బాబా మూడు తలలతో మూడు కిరీటాలతో స్పష్టంగా కనిపిస్తున్నారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

కోడూరు కి చెందిన మహతి గారు తమకు బాబా ప్రసాదించిన దివ్య అనుభవాన్ని saileelas.com ద్వారా సాయి బంధువులతో పంచుకోవడానికి నాకు whatsapp లో పంపించారు. అవి మీకోసం క్రింద ఇస్తున్నాను. ఆమె మాటలలోనే చదవండి. ఈ లీల చదివితే బాబా ఎలా మన సందేహాలు నివృత్తి చేసి ఆనందాన్ని అనుగ్రహిస్తారు అర్థం అవుతుంది.

నా పేరు మహతి/ 2009 లో నేను, మా అమ్మ, నాన్న, మా ఫ్రెండ్ పూర్ణ గారు కలిసి ముందు గాణుగాపూర్లో నృసింహ సరస్వతి స్వామిని దర్శంచి షిరిడి పోవాలని గాణుగా పూర్లో దిగి దర్శనం చేసుకున్నాం. ఔదుంబర వృక్షానికి ప్రదక్షిమ చేసేటపుడు నాలో ఒక సందేహం కలిగింది.

బాబా దత్తావతారం కదా. శ్రీపాద వల్లభులకు నృసంహ సరస్వతికి 3 తలలున్నపుడు బాబాకు మూడు తలలు ఎక్కడా చూడలేదు. ఏమిటి బాబా? నాకు మూడు తలలతో దర్శనం ఇస్తే నా సందేహం తీరుతుంది. అని మనసులో అనుకున్నాను. బయటకు చెప్పలేదు సరికదా ప్రయాణంలో మరచిపోయాను. తర్వాత అక్కడ ఒక అవధూత దర్శనం కలిగింది. ఆ విషయం తర్వాత చెప్తాను.

షిరిడి చేరాక రూమ్ లో దగి స్నానాలు కానిచ్చి ముందు ఊరంతా తిరిగి చూశాం. ఎందుకంటే మా నాన్న అమ్మ గారికి హిందీ రాదు. కొన్ని చోట్లు చెప్పి తప్పిపోతే అక్కడకు రమ్మని చెప్పాను. మాదగ్గర ఫోన్స్ లేవు

సాయంత్రం దర్శనం కోసం వెళ్ళాము. ముందు ద్వారకామాయి దర్శించుకుని ద్వారకామాయిలోనుండి సమాధి మందిరంలోకి తలుపు ఉంది,  అది తెరచి వుంది. అందులోంచి అందరూ వెళ్తుంటే మేము కూడా వెళ్ళాము. అక్కడ ఒక స్టేజ్ వుంది. దానిపై చాలా మంది కూర్చుని బాబాను తన్మయత్వంతో చూస్తున్నారు.

దగ్గరకు వెళ్ళి దర్శించుకుందామంటే పార్టిషన్ వుంది క్యూలో రండి అన్నారు. సరే క్యూలో రావాలంటే చాలా దూరం పోవాలి. రేపు పోదాం. ఈరోజుకు ఇక్కడ కూర్చొని ధ్యానం చేద్దామని అని ఆ స్టేజి మీద కూర్చొని ధ్యానం చేస్తున్నాం.

30 ని. తర్వాత మా అమ్మగారు కళ్ళు తెరచి బాబానే చూస్తూ నేనెప్పుడు కళ్ళు తెరుస్తానా అని ఆతృతగా యెదురు చూస్తున్నారు. ఇంకో 30ని.తర్వాత నేను కళ్ళు తెరిచాను. షాక్ . శరీరానికి కరెంట్ షాక్ కొట్టినట్లైంది

బాబా విగ్రహం వెనుక గోడపై బాబా మూడు తలలతో మూడు కిరీటాలతో స్పష్టంగా కనిపిస్తున్నారు. అక్కడ అలా చెక్కారేమో నా సందేహం తీరిపోయింది అనుకున్నాను. మా అమ్మగారు నన్ను ప్రశ్నించారు. బాబా వెనుక గోడ మీద నీకేమైనా కనిపిస్తోందా అని.  షిరిడికి వచ్చిన మా బంధువులు మమ్మల్ని అక్కడ కలిశారు.

వారు మా మాటలు విని అక్కడ ఏమీ లేదు మీరేంటి మూడు తలలున్న బాబా అంటున్నారు అని అడిగారు. మళ్ళీ గోడపై చూశాం. మాకు మాత్రం స్పష్టంగా మూడు తలలు మూడు కిరీటాలతో అలాగే కనిపిస్తోంది. చాలా తర్జన భర్జనల తర్వాత క్యూలో వెళ్ళి దగ్గర నుండి దర్శించి తేల్చుకుందాం అని క్యూలో వెళ్ళాం

మేము దగ్గరగా వెళ్ళేప్పటికి ఆఖరి హారతి మొదలుపెట్టారు. మా దృష్టి బాబా పైన లేదు. ఆయన వెనుక గోడపై వుంది. ఆశ్చర్యం అక్కడ బాబా ఆకారం లీలామాత్రంగా కూడా లేదు
మాకు అప్పటికి అర్ధమైంది.  నేనడిగిన ప్రశ్నకు దివ్య దర్శనం బాబా అనుగరహించారని.

ఆనందం తట్టుకోలేక నాకు జ్వరం వచ్చేసింది. అప్పటిదాకా ఏ పుట్టలో యే పాముందో అనుకునే మా అమ్మ పూర్తిగా బాబా భక్తురాలైపోయారు.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా మూడు తలలతో మూడు కిరీటాలతో స్పష్టంగా కనిపిస్తున్నారు

sairam sai..ee experience naaku kaligindhi.. baba kanapaddaru…nenu photo kuda teesukunnanu…mundhu photo lo baba raaledhu..nenu chalaa request chesukunnanu…appudu hanuman temple ( paathagaa vunde)..baba kuda photolo vacharu..eppudu kuda aa photo vundhi naa dhaggaraa..sarvam sainaatharpanamasthu…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles