Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా దర్శనానుభవము
బాబా గారి యొక్క దర్శనము గాని, లీలలు గాని మనకు అనుకోకుండా జరుగుతాయి. ఇవే మనలని బాబా గారి వైపు దృష్టి సారించేలా చేస్తాయి. ఇక మనం బాబా గారిని వదిలిపెట్టము, ఆయన మనలని వదిలిపెట్టరు. కావలసిందల్లా అనన్యమైన భక్తి, ఓర్పు, శ్రద్ధం, సహనం.
ఈరోజు మనము సాయిలీల డిసెంబరు 1973, సంచికలో ప్రచురింపబడిన, శ్రీ వి.బి. నంద్వాని, మాహిం, ముంబాయి-16, వారు వ్రాసిన అనుభవం గురించి తెలుసుకుందాము.
*********
1973, మే, 7 వ తారీఖున, 14 సంవత్సరాల మా అబ్బాయితో షిరిడీ చేరుకున్నాను. సెలవు రోజులలో బాగా రద్దీగా ఉంటుందనే ఉద్దేశ్యంతో, సంస్థాన్ వారికి, మాకు కావలసిన గది తెలుపుతూ రిజర్వు చేయమని ముందుగానే ఉత్తరం వ్రాయడం జరిగింది.
అకామడేషన్ ఇన్ ఛార్జ్ కి ఆ ఉత్తరం ఇంతవరకు అందకపోయినప్పటికీ, ఆయన నాకు నేను అనుకున్న గదే ఇచ్చాడు. ఆ రోజు ఆయన మమ్ములను మధ్యాహ్నం 2 గంటలకు భోజనానికి కూడా పిలిచాడు. కాని, కొన్ని కారణాల వల్ల మమ్మల్ని భోజన గృహానికి తీసుకువెళ్ళడానికి 3 గంటలు దాటుతుండగా వచ్చాడు.అప్పటికి మా అబ్బాయి ఆకలితో పడుకున్నాడు.
నేను మా అబ్బాయిని అంతకుముందే బయటకు వెళ్ళి ఏదయినా తిని రమ్మని చెప్పాను. కాని ఒప్పుకోలేదు. ఇప్పుడు మేమిద్దరము భోజనానికి వెడదాము లేవమని చెప్పినా, కోపంతో నాకేమీ వద్దు అని తిరస్కరించాడు. వాడికి పెందరాళే భోజనం చేయడం అలవాటని నాకు తెలుసు. అందుచేత నేను వాడిని వదిలి సంస్థాన్ ఆఫీసర్ గారితో భోజనానికి వెళ్ళాను.
మా అబ్బాయి 4 గంటలకు లేచి, “నేను సమాధి మందిరానికి వెళ్ళను, బాబా గారికి తలవంచి నమస్కరించను. నేనిక్కడ ఉండను. ఒంటరిగానయినా సరే నేను బొంబాయి తిరిగి వెళ్ళిపోతాను” అని కోపంగా అన్నాడు. ఇదంతా కూడా ఆకలి, కోపం వల్ల వచ్చిందని నాకు తెలుసు. అందుకే మౌనంగా ఊరుకున్నాను.
కొంచెంసేపు అయిన తరువాత ఏమయినా తిందామని లేచి బయటకు వెళ్ళాడు. హోటల్లో తినకుండా 4 దోశలు పట్టుకు వచ్చి, నన్ను కూడా ఒకటి తీసుకోమన్నాడు. వాడి తృప్తి కోసం నేను ఒక దోశ తీసుకున్నాను. వాడు రెండు మాత్రమే తినగలిగాడు. ఇంకొకటి ముట్టుకోకుండా మిగిల్చాడు. దానిని ఒక బిచ్చగానికి ఇచ్చాడు.
మేము ఉన్న గది, అకామడేషన్ ఆఫీస్ కి సమాంతరముగా ఉన్న రోడ్డుని ఆనుకుని వున్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. రెండు వరుసలు ఉన్న గదుల మధ్య “ఎల్” ఆకారంలో నడవా ఉంది. ప్రవేశించే దారి పొడవుగా ఉంది. పొట్టిగా ఉన్న నడవాలో స్నానపు గదులు ఉండి ఒకవైపు మూసేసి ఉంది. అందుచేత మేము గది తలుపు తెరుచుకుని కూర్చుంటే నడవాలోంచి ఎవరు వచ్చినా, వెళ్ళినా మాకు కనపడుతుంది.
దోశ తిన్నాక మా అబ్బాయి ప్లేటు కడగడానికి స్నానపు గదులు వున్న వైపు వాష్ బేసిన్ వద్దకు వెళ్ళాడు. వాష్ బేసిన్ గదులకి బయట ఉంది. హఠాత్తుగా మా అబ్బాయి గదిలోకి వచ్చి, “స్నానపు గదులు ఉన్న నడవాలో బాబాలా ఉన్న ఒక వ్యక్తి చేతిలో కఱ్ఱ పట్టుకుని ఉన్నాడు, అందుచేత భయపడి వచ్చేశాను” అని చెప్పాడు. ఇదంతా కూడా మా అబ్బాయి తలుపు తీసి ఉన్న మా గది గుమ్మంలో నుంచుని చెప్పాడు.
నేను గదిలో కూర్చున్న స్థితిలో మా గది ముందునుంచి ఎవరు వెళ్ళినా, వచ్చినా ఖచ్చితంగా కనపడి తీరవలసిందే. నేను వెంటనే లేచి, మా అబ్బాయితో స్నానపుగదులు ఉన్న చోటికి వెళ్ళి చూడగా, అక్కడ ఎవరూ కనపడలేదు. మా అబ్బాయికి దర్శనమిచ్చినది బాబాగారే అని నాకనిపించింది. నడవాలోంచి ఎవరూకూడా నడిచి వెళ్ళడం నా కంటికి కనపడలేదు. ఎవరు అలా గాలిలో మాయమైపోగలరు? మిగతా గదులలో ఎవరూ కూడా అలా బాబా దుస్తులలో లేరు.
ఇంకా ప్రశ్నించిన మీదట మా అబ్బాయి, ఆ వ్యక్తి ఒక చేతి వైపు, క్రింద బాగా చిరిగిన కఫ్నీ ధరించి ఉన్నాడని చెప్పాడు. అతను సట్కాతో సమాధి మందిరం వైపు చూపించాడని చెప్పాడు.
తరువాత సాయంత్రం 6 గంటలకు, మా అబ్బాయి నాతో కూడా సమాధి మందిరానికి, ద్వారకామాయికి, చావడికి వచ్చి ప్రతీ చోటా బాబా గారికి నేను చేసినట్లే నమస్కారం చేశాడు. మేమున్న వారం రోజులలో చాలా సంతోషంగా గడిపి స్నేహితులను కూడా సంపాదించుకున్నాడు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
- కారు గుద్దగానె నేను బాబా బాబా బాబా …అంటూ బాబా నామం చెబుతూ సృహ కోల్పోయాను.–Audio
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- బాబా మమ్మల్ని కరుణించి మా ఇంటికి వస్తున్నవా బాబా
- తన మందిర (దిల్ సుఖ్ నగర్ బాబా గుడి) నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments