రమ్మని ఆహ్వానిస్తే తనతరపున బాబా శ్యామాను పంపేవారు.

ఈ విధంగా శ్యామా బాబా సేవయే తన వృత్తిగా చేపట్టిన పుణ్యాత్ముడు. నానాసాహెబ్‌ చందోర్కరు, దీక్షిత్, కపర్డె బూటి వంటివారు శ్యామాకు బాబాతో సమానమైన గౌరవం ఇచ్చేవారు.

బాబాపై నమ్మకం

మాధవరావ్ చాలా సంవత్సరాలు బాబాను చూస్తూ ఉన్నా ఆయన్ని పూర్తిగా నమ్మటం జరగలేదు. సాయి దగ్గరలో ఉన్నా, బాబాను ఒక ఫకీరులాగ భావించాడు తప్ప గురువుగా చూడలేదు. కాని ఆయన పరమ విష్ణు భక్తుడు రోజు పూజ చేసుకోవడం అందరికి సహాయ పడటం, పిల్లలకు పాఠాలు చెప్పడం ఆయన రోజు వారి కార్యక్రమం.

ఇలా దాదాపు 16 సంవత్సరాలు గడిచిపోయాయి. శ్యామాకు దాదాపు 31 సంవత్సరాలు వచ్చాయి. శ్యామాకు సాయి ఎవరు అన్న విషయం తెలియదు. కాని కొన్ని సంఘటనల తరువాత సాయి యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు.

1 . బాబా షిర్డీ చేరిన తొలి రోజుల్లో ఆయనను చాలా మంది పిచ్చి వాడని తలచే వారు. ఒక సారి చిదంబర కేశవ్‌ గాడ్గిల్ అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ దగ్గర పనిచేసే కార్యదర్శి భీమ శంకర్ ఆలయానికి వెళ్లినపుడు అక్కడ గాడ్గిల్ అనే సాధువు కనిపించి షిర్డీ లో ఒక గొప్ప సాధువు వున్నారు. ఆయనను దర్శించమ”ని  చెప్పారు.

అందుచేత గాడ్గిల్ షిర్డీ వచ్చి ఇక్కడ ఎవరైనా గొప్ప సాధువు వున్నారా?’ అని శ్యామా ని అడిగాడు. ఇక్కడ అటువంటి గొప్ప సాధువు ఎవరూ లేరు. మసీదులో ఒక పిచ్చి ఫకీరు మాత్రం వున్నాడు అని శ్యామా జవాబు చెప్పాడు. మసీదులో వున్న సాయిబాబా పై అప్పటి శ్యామా భావం అలా వుండేది.

వెంటనే గాడ్గిల్ మసీదుకి వెళ్ళి బాబాని దర్శించాడు. బాబా అతనిని చూస్తూనే నేనొక పిచ్చి ఫకిరుని. నీవు ఆ భీమ శంకర్ ఆలయంలోని సాధువు కాళ్ళ మీదే పడు అన్నారు. దాంతో నివ్వెరపోయిన గాడ్గిల్ అయన మహానుభావుడని గుర్తించి అయన కాళ్ళ మీద పడ్డాడు.

2 . అలానే 1885 లో ఒకసారి శ్రీ అక్కల్కోటస్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవలా దగ్గరనున్న సవర్ గాంవ్ లోని మఠంలో కొద్దిరోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు శిరిడీకి చెందిన మాధవ్రావ్ దేశ్ పాండే, నందరామ్ మార్వాడీ, మొదలైనవారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణ మయ్యారు.

అకస్మాత్తుగా ఆ స్వామి పరుగునవచ్చి, “నన్నుగూడ సాయి దర్శనానికి తీసుకుపోరా?” అని పిల్లవానిలా మారాం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. చివరకు శిరిడీ చేరాక ఆయన – సాయిబాబా ఒకరినొకరు చూచుకున్నారు గాని, ఏమీ మాట్లాడుకోలేదు. ఆయన తిరిగివెళ్తూ  ఈయన సామాన్యమైన రాయిలా కనిపించినా, గొప్ప వజ్రం! ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది” అన్నారు.

3 . ఈ సంఘటన జరిగిన చాలా కాలానికి పుంతంబాకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఒకసారి శిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సదోష్టి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ ప్రక్కగా మశీదుకు వెళుతుంటే చూచి గంగగిర్ ప్రసంగం ఆపి, లేచి నమస్కరించి, వారి వెనుకనే మశీదుకు వెళ్ళారు.

అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగ్గానే గంగగిర్ ఆయనకు నమస్కరించారు. తన భక్తులతో, “పేడకుప్పవంటి యీ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రాలవంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మీరు పిచ్చివాళ్ళు గనుక ఈయనను విడచి ఎక్కడెక్కడో వెదుకుతున్నారు” అన్నాడు.

దేవిదాసు, జానకి దాసు వంటి సాధువులు సాయితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇవన్ని చూసి శ్యామాకు బాబాపై కొద్దిగా నమ్మకం కుదిరింది.

ఇటువంటి కొన్ని సంఘటనలు చూసిన తరువాత శ్యామా కి బాబా గొప్పతనం అర్థం అయ్యింది. ఆ తర్వాత బాబాకి గొప్ప భక్తుడై జీవితాంతం అయన సేవలోనే గడిపాడు.

రేపు తరువాయి బాగం…

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles