కారు గుద్దగానె నేను బాబా బాబా బాబా …అంటూ బాబా నామం చెబుతూ సృహ కోల్పోయాను.–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్

మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-130-కారు గుద్దగానె నేను బాబా 4:29

బాబావారి పాదపద్మములకు నమస్కరించి వారు ప్రసాదించిన “పునర్జన్మ” ను మీ అందరితో పంచుకుంటున్నందుకు ఆనందంగా వుంది. నా పేరు జి. వెంకటనారాయణ. మా నివాసము నెల్లూరు.

1989 వ సంవత్సరం సెప్టెంబరు 16వ తేది నెల్లూరు నుండి గుంటూరుకు నేను, మా అసోషియేషన్ సభ్యులు మరియు నా రెండవ కుమారుడు విజయభాస్కర్(చిన్నా) అందరము కారులో ప్రయాణమయాము, ఎడ్లపాడు గ్రామము, పత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా నేషనల్ హైవే వద్ద ఒక సిలెండర్ల లారి స్పీడుగా వచ్చి మా కారును గుద్దింది.

కారులో వెనుక కూర్చున్న వారందరూ ఎగిరి బయట పడ్డారు. కారుడోర్లు పగిలి బైటపడిపోయినాయి.

కారు ముక్కలు ముక్కలైంది కారు గుద్దగానె నేను బాబా బాబా బాబా …అంటూ బాబా నామం చెబుతూ సృహ కోల్పోయాను.

కారు డ్రైవర్ స్పాట్ డైడ్. నాకు రెండు కాళ్ళు పూర్తిగా పగిలిపోయి ఎముకలు వ్రేలాడుతున్నాయి.

కారులో ఇద్దరికీ మాత్రం చిన్న చిన్న రక్తపు గాయాలయినాయి.

వారు గబా గబా లేచి మిగతా వారిని హాస్పిటల్ కి తీసుకొనిపోయే దానికి హైవే మీద పోయే వాహనాలు ఆపితే ఎవరు ఆపలేదు.

ఇంతలో ఒక పెద్దాయన 65, 70 సంవత్సరాలు వుండవచ్చు. (వచ్చింది బాబానే అని నా నమ్మకం) అతను మా దగ్గరకు వచ్చి నేను నా కారులో హాస్పిటల్ కి తీసుకోని పోతాను అని లేవలేని నన్ను వచ్చి కాళ్ళు చేతులు పట్టుకోగానే నాకు సృహవచ్చి బాబా బాబా అంటూ అరవటం మొదలు పెట్టాను.

కారులో గుంటూరు హాస్పిటల్ కు తీసుకోని పోయి చేర్పించారు. హాస్పిటల్ లో చేర్పించిన తరువాత దాదాపు 40 రోజులు నేను కోమాలో వున్నాను. 25 లీటర్లు రక్తము ఎక్కించారు.

నా కాళ్ళు అంతా చితికిపోయి ఎముకలు బయటకు వ్రేలాడుతున్నాయి.

డాక్టర్లు కాళ్ళు పనికిరావు తీసెయ్యాలి అన్నారు.

కాని బాబా దయవలన నా కాళ్ళు తీసివేసే పరిస్థితి కలగలేదు.

హాస్పిటల్ లో “బాబా బాబా బాబా” అంటూ వుంటే అక్కడి డాక్టర్లు అయిన సాయిబాబా, రామ్మోహనరావు గార్లు ఏంది ఈ పెద్దాయన వూరికినే బాబా బాబా అంటున్నాడు వాళ్ళ నాన్ననా అని అడిగారంట.

మా ఇంట్లో వాళ్ళు అయన సాయిబాబా భక్తుడు అని వారికి చెప్పడం జరిగిందట.

నేను దాదాపు 40 రోజుల వరకు కోమాలోనే వున్నాను .ఇక్కడ నా కుమారుడు విజయభాస్కర్(చిన్నా) మెదడు దగ్గర నరాలు తెగిపోయి మూడవరోజు బాబాను చేరుకున్నాడు.

ఆ విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను 40 రోజులు కోమాలో వున్నాను కాబట్టి. 4 నెలల తరువాత హాస్పిటల్ నుండి నన్ను డిశ్చార్జి చేశారు.

నేను కోమా నుండి బయటకు రాగానే నా చిన్నకుమారుడు ఏడి అని మా వాళ్ళను అడిగాను.

వాడు బాగానే వున్నాడు వూరికి పోయి వున్నాడని చెప్పారు. తరువాత నిదానంగా వాడు మరణించిన సంగతి నాకు మా వాళ్ళు చెప్పారు. లారి వారి మీద కేసు నమోదైంది.

ఒక రోజు వాయిదాకు రైలులో పోతుంటే మమ్మల్ని కారులో హాస్పిటల్ కి చేర్చిన అయన కనబడ్డాడు. ఎం? ఇమ్కానువ్వు బ్రతికి వున్నావా?

అని అడిగారు. నేను కంట తడిపెట్టుకొని ఆయన పాదాల మీద పడ్డాను. మీరు సమయానికి హాస్పిటల్ కి చేర్చకుంటే అక్కడే నేను మరణించేవాడిని . మీ దయవల్ల నేను సమయానికి హాస్పిటల్ కి చేర్చబడి బ్రతికానన్నాను.

నన్ను భుజంతట్టి “అంతా భగవంతుడి దయ” అన్నారు. కొంతసేపయిన తరువాత చేస్తే ఆయన కనిపించలేదు. ఆ రోజు యాక్సిడెంట్ అయినపుడు వచ్చిన ఆయన “సాయిబాబా” అని నా నమ్మకము.

రైలులో కనపడి మాట్లాడగానే మరలా ఉన్నట్లుంది కనపడలేదు. ఇదంతా బాబా కృప. యాక్సిడెంట్ తరువాత బాబా అంటే ప్రాణానికి ప్రాణం అయింది.

ప్రతి నిత్యం బాబా నామ జపం చేస్తూ బాబాను పూజిస్తూన్నాను.

జి. వెంకటనారాయణ
నెల్లూరు.
సెల్:9705042921

సంపాదకీయం: సద్గురులీల (ఆగష్టు  – 2011)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles