Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
వారిని వారించేందుకు దగ్గరగా ఉన్న కత్తిని అందుకున్నాడు మహల్సాపతి. పెద్దగా అరిచాడిలా.‘‘ఆగండి’’పిడుగులా శబ్దించిన మహల్సాపతి గొంతుకి భయపడి, అతని చేతిలోని కత్తిని చూసి సేవకులు ఆగారు.
‘‘బాబా చనిపోలేదు. సమాధిస్థితిలో ఉన్నారు. మూడు రోజుల తర్వాత ప్రాణం పోసుకుంటారు. అంత వరకు బాబా శరీరాన్ని ఎవరూ ముట్టుకోవడానికి వీల్లేదు.’’ అన్నాడు మహల్సాపతి.
గ్రామపెద్దను చూశారు సేవకులు. వెళ్ళండన్నట్టుగా సన్నగా తలెగరేశాడతను. దాంతో సేవకులు మళ్ళీ ముందడుగు వేశారు. బాబా దగ్గరకు రాసాగారు.
‘‘ఇదిగో మీకే చెబుతోంది. మూర్ఖంగా ప్రవర్తిస్తే ఈ కత్తితో పొడుచుకుని ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను. మీ అందరికీ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. జాగ్రత్త.’’ అన్నాడు మహల్సాపతి.
భయపడ్డారు సేవకులు. వెనుకడుగేశారు. గ్రామపెద్ద కూడా మౌనం వహించాడు.
భక్తులంతా ఆలోచనలో పడ్డారు.ప్రాణ త్యాగానికే మహల్సా తెగించాడంటే అతను చెప్పిన మాటలన్నీ నిజమే అయి ఉండవచ్చు.
మూడు రోజుల అనంతరం బాబా తిరిగి వచ్చినా రావచ్చు. ఎన్నెన్నో అద్భుతాలు చేశారు బాబా. తనని తాను బతికించుకుని, మరో అద్భుతం ఎందుకు చేయకూడదు? చేస్తారేమో! చెయ్యాలనే ఆశించారంతా.
బాబాని స్మరిస్తూ కూర్చున్నారు. ఒకరోజు గడిచింది. రెండో రోజుకి భక్తుల సంఖ్య ఎక్కువయింది. బాబా బతకాలని కోరుకుంటూ భక్తులంతా ఆయన్ని మరింతగా స్మరించసాగారు.
బాబా నామ స్మరణ ద్వారకామాయి అంతటా ప్రతిధ్వనించసాగింది. ఆకలి లేదు. దాహం లేదు. భజనగా కూర్చున్నారంతా.
బాబా స్మరణే తప్ప మరో ధ్యాస లేదెవరికీ. రెండో రోజు గడిచింది. తెల్లారింది. ముచ్చటగా మూడో రోజు వచ్చింది. ఈ రోజు బాబా తిరిగి రావాలి. ప్రాణం పోసుకోవాలి.
ఆ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి షిరిడీకి జనం పోటెత్తారు. ద్వారకామాయి అంతా భక్తులతో నిండిపోయింది. బాబా నామ స్మరణ మిన్ను ముట్టింది. అందరి కళ్ళూ బాబా పైనే! చెప్పిన గడువు సమీపిస్తోంది. బాబా లేస్తారా? లేవరా? ఉత్కంఠగా బాబానే చూస్తున్నారంతా.
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు. అంతలో బాబా కుడి చేతి వేళ్ళు సన్నగా కదిలాయి. నిజంగా కదిలాయా? భ్రమా? కళ్ళు పెద్దవి చేసుకుని చూశారంతా.
కుడి చేతి వేళ్ళు పిడికిలిగా బిగుసుకున్నాయి. ఆశ్చర్యపోయి చూడసాగారు. పెద్దగా శ్వాసించారు బాబా. అదే స్థాయిలో నిశ్వసించారు. కళ్ళు తెరిచారు బాబా.
బాబా బతికారు.బాబాకి చావు లేదు.బాబా దేవుడు. దేవదేవుడు.భక్తులంతా ‘‘సాయినాథ్ మహారాజ్‌కీ జై’’ అన్నారు.
జయ జయ ధ్వానాలు ఆకాశాన్నంటాయి. తాత్యా, శ్యామా కళ్ళల్లో కన్నీరు చోటు చేసుకుంది. అవి ఆనందబాష్పాలో, దుఃఖాశ్రువులో తెలియలేదు. ధారాపాతమయిన కన్నీటితో వారిద్దరూ ఒళ్ళు తెలియని ఉత్సాహంలో నాట్యం చేశారు. లేచి కూర్చున్నారు బాబా. చుట్టూ చూశారు.
భక్తుల ఆనందాశ్చర్యాలను చూసి పొంగిపోయారు. చేతులు జోడించి అడిగాడు మహల్సా.‘‘బాబా! ఈ మూడు రోజులూ ఎక్కడికెళ్ళావు?’’‘‘అల్లా దగ్గరకు వెళ్ళాను.’’ అన్నారు బాబా.
‘‘ఈ సంఘటన ‘72 గంటల సమాధి’గా చరిత్రలో నిలిచిపోతుంది బాబా.’’ అన్నాడు శ్యామా.‘‘నిలిచిపోనీ’’ అన్నారు బాబా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘కంగారు పడకు. నువ్వు సహకరిస్తే ఈ దేహాన్ని విడిచి మూడు రోజుల పాటు నేను సమాధి స్థితిలో ఉండాలనుకుంటున్నాను.
- బాబా దేవుడు. ఆయనకి మరణం లేదు
- మరల సాయి సన్నిధికి…..సాయి@366 సెప్టెంబర్ 11…Audio
- సాయి బాబా వారితో మహల్సాపతి అనుబంధము —Audio (All files updated)
- ఈ ద్వారకామాయి అన్ని మతాలకూ, అన్ని వర్గాలకూ, అన్ని కులాలకూ వేదికే!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments