నాకిక ఏ భయము లేదు. నేను శ్రీ సాయి భక్తురాలిని–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్

మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-131-నాకిక ఏ భయము లేదు 2:44

ముత్తుకూరు సముద్రతీర గ్రామం ఆ చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలకు పోవాలంటే సముద్రం నీటిలో పడవ మీద వెళ్ళాల్సిందే.

ఆ రోజు మేము పోవాలనుకున్న ఊరికి పడవమీద వెళ్ళాల్సిందే. పడవకోసం నేను, మావారు ఇద్దరమే నిలబడివున్నాము కనుచూపుమేరలో మనుష్యులెవారు కనబడలేదు,

సూర్యుడు కూడా కనుమరుగై చాలా సేపైంది. చుట్టూ చెట్లు ఓవైపు సముద్రం,

సముద్రం మీది నుండి గాలులు చెట్లనుతాకి వింత శబ్దాలు, కన్ను పొడుచుకున్నా రవంత వెలుతురు కూడా లేదు, అక్కడ మేమిద్దరమే, క్రమంగా చికటి చిక్కబడుతుంది.

మా ఇద్దరికీ గుండెలు జారిపోతున్నాయి. ఆపద్భాంధవుడు శ్రీ శిరిడి నాథుని తలచుకుంటూ జారిపోతున్న నా గుండెను ఓడిసిపట్టుకున్నాను.

అంతలో కొంతమంది మగవారు(సుమారు ముప్పై మంది వుంటారు) అక్కడికి వచ్చారు.

అందరూ అక్కడే వున్న పడవ ఎక్కారు. అ పడవ వెళ్ళిపోతే మాకు దిక్కులేదు.

కాని, అందులో అందరూ మగవారే పైగా ముప్పై మంది వరకు వుంటారు,

నేను ఒక్కదానినే ఆడదానిని. నాకు మావారికి ధైర్యం చాలడంలేదు. నేను మనసులోనే బాబా పాదాలను గట్టిగా వదలకుండా పట్టుకున్నాను.

ఇంతలో ఆ పడవలోని వారు మమ్మల్ని చూసి, రండమ్మా, పడవ ఎక్కండి వెళ్దాం అన్నారు.

ఆ మాటలు బాబా గొంతులో నుండి  వచ్చినట్లుగానే అనిపించాయి. మేమిద్దరం బొమ్మల్లా పడవ ఎక్కాం,

పడవ ముందుకు సాగుతుంది. నా మనసు బాబా కాళ్ళ ముందు వుంది, గట్టిగా మా వారిని పట్టుకొని వున్నాను.

కళ్ళు గట్టిగా ముసుకోనివున్నాను. అలా ఏంతసేపు వున్నానో తెలియదు.

దిగండమ్మా ఉరోచ్చేసింది అన్నమాటలు విని ఈలోకంలోకి వచ్చాను, మంత్రించిన దానిలా పడవ దిగినాను మా వారి చేయిపట్టు కొని, అప్పటివరకు మా మధ్యనేవున్న సాయినాథునికి మనసులోనే  సాష్టాంగ నమస్కారములు చేసినాను.

అప్పటినుండి శ్రీ సాయినాథుడు నిరంతరం నా వెంటే వున్నారు. నాకిక ఏ భయము లేదు. నేను శ్రీ సాయి భక్తురాలిని, ఆయన అందరికి ఆపద్భాంధవుడు అని నా స్వాఅనుభవముతొ చెపుతున్నాను.

ఓ. అరుణ,శాంతినగర్
ముత్తుకూరు,నెల్లూరు జిల్లా.

సంపాదకీయం: సద్గురులీల (ఏప్రియల్  – 2009)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నాకిక ఏ భయము లేదు. నేను శ్రీ సాయి భక్తురాలిని–Audio

B.mallesh

Baba is great

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles