హేమద్‌పంత్ – 2 తొలి దర్శన అనుభూతి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

తొలి దర్శన అనుభూతి

సత్సంగము కలగడం కూడా అదృష్టమే. దీనికి పూర్వజన్మ పుణ్యం కావాలి. హేమద్‌పంత్‌కి నానా, ధీక్షిత్‌లతో పరిచయం కూడా అట్లాంటిదే. నానా చందోర్కర్ మాటలు హేమద్‌కి ఎంతో నచ్చాయి. ఇక షిర్డి ప్రయాణము తప్పలేదు. బాబా పిలుపు వచ్చింది. బాబా పిలవకుండా మనము షిర్డికి వెళ్ళలేము.

బాబా తొలి దర్శనము చాలా విచిత్రంగా జరుగుతుంది. హేమద్‌పంత్ బొంబాయి నుండి దాదర్‌కి వెళ్ళి అక్కడ నుండి మన్మాడ్  మెయిల్ ఎక్కవచ్చని బావించి దాదర్ కి టిక్కెట్ తీసుకొనెను. కాని దాదర్‌లో మన్మాడ్ మెయిల్ ఆగదని హేంద్‌పంత్‌కి తెలియదు.

అప్పుడు ఒక ఫకీర్ వచ్చి ప్రయాణం ఎక్కడకు అని ఆడిగి, నీవు దాదర్‌లో దిగకుండా బోరిబందరు వెళ్లమని అతడు సలహా ఇచ్చాడు. ఈ సలహా పాటించడం వలన షిర్డికి వెళ్ళే అదృష్టం కలిగింది. ఇదే హేమద్‌కి తొలిదర్శనం. కాని గురువు వేరువేరు రూపాలలో వచ్చినప్పుడు మనం కనుగొనలేము. మనలో గురువు సర్వవ్యాపి అన్న భావన దృడంగా లేకపోతే ఇది సాధ్యపడదు.

హేమద్ తరువాత రోజు ఉదయం 9-10 గంటల మధ్య షిర్డి చేరతారు. అక్కడ కాకసాహేబ్‌, ధీక్షిత్ హేమద్ కోసం ఎదురు చూస్తున్నారు. అది 1910వ సంవత్సరం, అప్పుడు యాత్రికులు బస చేయడానికి సాఠె  వాడ మాత్రమే ఉన్నది. టాంగా దిగగానే బాబాను చూడవలెనన్న ఆరాటం పెరిగింది.

ఇంతలో తాత్యాసాహేబ్ నూల్కర్ మసీదు నుండి వచ్చి బాబా వాడా చివర ఉన్నారు. త్వరగా వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి అని చెప్పారు. వెంటనే హేమద్ పరుగున వెళ్ళి ఆ  మట్టిలోనే  బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసారు. ఈ దర్శనాన్ని గురించి హేంద్‌పంత్ ఈ విధంగా చెప్పారు.

“నేను శిరిడీలో దిగేటప్పటికి తాత్యాసాహెబ్ నూల్కర్ మశీదు నుండి తిరిగివచ్చి, త్వరగా పద, భక్తులతో కలసి బాబా వాడా మలుపు వద్దకొచ్చారు. ఆయన లెండీకి వెళ్ళకముందే పాద నమస్కారం చేసుకొందాం” అన్నాడు. నేను త్వరగా బాబా వున్న చోటుకెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను.

నాకు పట్టలేనంత ఆనందం కలిగింది.  అప్పటి నా సంతోషానికి అవధులు లేవు.  వారి దర్శనమయినందుకు నా జన్మ ధన్యమైనదనిపించింది. ప్రత్యక్షంగా సాయిబాబాను చూసి వారి దర్శనంతో నేను దన్యుణ్ణి అయ్యాను, ఎన్నడూ కనీ వినీ ఎరుగనట్టి మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది.

వారిని చూసూనే నా కన్నులు చెమ్మగిల్లాయి, ఆకలి దప్పులు అదృశ్యమయ్యాయి. నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి. సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితమంతటిలోకి మహాభాగ్యం. సాయి యొక్క చరణ స్పర్శ వారితో సంభాషణ ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. ]

ఈ అనుభూతి నానా సాహేబ్ చెప్పిన దాని కంటె అధికంగా ఉంది , మాటల్లో వ్యక్త పరచలేనిది. ఇది అపరోక్షానుభూతి. అప్పటి నుండి నాకు కొత్త జీవితం ఆరంభమైంది. నా మనస్సులోని సందేహాలన్నీ నశించాయి. అవధులులేని ఆనందం కట్టలు తెంచుకున్నది.

సాయి సన్నిధి మన మనస్సు యొక్క స్థితిని మార్చి వేస్తుంది. గత జీవిత స్థితులు అంతరించిపోయి, ఇంద్రియ విషయాలపట్ల క్రమంగా వైరాగ్యముదయిస్తుంది. కేవలం వారి దర్శనం వలన నేనెంతో పవిత్రుడనయ్యాను.

సాయి రూపంతో కన్నులు నింపుకుంటే యీ సృష్టి యావతూ సాయి రూపంగా గోచరిస్తుంది. (అటు తర్వాత) సద్గురువు అన్నమాట తలపుకురాగానే శ్రీ సాయియే మనస్సుకు స్ఫురిస్తారు. ఊధీ మన నొసట పెట్టి, ఆశీర్వచనంగా తమ చేయి మన తలపై పెట్టినట్టు దర్శనమిస్తారు”.

అప్పటి నుండి ఈ నూతన జీవితం, ఇటువంటి సత్సంగప్రాప్తి, అంగ ప్రత్యంగ సుఖానుభూతి ఎవరి కారణంగా లభించాయో వారి ఉపకారానికి నేను నిరంతరం ఋణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్ధం లభిస్తుందో వారే వాస్తవమైన ఆప్తులు మరియు బంధువులు. వారికంటే దగ్గరి బందువులు లేరని మనసులో అనుకున్నాను.  మహత్తరమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేను. అందువల్ల కేవలం చేతులు జోడించి వారి పాదాలపైన నా శిరసును ఉంచుతున్నాను.

సాయి దర్శన లాభంతో నా మనో సంశయం తొలగిపోయింది. అంతేకాదు సాయి యొక్క సమాగమంతో పరమానందం వెల్లివిరిసింది. సాయి యొక్క ధర్శనంతో చిత్తవృత్తి మారిపోయింది. అంతే కాదు పూర్వకర్మలు కూడా నశించబడతాయి. క్రమక్రమంగా విషయ సుఖాలపై విరక్తి కలుగుతుంది. ఇది వారి దర్శనంలోని విశిష్టత.

వారి కృపావలోకనంతో నా పూర్వజన్మల పాప సంచితం నశించిపోయింది. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయని నాలో ఆశ జనించింది. నా భాగ్యం కారణంగా కాకి వంటి నేను సాయి చరణ స్పర్శ వల్ల మానస సరోవరంలో హంసనై పోయాను.

సాయి మహాత్ములు సాధువులలో శ్రేష్ఠులు, పరమ యోగి, పరమ హంస. పాపతాపాలను  నశింపచేసే ఈ పుణ్యరాశి దర్శనంతో మరియు వారి సమాగమంతో నేను అత్యంత పునీతుణ్ణి అయ్యాను. నా అనేక పూర్వజన్మల పుణ్యం వల్ల ఈ సాయి మహరాజ్ కలిశారు. ఈ సాయి ఒక్కరు మనసులోకి ప్రవేశిస్తే సకలసృష్టి సాయి మయమనిపిస్తుంది. అని చాలా చక్కగా వర్ణించారు.

ఈ తొలిదర్శన అనుభూతిని ఎంతో చక్కగా హేమద్‌పంత్ మనకు అందించారు. ఇది కేవలం సాయికృప ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. మనలో కూడా ఇటువంటి అనుభూతి కలగాలి. ఈ అనుభూతి బాబా తప్పకుండా ప్రసాదిస్తారు . కాని దానికి తగిన అర్హత మనము సంపాదించాలి.

ఆయన మనలను అడిగిన ఈ అర్హత ఏమిటి?

శ్రద్ధ, సబూరి అనే రెండు విషయాలను అర్ధం చేసుకోవాలి. వాటిని మన జీవితంలోకి ఆహ్వానించాలి.  అవే మన జీవితం కావాలి. మనము బాబా మీద  అమితమైన శ్రద్ధతో ఉండగలిగితే ఇటువంటి అనుభూతిని సాయి తప్పక ప్రసాదిస్తారు.

రేపు తరువాయి బాగం…

ఈ సమాచారం ఈ  లింక్ http://saiarathi.blogspot.com/2015/09/1.html ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles